ETV Bharat / entertainment

'మెగాస్టార్​లా ఖాన్​లు ఆ పాత్ర చేయలేరు' - బాలీవుడ్​ స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్​! - vidya balan - VIDYA BALAN

మెగాస్టార్​లా బాలీవుడ్​ ఖాన్‌లు నటించలేరని స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్​గా మారాయి.

.
.
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 25, 2024, 5:24 PM IST

Vidya Balan Mamooty : ​మలయాళంలో మమ్ముట్టి మెగాస్టార్ అన్న సంగతి తెలిసిందే. నాలుగు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. ఇప్పటికీ ఏ హీరోకు సాధ్యం కానీ రేంజ్​లో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ కెరీర్​లో దూసుకెళ్తున్నారు. గతేడాది కాథల్ : ది కోర్ అనే చిత్రంలో ఏకంగా గే పాత్ర పోషించి హాట్​ టాపిక్​గా నిలిచారు. తాజాగా ఈ విషయమై బాలీవుడ్ స్టార్​ నటి విద్యా బాలన్ స్పందించారు. హిందీ హీరోల్లో ఖాన్స్ కూడా ఈ పాత్ర పోషించలేరని చెప్పారు. సౌత్ ప్రేక్షకులు ఇలాంటి వాటిని ఆదరించిన తీరును ప్రశంసించారు. అన్‌ఫిల్టర్డ్ అనే పాడ్‌కాస్ట్​లో ఈ కామెంట్స్ చేశారు.

"కేరళలో ఎక్కువగా అక్షరాస్య ప్రేక్షకులు ఉంటారన్న విషయాన్ని మనం అంగీకరించాలి. అదే పెద్ద తేడా. మమ్ముట్టి గే పాత్ర పోషించడాన్ని నేను తక్కువ చేయడం లేదు. కానీ అక్కడ అలాంటి పాత్ర పోషిచండ కాస్త సులువు. అక్కడి వాళ్లు అంగీకరిస్తారు. ఇలాంటి విషయాల్లో వాళ్లు చాలా ఓపెన్​గా ఉంటారు. సౌత్​లో తమ నటులను వాళ్లు చాలా గౌరవిస్తారు. పూజిస్తారు. ముఖ్యంగా మేల్ సూపర్ స్టార్లను. అందుకే అయన ఆ పాత్రను పోషించి ఉంటారు. నేను కాథల్: ది కోర్ సినిమా చూశాక శుభాకాంక్షలు చెప్పాలని దుల్కర్ సల్మాన్​కు మెసేజ్ కూడా పెట్టాను. మలయాళ బిగ్గెస్ట్ సూపర్​ స్టార్ అలాంటి సినిమాలో నటించడమే కాదు ప్రొడ్యూస్ కూడా చేశారంటే అక్కడి వాళ్ల మద్దతు అలాంటింది. దురదృష్టం ఏంటంటే మన హిందీ స్టార్లలో ఎవరూ అలాంటి పాత్ర పోషించలేరు. అయితే ఇప్పుడున్న జనరేషన్​ దీనిని బ్రేక్ చేసి అలాంటి పాత్రలను పోషిస్తారని ఆశిస్తున్నాను. ఇప్పటికే ఆయుష్మాన్ ఖురానా శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్ చిత్రంలో గే పాత్ర పోషించాడు." అని విద్యాబాలన్​ చెప్పింది.

Kaathal The Core Mammootty : కాగా, ఈ కాథల్: ది కోర్ మంచి సక్సెస్​ను అందుకుంది. ఇందులో గే పాత్రలో మమ్ముట్టి ఒదిగిపోయారు. ఆయన నటన, పాత్ర చాలా మందిని ఆకట్టుకుంది. తన భర్త గే అని పెళ్లైన చాలా ఏళ్లకు తెలిసిన ఓ భార్య విడాకుల కోసం కోరే పాత్రలో జ్యోతిక అద్భుతంగా నటించింది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

వీకెండ్ స్పెషల్​ - OTTలోకి వచ్చేసిన రూ.200కోట్ల భారీ బ్లాక్ బస్టర్ కాంట్రవర్సీ మూవీ - This week OTT releases

'ఆ సాంగ్ హిట్‌ కాకపోతే సినిమాలు వదిలేసేదాన్ని' - Sonali Bendre

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.