ETV Bharat / entertainment

'ప్రతిచోటా రికార్డులు సృష్టిస్తోంది' - ఓటీటీలో 'మహారాజ' రేర్​ ఫీట్​ - VIJAY SETHUPATHI MAHARAJA MOVIE - VIJAY SETHUPATHI MAHARAJA MOVIE

Vijay Sethupathi Maharaja Movie : స్టార్ హీరో విజయ్‌ సేతుపతి 50వ చిత్రం 'మహారాజ' తాజాగా ఓటీటీలో ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అదేంటంటే?

Vijay Sethupathi Maharaja Movie
Vijay Sethupathi (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 16, 2024, 11:57 AM IST

Vijay Sethupathi Maharaja Movie : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ సేతుపతి తాజాగా 'మహారాజ' అనే థ్రిల్లర్ సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం మంచి టాక్​తో పాటు బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. జూన్ 14న విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలోనూ సంచలనం సృష్టిస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్​ఫ్లిక్స్​లో ఈ చిత్రం మూవీ లవర్స్​కు అందుబాటులో ఉంది.

అయితే తాజాగా 'మహారాజ' ఓ అరుదైన ఘనతను అందుకుంది. ఆ ఓటీటీలోని ఈ వారం ట్రెండింగ్‌ లిస్ట్​లో (ఇండియాలో) తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. దీంతో మేకర్స్ సంతోషం వ్యక్తం చేశారు. 'ప్రతిచోటా మహారాజ రికార్డులు సృష్టిస్తోంది' అంటూ సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో ఈ విషయాన్ని పంచుకున్నారు.

విజయ్ సేతుపతి 50వ చిత్రంగా వచ్చిన ఈ సినిమాను నిథిలన్‌ స్వామినాథన్‌ తెరకెక్కించారు. అనురాగ్‌ కశ్యప్‌, మమతా మోహన్‌దాస్‌ లాంటి స్టార్స్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. సుమారు రూ.20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించినట్లు సమాచారం.

స్టోరీ ఏంటంటే?
మ‌హారాజా (విజ‌య్ సేతుప‌తి) ఓ బార్బ‌ర్‌. ఒక‌ ప్ర‌మాదంలో తన భార్య‌ను పోగొట్టుకుంటాడు. దీంతో అత‌డు తన కుమార్త జ్యోతితో క‌లిసి సిటీకి దూరంగా ఉన్న ఓ ఇంట్లో నివసిస్తుంటాడు. అయితే ఓ రోజు ఒంటి నిండా గాయాల‌తో మ‌హారాజా పోలీస్‌స్టేష‌న్​కు వెళ్తాడు. ముగ్గురు ఆగంత‌కులు త‌న ఇంట్లోకి చొర‌బ‌డి త‌న‌పై దాడి చేశార‌ని అంటాడు. ఈ క్ర‌మంలోనే త‌మ బిడ్డ ప్రాణాల్ని కాపాడిన ల‌క్ష్మిని ఎత్తుకెళ్లిపోయార‌ని, ఎలాగైనా ఆ ల‌క్ష్మిని వెతికి పెట్ట‌మ‌ంటూ పోలీసుల‌కు కంప్లైంట్ ఇస్తాడు. మ‌రి మ‌హారాజా చెప్పిన ఆ ల‌క్ష్మి ఎవ‌రు? అతడి ఫిర్యాదును స్వీక‌రించ‌డానికి పోలీసులు తొలుత ఎందుకు నిరాకరించారు? అస‌లు మ‌హారాజ‌పై దాడి చేసిన ఆ ముగ్గురు ఎవ‌రు? వాళ్లకు అత‌నికి ఉన్న విరోధం ఏంటి? ఇటువంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

OTTలోకి విజయ్ 'మహరాజ'- స్ట్రీమింగ్ ఎప్పట్నుంచంటే?

'స్టోరీ వినగానే 50వ సినిమాగా ప్రకటించాను - ఇకపై అదే నా ఫ్యూచర్ ప్లాన్' - Vijay Sethupati Maharaja Movie

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.