ETV Bharat / entertainment

OTTలోకి ఎంట్రీ ఇచ్చేసిన 'తంగలాన్'- స్ట్రీమింగ్ ఎక్కడంటే? - THANGALAAN OTT

ఎట్టకేలకు ఓటీటీలోకి తంగలాన్- ఏ ప్లాట్​ఫామ్​లో చూడొచ్చు అంటే!

Thangalaan OTT
Thangalaan OTT (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 10, 2024, 7:45 AM IST

Thangalaan OTT : వెర్సటైల్ యాక్టర్ విక్రమ్- స్టార్ డైరెక్టర్ పా. రంజిత్ కాంబినేషన్​లో తెరకెక్కిన 'తంగలాన్' ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చింది. 2024 ఆగస్టు 15న వరల్డ్​వైడ్​గా రిలీజైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ దక్కించుకుంది. అయితే ఈ సినిమా థియేటర్లలో ఎక్స్​పీరియన్స్ చేయని ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. పలు కారణాల వల్ల ఓటీటీ రిలీజ్ ఆలస్యం అవుతూ వచ్చింది. తాజాగా మేకర్స్ ఆన్​లైన్ స్ట్రీమింగ్​కు లైన్ క్లియర్ చేశారు.

ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్ నెట్​ఫ్లిక్స్​లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో అందుబాటులో ఉంది. హీరోయిన్లు మాళవిక మోహనన్‌, పార్వతి తిరువొత్తులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ సంగీతం అందిచగా, స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఈ సినిమా రూపొందింది.

ఇదీ కథ
1850​ల్లో బ్రిటీష్ వారి పాలనా కాలంలో జరిగే స్టోరీ ఇది. కర్ణాటక సరిహద్దున ఉన్న వేపూరు గ్రామంలోని ఓ గిరిజన తెగకు చెందిన నాయకుడు తంగలాన్‌ (విక్రమ్‌). ఆయన భార్య గంగమ్మ (పార్వతి తిరువోతు). వీళ్లకు ఐదుగురు సంతానం. ఊళ్లో తమకున్న కొద్దిపాటి భూమిని సాగు చేసుకుంటూ వాళ్లు తమ జీవితాన్ని సంతోషంగా సాగిస్తుంటారు. అయితే ఓసారి వాళ్లు పండించిన పంటను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తగలబెడతారు. సరిగ్గా అప్పుడే పన్ను కట్టలేదన్న నెపంతో తంగలాన్‌ భూమిని ఆ ఊరి జమిందారు స్వాధీనం చేసుకుంటాడు.

ఇవన్నీ జరుగుతున్న సమయంలో క్లెమెంట్‌ అనే తెల్లదొర (డేనియల్‌) వేపూరుకు వస్తాడు. ఆ ఊరికి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న బంగారాన్ని వెలికి తీయడానికి తనతో వస్తే పెద్ద మొత్తంలో కూలీ ఇవ్వడంతో పాటు బంగారంలో వాటా ఇస్తానంటూ ఆ ఊరి జనాలకు ఆశ చూపుతాడు. అయితే ఆ అడవిలో ఉన్న బంగారాన్ని నాగజాతికి చెందిన మాంత్రికురాలు ఆరతి (మాళవిక మోహనన్‌) తన అతీంద్రియ శక్తులతో రక్షిస్తున్నట్లు తంగలాన్‌కు కలలో కనిపిస్తుంటుంది. అంతే కాకుండా తన తాతను ఆరతి వెంటాడినట్లు, ఆమెను ఆయన చంపినట్లుగా తరచూ కలలు వస్తుంటాయి.

అయితే నిజంగా ఆరతి అనే ఆమె ఉందా? ఆ ప్రాంతంలోని బంగారాన్ని ఆరతి రక్షిస్తోందా? బంగారాన్ని వెలికి తీసేందుకు బ్రిటిషర్లతో కలిసి అడవిలోకి వెళ్లిన తంగలాన్‌కు, తన బృందానికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? ఈ ప్రయాణంలో తంగలాన్‌ ఏం తెలుసుకున్నారు? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే. ఈ సినిమా చూడాల్సిందే!

విక్రమ్‌ కెరీర్​లో మరో మైల్​స్టోన్ - 'తంగలాన్‌' ఎలా ఉందంటే? - Vikram Thangalaan Movie

'సూర్య, అజిత్​లాగా మీకు భారీ ఫాలోయింగ్ లేదుగా?' - రిపోర్టర్ ప్రశ్నకు విక్రమ్ స్టన్నింగ్ రిప్లై - Thangalaan Vikram

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.