ETV Bharat / entertainment

జోరు చూపిస్తున్న విశ్వక్‌ సేన్‌ 'గామి' - రెండు రోజుల్లోనే అన్ని కోట్లా?

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 10, 2024, 2:40 PM IST

Viswak Sen Gaami Movie Collections : మాస్ కా దాస్ విశ్వక్‌ సేన్‌ నటించిన లేటెస్ట్ మూవీ లాభాలను అందుకునే దిశగా ముందుకెళ్తోంది. ఓవర్సీస్​లోనూ మంచి ఊపు కొనసాగిస్తోంది. ఈ చిత్రం రెండు రోజుల్లో ఎన్ని కోట్లు సాధించిందంటే?

జోరు చూపిస్తున్న విశ్వక్‌ సేన్‌ 'గామి' - రెండు రోజుల్లోనే అన్ని కోట్లా?
జోరు చూపిస్తున్న విశ్వక్‌ సేన్‌ 'గామి' - రెండు రోజుల్లోనే అన్ని కోట్లా?

Viswak Sen Gaami Movie Collections : మాస్ కా దాస్ విశ్వక్‌ సేన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెరీర్​ ప్రారంభంలోనే ఫలక్‌నుమా దాస్, ఏమైంది ఈ నగరానికి వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా మాస్ యాటిట్యూడ్​ అండ్​​ స్టైల్ యాక్టింగ్​తో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఫలక్​నుమా దాస్, దాస్​ కా దమ్కీ వంటి చిత్రాలకు రచన, దర్శకత్వం కూడా వహించి మల్టీటాలెెంటెడ్ అనిపించుకున్నాడు. అలా దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా రాణిస్తూ కెరీర్​లో ముందుకెళ్తున్నాడు.

అయితే తాజాగా అతడి నుంచి వచ్చిన చిత్రం గామి. విజువల్ వండర్​గా రూపొందిన ఈ చిత్రం ఈ మహా శివరాత్రికి బాక్సాఫీస్‌ బరిలో దిగి అందరి దృష్టిని ఆకర్షించింది. విశ్వక్‌ సేన్‌ హీరోగా తొలి అడుగులు వేస్తున్న సమయంలో అంగీకరించిన చిత్రమిది. గత కొన్నేళ్లుగా చిత్రీకరణ దశలోనే ఉన్న ఈ చిత్రం రీసెంట్​గా తెరపైకి వచ్చి ఆకట్టుకోవడం ప్రారంభించింది. సినిమాకు మంచి టాకే వినిపిస్తోంది. కథ, స్క్రీన్‌ప్లే, విశ్వక్‌ నటన, విజువల్‌ ఎఫెక్ట్స్, విరామ, పతాక సన్నివేశాలు సినిమాకు బలంగా నిలిచాయి. నెమ్మదిగా సాగే కథనం, లాజిక్‌ లేని కొన్ని సీన్స్‌ బలహీనంగా నిలిచాయి. అయితే వసూళ్ల పరంగా బానే అందుకుంటోంది.

తొలి రోజే ఈ చిత్రానికి రూ.9 కోట్ల వరకు వసూళ్లు వచ్చాయి. విశ్వక్ కెరీర్​లో హైయెస్ట్ ఓపెనింగ్స్​ను కలెక్ట్ చేసిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఓవర్సీస్​లోనూ బాగానే వసూలు చేసింది. రెండో రోజు కూడా మంచి జోరునే కొనసాగించింది. దీంతో రెండు రోజుల్లో ఏకంగా రూ.15.1 కోట్ల వసూళ్లను సాధించి సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది. కేవలం రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అందుకుని లాభాల బాట పట్టింది. ఇక మూడో రోజు ఆదివారం కావడంతో మరిన్ని కలెక్షన్స్ రావడం ఖాయమనే చెప్పాలి.

సినిమా విషయానికొస్తే విశ్వక్‌ సేన్​తో పాటు చాందిని చౌదరి, అభినయ, హారిక, దయానంద్‌ రెడ్డి, మహమ్మద్‌ సమద్, శాంతి రావు, మయాంక్‌ పరాక్, శ్రీధర్‌ తదితరులు నటించారు. స్వీకర్‌ అగస్తీ, నరేష్‌ కుమారన్‌ సంగీతం అందించారు. విశ్వనాథ్‌ రెడ్డి, రాంపీ ఛాయాగ్రహణం, విద్యాధర్‌ కాగిత దర్శకత్వం వహించారు. కార్తీక్‌ శబరీష్‌ నిర్మాతగా వ్యవహరించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

షాకింగ్​ - ఒక్క సినిమాకే ఆ దర్శకుడికి రెమ్యునరేషన్​ రూ.600కోట్లు!

పాపం పూజా హెగ్డే - ఎట్టకేలకు స్టార్ కిడ్ సినిమాలో హీరోయిన్​గా ఛాన్స్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.