Aluminum Foil Face Pack : అల్యూమినియం ఫాయిల్ ఇప్పుడు చాలా మంది ఇళ్లలోని వంటగదుల్లో ఉంటుంది. ఆహార పదార్థాలు పాడవకుండా చక్కగా ప్యాక్ చేసేందుకు దీన్ని ఎక్కువ మంది ఉపయోగిస్తుంటారు. కేక్, బ్రెడ్ వంటివి తయారు చేయడానికి కూడా దీన్ని వాడుతుంటారు. అంతేకాదు మొండిగా మారిన కత్తులను, కత్తెరను పదును చేసందుకు కూడా అల్యూమినియం ఫాయిల్ చక్కగా సహాయపడుతుంది. ఇవన్నీ సరే, కానీ అందాన్ని రెట్టింపు చేయడంలోనూ అల్యూమినియం ఫాయిల్ చాలా బాగా ఉపయోగపడుతుందని మీకు తెలుసా. అవును ముఖానికి అల్యూమినియంతో ప్యాక్ చేయడం వల్ల అద్భుతం జరుగుతుందట.
అల్యూమినియం ఫాయిల్‌పై జరిగిన కొన్ని పరిశోధనల్లో అందాల ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే చాలా విషయాలు బయటపడ్డాయి. శరీరంపై ఇది మ్యాజిక్‌లా పనిచేస్తుందని తేలింది. కేవలం ఓ గంట పాటు అల్యూమినియం ఫాయిల్‌తో ముఖాన్ని కవర్ చేస్తే, ఎన్నో చర్మసమస్యలు చికిత్స రహస్యంగా చికిత్స జరుగుతుందని పరిశోధకులు నమ్మకంగా చెబుతున్నారు. ముఖం వాపు, నల్లటి మచ్చలు, మొటిమలు వంటి వాటిని తొలగించడం సహా యాంటీ ఏజింగ్ సీక్రెట్ లా ఇది పనిచేస్తుంది. చాలా మంది సెలబ్రిటీలు, సౌందర్య నిపుణుల బ్యూటీ సీక్రెట్ కూడా ఇదేనట.
అల్యూమినియం ఫాయిల్ చేయగలిగే అద్భుతాలు ఇవే!
మీరు అలసిపోయినట్లుగా ఫీలయినప్పుడు, కళ్లకింద నల్లటి వలయాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు అల్యూమినియం ఫాయిల్ మీకు చక్కటి ప్రయోజనాలను కలిగిస్తుంది. ఇందుకు మీరు చేయాల్సిందల్లా, అల్యూమినియం పేపర్ తీసుకుని ముఖం ఆకారానికి తగ్గట్టుగా కత్తిరించుకుని ఫ్రిజ్‌లో పెట్టాలి. దీన్ని ముఖానికి వేసుకుని కేవలం గంట పాటు విశ్రాంతి తీసుకోవాలి. అంతే తరవాత ఫలితం చూసి మీరు ఆశ్చర్యపోకుండా ఉండలేరు. అల్యూమినియం రేకులోని శీతలీకరణ ప్రభావం ముఖం వాపు తగ్గేలా చేస్తుంది. అలసట తగ్గించి చర్మాన్ని పునరుజ్జీవనం కలిగిస్తుంది.
నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నవారికి ఇది చక్కటి పరిష్కారంగా పనిచేస్తుంది. కీర దోస ముక్కలు, ఇతర టీ బ్యాగ్‌ల మాదిరిగానే ఇవి చక్కటి శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. సుమారు 10 నుంచి 15 నిమిషాల పాటు అల్యూమినియం ఫాయిల్‌తో ముఖాన్ని ప్యాక్ చేసుకున్నారంటే మీకు తెలియకుండానే మీరు హాయిగా నిద్రపోతారు.
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
నిమ్మకాయను కట్ చేసి బెడ్రూమ్లో పెడితే చాలు- అందరికీ డీప్ స్లీప్ పక్కా! - Lemon In Bedroom