ETV Bharat / health

వృద్ధాప్యం శాపం కావొద్దంటే - 30 ఏళ్లు దాటిన వారు ఇవి తినొద్దు!

These Foods Avoid After 30 Years : వయసు పెరిగే కొద్దీ ఆరోగ్య సమస్యలు రావడం సహజం. కానీ.. 50 ఏళ్లు దాటకుండానే కర్ర పట్టుకొని నడుస్తుంటారా చాలా మంది! ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే.. 30 ఏళ్లు దాటిన వారు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Avoid Foods
These Foods Avoid After 30 Years
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 11, 2024, 9:51 AM IST

Avoid These Foods After 30 Years : థర్టీ ఇయర్స్ లైఫ్ ఇండస్ట్రీలో ఇష్టమొచ్చినట్టుగా ఉండొచ్చు.. నచ్చింది తినొచ్చు.. ఎంజాయ్ చేయొచ్చు! కానీ.. 30 ఏళ్లు దాటిన తర్వాత కూడా మీరు ఫిట్​గా ఉండాలంటే.. ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. వీలైనంత వరకు కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు.

రెడీగా ఉన్న సూప్​లు: మీరు 30 ఏళ్ల తర్వాత ఆరోగ్యంగా ఉండాలంటే వీటికి దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే ఈ సూప్‌లలో అధిక మొత్తంలో ఉప్పు ఉంటుంది. ఇది రక్తపోటును పెంచుతుంది. అలాగే వాటిలో కొన్ని క్యాన్సర్, వంధ్యత్వం, బరువు పెరగడానికి కారణమయ్యే బిస్ఫినాల్ A అనే రసాయనాన్ని కూడా కలిగి ఉంటాయి. కాబట్టి మీరే సొంతంగా సూప్ ప్రిపేర్ చేసుకోవడం మంచిది.

క్రీమ్ బిస్కెట్స్ : ఇవి కూడా ఆరోగ్యానికి మంచివి కావు. వీటిలో షుగర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. కాబట్టి అధిక చక్కెర కలిగిన వీటిని తీసుకుంటే ఇన్సులిన్ సమస్య పెంచుతాయి. ఫలితంగా.. మధుమేహం వచ్చే అవకాశం ఉంటుంది. దీంతోపాటు మరికొన్ని ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. స్త్రీలలో పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్​(PCOS)కి దారి తీస్తుంది.

కేకులు, బ్రెడ్, కుకీలు : ఈరోజుల్లో ఎక్కువ మంది బ్రేక్​ఫాస్ట్​, స్నాక్స్​ టైమ్​లో ఎక్కువగా ఇవి లాగిస్తున్నారు. 30 ఏళ్ల తర్వాత మాత్రం వీటికి పూర్తిగా దూరంగా ఉండడం మంచిది. గోధుమ పిండి, కొవ్వు, చక్కెర, నీరు, ఉప్పుతో తయారుచేసే ఆహారాలతోపాటు కేకులు, బ్రెడ్, టార్ట్​, పైస్​, కుకీలు.. ఇవన్నీ ఆరోగ్యానికి మంచివి కావు. వీటిని ఎక్కువగా తినడం ద్వారా త్వరగా బరువు పెరుగుతారు.

కాక్​ టెయిల్స్ : చాలా మంది అధిక ఆల్కహాల్ తీసుకున్నప్పుడు మరుసటి రోజు హ్యాంగోవర్ అయితే కాక్ టెయిల్స్ తాగుతుంటారు. కొందరు పార్టీలలో వీటిని డ్రింక్ చేస్తుంటారు. కానీ.. 30 ఏళ్ల తర్వాత మాత్రం వీటికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే.. ఈ పానీయాలలో అధిక చక్కెర ఉంటుంది. వీటిని తాగడం వల్ల బరువు పెరగడమే కాకుండా నిద్రకు భంగం కలిగిస్తాయి.

బీరు : దీనిలో కేలరీలు చాలా ఎక్కువ. ఇది తాగడం వల్ల పురుషులలో త్వరగా బెల్లీ ఫ్యాట్ వస్తుంది. అందువల్ల ముఫ్పై ఏళ్ల తర్వాత మాత్రం బీరుకి దూరంగా ఉండడం మంచిది అంటున్నారు నిపుణులు. వారాంతంలో ఒక గ్లాసు తీసుకోవడం మంచిదే కానీ.. అధిక మొత్తంలో తీసుకుంటే అకాల వృద్ధాప్యానికి దారితీయవచ్చు. అందులోని ఆల్కహాల్ చర్మాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. తద్వారా ముడతలు ఏర్పడతాయి.

బర్గర్లు : మీరు వెజిటేరియన్ అయితే.. ముఖ్యంగా బాడీలో B12 లెవెల్స్ కోల్పోకుండా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఇది తగినంత లేకపోవడం వల్ల అలసట పెరుగుతుంది. అలాగే వివిధ ఆరోగ్య సమస్యలు వస్తాయి. పాలు, చీజ్, యోగర్ట్ ద్వారా విటమిన్ బి 12 వస్తుంది. కాబట్టి మీరు వాటిని తీసుకోకుండా వెజ్జీ బర్గర్‌లు తీసుకుంటే ఆరోగ్యాన్ని చేజేతులా పాడుచేసుకున్నట్టే.

ప్రాసెస్​ చేసిన నాన్​వెజ్ ఫుడ్స్ : ఇవి రుచికరమైనవి అయినప్పటికీ, ఆరోగ్యానికి మంచిది కాదు. ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. పురుషుల స్పెర్మ్ కౌంట్‌ను తగ్గిస్తాయి.

ఇవేకాకుండా ప్యాక్ చేసిన బటర్​ పాప్‌కార్న్​, ఆర్టిఫిషియల్ స్వీటెనర్లు, ఐస్‌డ్ కాఫీ, సోయా సాస్, కాఫీ ఐస్ క్రీం, స్పోర్ట్స్​ డ్రింక్స్ వంటి వాటికి.. ముఫ్పై ఏళ్ల తర్వాత వీలైనంత వరకు దూరంగా ఉంటే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఉదయం టిఫెన్​లో ఇవి తిన్నారంటే - ఆరోగ్యం నాశనమైపోతుంది!

ఆ కూరగాయలను వండకుండా తింటున్నారా? ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్టే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.