ETV Bharat / entertainment

విజయ్​ 'ఫ్యామిలీ స్టార్'​ ఫస్ట్ డే కలెక్షన్స్​ - ఓపెనింగ్స్​ ఎన్ని కోట్లంటే? - Family star Day 1 collections

Family Star Day 1 Collections : ద ఫ్యామిలీ స్టార్ - ఏప్రిల్ 5 శుక్రవారం రిలీజ్ అయి ప్రేక్షకులు, అభిమానుల ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పెట్టింది. గీతాగోవిందం లాంటి సినిమా తర్వాత పరశురామ్, విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన సినిమా కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. అయితే ఈ చిత్రం తొలి రోజు ఎంత వసూలు చేసిందంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 6, 2024, 11:02 AM IST

విజయ్​ ఫ్యామిలీ స్టార్​ ఫస్ట్ డే కలెక్షన్స్​ - ఓపెనింగ్స్​ ఎన్ని కోట్లంటే?

Family Star Day 1 Collections : విజయ్ దేవరకొండ, మృనాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ద ఫ్యామిలీ స్టార్. ఏప్రిల్ 5 శుక్రవారం రిలీజ్ అయి ప్రేక్షకులు, అభిమానుల ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పెట్టింది. గీతాగోవిందం లాంటి సినిమా తర్వాత పరశురామ్, విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన సినిమా కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఈ చిత్రం భారీ అంచనాలను చేరుకోలేకపోయినట్లు తెలుస్తోంది. మిక్స్​డ్​ రివ్యూస్ కనిపిస్తున్నాయి. దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఈ కుటుంబ కథా చిత్రం థియేటర్లో కాస్త నిరాశనే మిగిల్చిందని తెలుస్తోంది.

ఈ సినిమా తొలిరోజు కలెక్షన్లు ఇండియా వైడ్​గా రూ.5.75 కోట్ల నెట్ వసూళ్లు మాత్రమే వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. తొలి రోజు థియేటర్ ఆక్యుపెన్సీ కేవలం 38.45 శాతం మాత్రమే అని తెలుస్తోంది. మార్నింగ్ షో 37.21 శాతం, మధ్యాహ్నం షో 40.85శాతం, ఈవెనింగ్ షో 34.81శాతం, నైట్ షోకు 40.92శాతం మాత్రమే థియేటర్లు నిండాయట. యూఎస్​లే మాత్రం మంచి రెస్పాన్స్ అందుకుంది. 475కే డాలర్లుకుపైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయట. కాగా, విజయ్ గత సినిమాల కలెక్షన్లతో పోలిస్తే ఫ్యామిలీ స్టార్​ ఓపెనింగ్సే తక్కువ. ఖుషి రూ.15.25కోట్లు, లైగర్ రూ.15.95కోట్లు, డియర్ కామ్రేడ్ రూ.11.90కోట్లు, వరల్డ్ ఫేమస్ లవర్ రూ. 7 కోట్లు వచ్చాయట. అయితే ఒక వారం ముందు విడుదలైన డీజే టిల్లూ స్క్వేర్ 8 రోజుల్లో రూ. 96కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.

ఇకపోతే ఫ్యామిలీ స్టార్​ మూవీ ప్రమోషన్ పరంగానూ తక్కువేం కాదు. పాన్ ఇండియా తెలుగు హీరో ప్రభాస్ తన ఇన్‌స్టా ఖాతాలో విజయ్ దేవరకొండ, మృనాల్ ఠాకూర్, దిల్ రాజులకు సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటూ పోస్టు పెట్టారు. సమంతా కూడా తన ఖుషీ సినిమా సహ నటుడైన విజయ్ కోసం పోస్టు పెట్టి బ్లాక్ బ్లాస్టర్ కావాలని కోరుకుంటున్నట్లు పోస్టు చేసింది. ఫ్యామిలీ స్టార్​ కథపరంగా చూస్తే ఇంట్లో మూడో కొడుకైన విజయ్ (గోవర్దన్) తన పెద్దన్నయ్య, చిన్నన్నయ్యల కన్నా బెటర్. సివిల్ ఇంజినీర్ చదువుకొని మంచి ఉద్యోగంలో ఉంటాడు. బాగా సంపాదించొచ్చని తెలిసినా ఇంటికి దూరంగా ఉండటం ఇష్టం లేక కెరీర్​లో కాంప్రమైజ్ అయి కుటుంబంతోనే ఉండిపోతాడు. ఆ దశలోనే అతనికి పరిచయమైన మృనాల్ ఠాకూర్ (ఇందు) మధ్య ప్రేమ మొదలైంది. అనుకోకుండా ఒకరోజు ఇందు రాసిన పుస్తకం ఒకటి గోవర్దన్ చూస్తాడు. అందులో ఏముంది. అసలు ఆ కుటుంబ కష్టాల నుంచి ఎలా గట్టెక్కాడనేది మిగిలిన కథనం. చిన్నపాటి లైన్ తీసుకుని కథనం, మాటలతో హిట్ అయిన చాలా సినిమాలు చూశాం. అలాంటిది ఈ సినిమా విషయంలో పరశురామ్ కాస్త తడబడ్డాడనే చెప్పాలి. అయితే విజయ్ - మృనాల్ పెయిర్ బాగుందని కాంప్లిమెంట్లు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ స్టార్​ హీరోల బిజీ షెడ్యూల్​ - వీళ్ల కొత్త సినిమాల లైనప్ ఇదే! - Tollywood Heroes

వీకెండ్ స్పెషల్ 25 సినిమా/సిరీస్​లు - మీ ఛాయిస్ ఏంటి? - This Week OTT Releases

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.