ETV Bharat / health

చలికాలంలో చర్మ సమస్యలా? ఇది పెట్టుకుంటే అన్నీ మాయం! మీరు ట్రై చేయండి! - AYURVEDA TREATMENT FOR WINTER SKIN

-శీతాకాలంలో చర్మ సమస్యలకు ఆయుర్వేద ఔషధం -ఎలా తయారు చేయాలో వివరిస్తున్న నిపుణులు

Winter Skin Care Home Remedies
Winter Skin Care Home Remedies (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : Dec 6, 2024, 4:18 PM IST

Winter Skin Care Home Remedies: చలికాలం రకరకాల చర్మ సమస్యలను వస్తుంటాయి. ఫలితంగా చర్మం పొడిబారిపోయి నిర్జీవంగా మారి ముఖమంతా కాంతివిహీనంగా తయారవుతుంది. దీంతో చలి నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు రకరకాల మాయిశ్చరైజర్లు, కోల్డ్ క్రీములు పెడుతుంటారు. ఇవే కాకుండా ఇంట్లోనే లభ్యమయ్యే పదార్థాలతో మంచి చర్మ ఔషధాన్ని తయారు చేసుకోవచ్చని ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ గాయత్రీ దేవీ చెబుతున్నారు. మరి ఈ ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలి? ఇందుకోసం కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

  • 20 గ్రాముల కచ్చురాల చూర్ణం
  • 20 గ్రాముల వట్టివేర్లు చూర్ణం
  • ఒక చెంచా చందనం చూర్ణం
  • 20 గ్రాముల గులాబి రేకుల పొడి
  • 100 గ్రాముల పెసరపిండి
  • నువ్వుల నూనె
  • మల్లెపూలు

తయారీ విధానం

  • ముందుగా ఓ గిన్నెలో కచ్చురాలు, వట్టివేర్లు, చందనం చూర్ణం, గులాబీ రేకుల పొడి, పెసరపిండి వేసి బాగా కలపాలి.
  • ఆ తర్వాత ఇందులోనే మల్లెపూలను తుంచి వేసి అన్ని బాగా కలిపేసుకోవాలి.
  • స్నానం చేయడానికి ముందు నువ్వుల నూనెను శరీరం అంతా రాసుకోవాలి. సుమారు అరగంట తర్వాత ముందుగా తయారు చేసుకున్న ఔషధాన్ని ఒళ్లంతా సున్నిపిండిలా రుద్దుకోవాలని చెబుతున్నారు.
  • ఇలా చలికాలంలో ప్రతిరోజూ వాడుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుందని గాయత్రీ దేవీ చెబుతున్నారు. ఇంకా ఇతర చర్మ సమస్యలు కూడా తగ్గుతాయని వివరిస్తున్నారు. చర్మం మృదువుగా, సున్నితంగా ఉండేందుకు కూడా మంచి ఔషధంలా ఉపయోగపడుతుందని అంటున్నారు.

కచ్చురాలు: చర్మం ఆరోగ్యంగా ఉండడానికి కచ్చురాలు ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా చర్మంలో ఉండాల్సిన తేమ, నూనె పదార్థం సరిగ్గా ఉండేలా చేస్తుందని అంటున్నారు.

వట్టివేర్లు: ఇవి చర్మానికి మంచి రంగు ఇస్తాయని గాయత్రీ దేవీ చెబుతున్నారు. టానిక్​లాగా ఉపయోగపడుతూ తేమ, తడి సరిగ్గా ఉండేలా తోడ్పడతాయని వివరించారు.

చందనం ; చర్మానికి చందనం ఎంతో మంచి చేస్తుందని చాలా మందికి తెలుసు. ఇది చర్మం పరిశుభ్రంగా, మంచి రంగు ఉండేందుకు ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

గులాబీ రేకులు; ఎంతో సున్నితంగా ఉండే గులాబీ రేకులు చర్మాన్ని కూడా ఇలానే మృదువుగా చేయడానికి తోడ్పడతాయని వివరిస్తున్నారు.

పెసరపిండి: చలికాలంలో చర్మానికి కావాల్సిన నూనె ఎక్కువ సేపు ఉండేలా చేస్తుందని చెబుతున్నారు.

NOTE: ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

చలికాలంలో ఇది తీసుకుంటే మీ ఇమ్యూనిటీ డబుల్! రోగాలు రాకుండా కాపాడుతుందట!

వింటర్ స్కిన్ కేర్ టిప్స్- ఇలా చేస్తే చర్మంపై పగుళ్లు పోయి అందం మీ సొంతం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.