Vijay Devarkonda Dilraju New Movie : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్ ఇమేజ్ బోలెడంత ఉన్నా సరైన హిట్ మాత్రం చాలా కాలం నుంచి పడలేదు. ఆయన చేస్తున్న సినిమాలన్నీ వరుసగా నిరాశపరుస్తున్నాయి. ఆ మధ్య ఖుషి మూవీ పర్వాలేదనిపించినా రీసెంట్గా వచ్చిన ఫ్యామిలీ స్టార్ మిక్స్డ్ టాక్‌తో ఫైనల్ రన్లో చేతులెత్తేసింది.
దీంతో విజయ్ తన తదుపరి సినిమాల విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఆయన లైనప్‌లో రాజావారు రాణిగారు ఫేమ్ దర్శకుడు రవి కిరణ్ కుమార్ పేరు కూడా వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని కూడా ఫ్యామిలీ స్టార్‌ను నిర్మించిన దిల్ రాజునే నిర్మిస్తారట. రీసెంట్‌గానే మొత్తం స్క్రిప్ట్ పనులు కూడా ఫినిష్ అయ్యాయని తెలుస్తోంది. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమా రూపొందనుందని అంటున్నారు.
అంటే చాలా కాలం తర్వాత మళ్లీ విజయ్ పొలిటికల్ కథను టచ్ చేయబోతున్నారనమాట. ఇందులో విజయ్ పొలిటికల్ లీడర్‌గా కనిపిస్తారని అంటున్నారు. ఒక మంచి సోషల్ ఎలిమెంట్‌ను ఇందులో చూపిస్తారట. అయితే గతంలో రౌడీ హీరో నోటా అనే పొలిటికల్ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ గ్రాండ్‌గానే రిలీజ్ అయింది. కానీ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయింది. మళ్లీ ఇంత కాలానికి రాజకీయ నేపథ్యంలో సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు విజయ్.
దర్శకుడు రవి కిరణ్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారని తెలిసింది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే మే 9న ఈ మూవీని అఫీషియల్‌గా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఇకపోతే నిర్మాత దిల్‌రాజుతో మరో సినిమా కూడా చేయనున్నారు విజయ్. ఇది కూడా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రానుందని టాక్ వినిపిస్తోంది.
మరోవైపు ఇప్పటికే విజయ్ గౌతమ్ తిన్ననూరితో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇందులో విజయ్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమాక సంబంధించిన అప్డేట్స్ రానున్నాయి. చూడాలి మరి ఈ సినిమాలు ఫ్లాపుల్లో ఉన్న విజయ్‌కు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయో.
మహేశ్, బన్నీతో అలా చేయాలని ఉంది : ప్రసన్న వదనం బ్యూటీ - PrasannaVadanam
మహేశ్‌ను నమ్రత ముద్దుగా ఏమని పిలుస్తారో తెలుసా? - Mahesh babu Namratha