ETV Bharat / health

చీటికీ మాటికీ చెవిలో కాటన్​ బడ్స్​ పెడుతున్నారా? - ఈ విషయాలు తెలుసుకోకపోతే ముప్పు తప్పదు! - Side Effects of Using Cotton Buds - SIDE EFFECTS OF USING COTTON BUDS

Cotton Ear Buds: స్నానం చేసిన వెంటనే దూది పుల్లలను చెవిలో పెట్టి తిప్పేస్తుంటారు చాలా మంది. అయితే ఈ పద్ధతి మంచిది కాదని నిపుణులు అంటున్నారు. దీని వల్ల అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

Are You Used Cotton Ear Buds
SIDE EFFECTS OF USING COTTON BUDS (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 7, 2024, 9:25 AM IST

Updated : Jun 7, 2024, 9:35 AM IST

Are You Used Cotton Ear Buds?: చెవి శుభ్రం చేసుకునేందుకు, ఇయర్ వ్యాక్స్ (గులిమి) తొలగించుకునేందుకు, దుమ్ము, ధూళిని తీయడానికి సాధారణంగా చాలా మంది కాటన్ బడ్స్ వాడతుంటారు. అయితే, ఇలా చీటికీ మాటికీ చెవిలో పుల్లలు పెట్టడంతో మేలు కంటే కీడే ఎక్కువని అంటున్నారు. ఈ అలవాటుతో అనేక ప్రమాదాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. మరి కాటన్​ బడ్స్​ ఉపయోగిస్తే ఎటువంటి సమస్యలు వస్తాయో ఈ స్టోరీలో చూద్దాం..

సాధారణంగా చెవికి దాన్నంతట అదే శుభ్రం చేసుకునే వ్యవస్థ ఉంటుంది. ఇందులో భాగంగా చెవి గులిమి, మృతకణాలు వాతంట అవే బయటకు వచ్చేస్తాయి. అతిగా ఇయర్ బడ్స్ వాడకం ఈ ప్రక్రియకు అడ్డుగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇయర్​ బడ్స్​ అతిగా వాడితే వచ్చే సమస్యలు:

  • అతిగా ఇయర్ బడ్స్ వాడితే చెవిలోని వ్యాక్స్ మరింత లోపలకు పోయి అడ్డంకిగా మారే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. దీంతో, చెవిలో ఏదో చప్పుడు అవుతున్నట్టు, వినికిడి శక్తి తగ్గినట్టు అనిపిస్తుందని చెబుతున్నారు.
  • 2015లో "ఓటోలారిన్జోలాజీ హెడ్ అండ్ నెక్ సర్జరీ" జర్నల్​లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం చెవిలో మైనపు పదార్థాన్ని తొలగించడానికి కాటన్ బడ్స్ ఉపయోగించే వ్యక్తులకు చెవి నొప్పి, చెవి మూసుకుపోవడం, చెవి నుంచి స్రావం, చెవిపోటు వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో న్యూయార్క్ నగరంలోని మౌంట్ సినాయి స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో ఓటోలారిన్జోలాజీ-హెడ్ అండ్ నెక్ సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ జోనాథన్ షాన్ పాల్గొన్నారు. చెవిలో వ్యాక్స్​ను తొలగించుకోవడానికి కాటన్​ బడ్స్​ బదులు సురక్షితమైన పద్ధతులు వాడాలని ఆయన సూచించారు.

అలర్ట్​: మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? - మీ ఆరోగ్యానికి ముప్పు ఉన్నట్టే! - High Cholesterol Warning Signs

  • చెవి నాళిక చాలా మృదువుగా ఉంటుంది. తరచూ ఇయర్ బాడ్స్ వాడితే చెవి నాళికలోని పైపొరలు దెబ్బతింటాయని.. దీంతో నొప్పి, ఇన్ఫెక్షన్ల వంటివి తలెత్తుతాయని.. బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫె్క్షన్లు తలెత్తొచ్చని నిపుణులు అంటున్నారు.
  • చెవిలో దూది పుల్లలను పెట్టడం.. చెవిలో నొప్పి పుట్టించే ఓటిటిస్​ ఎక్స్​టర్నల్​ ఇన్​ఫెక్షన్​కు కారణమవుతుందని నేషనల్​ లైబ్రరీ ఆఫ్​ మెడిసిన్​ జర్నల్​లో పేర్కొన్నారు. చెవి లోపల ఇన్ఫెక్షన్​ వస్తే నొప్పి, దురద, చీము పట్టే ప్రమాదం ఉందని.. తాత్కాలిక లేదా శాశ్వత వినికిడి లోపాలు ఏర్పడవచ్చని కనుగొన్నారు. ఈ ఇన్​ఫెక్షన్ల స్థాయి పెరిగితే కర్ణభేరి ఇబ్బందుల్లో పడుతుందని చెబుతున్నారు. చెవుడుతో పాటు మెదడువాపు వ్యాధి కూడా వస్తుందని, మెదడు నరాలకు ఇన్​ఫెక్షన్​ సోకుతుందని అంటున్నారు.
  • చెవిలో సెబమ్ అనే పదార్థం ఉంటుంది. ఇది బ్యాక్టీరియా, ఇతర హానికరమైన జీవుల నుంచి రక్షణ కల్పిస్తుంది. అయితే కాటన్ బడ్స్ ఈ సెబమ్‌ను తొలగించి.. చెవిని ఇన్ఫెక్షన్లకు మరింత అనుకూలంగా చేస్తాయి. దీంతో దురద, చెవి ఎర్రబడటం, డిశ్చార్జ్ వంటివి వస్తాయని చెబుతున్నారు.

ఇవి పాటిస్తే సేఫ్​:

  • సాధారణంగా బయటి చెవిని తడి బట్టతో శుభ్రం చేసుకుంటే సరిపోతుందని నిపుణులు అంటున్నారు. ప్రత్యేకంగా ఇయర్ బడ్స్ అవసరం లేదని అంటున్నారు.
  • మెడికల్ షాపులల్లో దొరికే ఇయర్ డ్రాప్స్ చెవిని సులువుగా శుభ్రం చేస్తాయని.. గులిమి కరిగిపోయి బయటకు వచ్చేలా చేస్తాయని అంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

అలర్ట్​: ఎగ్స్​ తింటే షుగర్ వస్తుందా? - పరిశోధనలో ఆశ్చర్యకరమైన విషయాలు! - Eating too Many Eggs Cause Diabetes

మీరు వాడుతున్న వంట నూనె మంచిదా? - కల్తీ చేశారా? - ఇలా ఈజీగా తెలుసుకోండి! - Tips To Identify Fake Cooking Oil

Last Updated : Jun 7, 2024, 9:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.