ETV Bharat / health

యాపిల్ వెనిగర్​తో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్- అలా అని ఎక్కువ వాడితే అంతే సంగతి! - Apple Cider Vinegar Uses And Side Effects - APPLE CIDER VINEGAR USES AND SIDE EFFECTS

Apple Cider Vinegar Benefits And Side Effects : కేవలం వంటకు మంచి రుచిని అందించడం మాత్రమే కాదు, సరైన పరిమాణంలో వాడితే ఆపిల్ సైడర్ వెనిగర్​తో ఎన్నో ఆరోగ్య ప్రయెజనాలున్నాయట. మోతాదుకు మించి వాడితే నష్టాలు కూడా ఉన్నాయట. అవేంటంటే?

Apple Cider Vinegar Benefits And Side Effects
Apple Cider Vinegar Benefits And Side Effects (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 7, 2024, 3:22 PM IST

Apple Cider Vinegar Benefits And Side Effects : ఆపిల్స్, షుగర్, ఈస్ట్ మూడింటినీ కలిపి కొన్ని వారాల పాటు పులియబెడితే తయారయే మిశ్రమమే ఆపిల్ సైడర్ వెనిగర్. ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా, ఈస్ట్, ప్రోబయోటిక్స్ కలయికగా ఉండే దీనికి చాలా చరిత్ర ఉంది. ఒకప్పుడు ఆహారాన్ని సంరక్షించేందుకు, సువాసన అందించేందుకు దీన్ని ఉపయెగించే వారు. దీంట్లో యాంటీ మైక్రోబయల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉండే ఆపిల్ సైడర్ వినిగర్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తాజాగా చేసిన కొన్ని అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే?

ఆపిల్ సైడర్ వెనిగర్​ను ప్రస్తుతం చాలా మంది ఆహారాన్ని సంరక్షించేందుకు, డ్రెస్సింగ్ చేసేందుకు, పరిశుభ్రత కోసం, పండ్లు, కూరగాయలను కడిగేందుకు, ముఖానికి టోనర్​గా, జుట్టును శుభ్రం చేయడానికి, చుండ్రును తొలగించుకునేందుకు, మౌత్ వాష్​గా ఇలా చాలా రకాలుగా ఉపయోగిస్తుంటారు. వీటితో పాటు ఆపిల్ సైడర్ వెనిగర్​తో కలిగే ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయట.

మధుమేహ నియంత్రణకు!
సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం 95% మంది మధుమేహ వ్యాధి గ్రస్తులకు టైప్-2 డయాబెటిస్ ఉంటోంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇన్సులిన్ ఉత్పిత్తి తక్కువగా ఉండటం వల్ల టైప్-2 డయాబెటిస్ వస్తుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ ఇన్సులిన్ ప్రతిస్పందనను మెరుగుపరుస్తుందని, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. నిద్రపోయే ముందు, నిద్ర లేచిన తర్వాత ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.

బ్యాక్టీరియాను!
సహజంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునే వారికి యాపిల్ సైడర్ వెనిగర్ చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. సూక్ష్మజీవులను నాశనం చేసి వ్యాధులను అరికట్టే శక్తి దీనికి ఉంటుంది. దీంట్లోని అసిడిక్ యాసిడ్, బ్యాక్టీరిసైడ్ వంటివి ఆహార పదార్థాలలో ఈకోలీ, నోరో వైరస్లను ఏర్పడకుండా కాపాడుతుంది. ఆహార పదార్థాల్లో ఈకోలి ఉండటం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలున్నాయట.

బరువు తగ్గించేందుకు!
యాపిల్ సైడర్ వెనిగర్​తో మరో ప్రయోజనం ఏంటంటే బరువు తగ్గడంలో ఇది బాగా సహాయపడుతుంది. భోజనానికి ముందు భోజనం చేసే సమయంలో ఇది తీసుకోవడం వల్ల కడుపుకు తృప్తిగా అనిపించి ఆహారం తక్కువ మొత్తంలో తీసుకుంటారు. ఫలితంగా బరువు నియంత్రణలో ఉంటుంది.

కొలెస్ట్రాల్ స్తాయిలు మెరుగ్గా!
అధిక కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలు గుండెజబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి.రోజుకు 28గ్రాముల యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవడం వల్ల కేలరీతో పాటు హానికరమైన కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైజ్ స్థాయిలు తగ్గి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి.

తగిన మోతాదులో తీసుకుంటే ఎన్నో లాభాలు కలిగించే ఆపిల్ సైడర్ వెనిగర్ మోతాదుకు మించి తీసుకుంటే నష్టాలకు దారితీస్తుందట. ఎక్కువ మొత్తంలో ఆపిల్ సైడర్ వెనిగర్​ను తీసుకోవడం వల్ల హైపోకలేమియా అంటే తక్కువ పొటాషియం స్థాయిలకు దారితీస్తుంది.మూత్ర విసర్జన, ఇన్సులిన్ సమస్యలు వచ్చే ప్రమాదముంది. వికారం, వాంతులు కలగవచ్చు.

ముఖ్య గమనిక : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.