ETV Bharat / entertainment

దిల్​రాజుతో రౌడీ హీరో కొత్త సినిమా అనౌన్స్​మెంట్​ - దర్శకుడు ఎవరంటే? - Vijay Devarkonda Dilraju - VIJAY DEVARKONDA DILRAJU

Vijay Devarkonda Dil Raju New Movie : దిల్​ రాజు నిర్మాణంలో విజయ్ దేవరకొండ మరో కొత్త సినిమాను ప్రకటించారు. పూర్తి వివరాలు స్టోరీలో

Source ANI
Vijay Devarkonda (Source ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : May 4, 2024, 11:44 AM IST

Updated : May 4, 2024, 12:52 PM IST

Vijay Devarkonda Dil Raju New Movie : విజయ్ దేవరకొండ కెరీర్​లో ప్రస్తుతం ప్లాప్స్ మాత్రమే పలకరిస్తున్నాయి. దిల్​ రాజు నిర్మాణంలో ఎన్నో అంచనాల మధ్య రీసెంట్​గా విడుదలైన ఫ్యామిలీ స్టార్ కూడా డిజాస్టర్​గా మిగిలింది. అంతకు ముందు వచ్చిన మూవీస్ కూడా ఆయన కెరీర్​కు ఏమాత్రం ఉపయోగపడలేదు. అయితే ఆయన మరోసారి దిల్​రాజుతో కలిసి సినిమా చేసేందుకు రెడీ అయినట్లు ఆ మధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి రాజావారు రాణివారు మూవీ డైరెక్టర్ రవి కిరణ్ దర్శకత్వం వహించనున్నారని ప్రచారం సాగింది.

అయితే తాజాగా ఈ మూవీ గురించి అఫీషియల్​ అనౌన్స్​మెంట్ వచ్చింది. దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్​ తమ 59వ సినిమాగా దీనిని రూపొందించబోతున్నట్లు సోషల్ మీడియా అకౌంట్​లో అధికారికంగా ప్రకటించింది. రవి కిరణ్​తోనే ఈ సినిమా చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చింది. దిల్ రాజు శిరీశ్​తో కలిసి ఈ సినిమా చేయబోతున్నట్లు తెలిపింది. లార్జర్ డెన్ లైఫ్​గా అంటే భారీ బడ్జెట్​తో రూరల్ యాక్షన్ డ్రామాగా సినిమా రాబోతుందని చెప్పారు మేకర్స్​. మరిన్ని వివరాలను మే 9న ప్రకటిస్తామని ఆ ట్వీట్​లో పేర్కొన్నారు. ఈ మేరకు దిల్​రాజు, రవి కిరణ్, విజయ్​ దేవరకొండ కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. రౌడీ హీరో ఫ్యాన్స్ అంతా మే 9కోసం ఎదురుచూస్తూ ఉంటామని కామెంట్లు చేస్తున్నారు.

ఇక ఈ మూవీకి టైటిల్ రౌడీ జనార్దన్ అనే పేరును ఫిక్స్ చేసినట్టు వార్తలు ప్రస్తుతం వైరల్​గా మారాయి. ఈ పేరు కూడా డిఫరెంట్​గా విజయ్ బ్రాండ్​కు తగ్గట్టుగా ఉందంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్​పైకి వెళ్లే ఛాన్స్​ ఉంది. ప్రస్తుతం విజయ్ జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీదనే విజయ్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇది షూటింగ్ జరుపుకుంటోంది. మొదట ఈ మూవీలో విజయ్ సరసన శ్రీలీల అనుకున్నారు కానీ ఏమైందో ఏమో శ్రీలీల ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేసింది. ఆ తర్వాత రష్మిక అన్నారు. అనంతరం మరో మలయాళ భామను హీరోయిన్​గా తీసుకునే అవకాశం ఉంది అని ప్రచారం సాగుతోంది. ఈ మూవీ షూటింగ్ పూర్తవ్వగానే లేదా ముందుగానే రవి కిరణ్​ సినిమా సెట్స్​పైకి వెళ్లే అవకాశం ఉంది. కాగా, రవి కిరణ్ కోలా రాజావారు రాణివారు తర్వాత అశోకవనంలో అర్జున కల్యాణం సినిమాకు స్క్రీన్ రైటర్​గా కూడా పనిచేశారు. ఇప్పుడు విజయ్ దేవరకొండతో చేసే సినిమా ఆయనకు రెండో చిత్రం అవుతుంది.

జాన్వీ కపూర్ ఇంట్లో ఉంటారా? ఈ బంపర్ ఆఫర్ మీ కోసమే! - Janhvikapoor HOUSE
త్రిషకు అదంటే బాగా పిచ్చి - లేకుండా అస్సలు ఉండలేదట! - Happy Birthday Trisha

Last Updated : May 4, 2024, 12:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.