Vishwambhara Chiranjeevi : టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి లీడ్ రోల్లో వస్తున్న లేటెస్ట్ మూవీ 'విశ్వంభర'. ఫ్యాంటసీ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే పలు షెడ్యూల్స్‌ను పూర్తి చేసిన ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. చిరు కూడా గ్యాప్ లేకుండా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా గురించి ఓ న్యూస్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాకి సంబంధించిన పలు ముఖ్యమైన భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించేందుకు మేకర్స్ ప్లాన్ చేయగా, దానికి ఆయన డూప్‌ను వద్దని తానే షూట్ చేస్తానని తెలిపారట. తాజాగా ఓ ఈవెంట్లో ఈ విషయాన్ని చిరు స్వయంగా వెల్లడించారు.
"నాకు ఇంకా ఓపిక ఉంది. సినిమా కోసం, అభిమానుల కోసం నేను ఎంతైనా కష్టపడతాను. ఇటీవలే విశ్వంభర షూటింగ్లో కొన్ని కీలక యాక్షన్ సీన్ చేయడానికి మేకర్స్ నా డూప్‌ని తీసుకొచ్చారు. అయితే నేను ఆయన ఎందుకు అని అడగ్గా, వారు ఇది భారీ యాక్షన్ సీన్ అని చెప్పారు. నేను వెంటనే ఆ సీన్ గురించి అడిగాను, అది విన్న తర్వాత పర్లేదు డూప్ వద్దు ఈ సీన్ నేను చేస్తాను అని చెప్పాను. నాకు ఇంకా ఓపిక ఉంది. అలాంటి యాక్షన్ సీన్స్ అభిమానుల కోసం నేనే చేస్తాను" అంటూ తెలిపారు. ఇది విన్న ఫ్యాన్స్ ఎంతో ఆనందపడుతున్నారు. ఇప్పటికీ చిరులో అదే జోష్ ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు.
దాదాపు 150 నుంచి 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఎమ్ ఎమ్ కీరవాణి అందిస్తున్నారు. 2023లో అనౌన్స్ చేసిన ఈ సినిమాను రానున్న సంక్రాంతి కానుకగా 2024 జనవరి 10న విడుదల చేయాలని నిర్ణయించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'వాళ్లిద్దరూ ఆ సీక్వెల్ చేయాలన్నదే నా కల': మెగాస్టార్ - Chiranjeevi On Ram Charan