ETV Bharat / entertainment

బిగ్​బాస్​ లోకి వేణు స్వామి - ఈ సారి ఊహకందని కంటెస్టెంట్స్​ లిస్ట్! - Venu Swamy in Bigg Boss Season 8

Bigg Boss Season 8: బిగ్‌బాస్‌.. ఈ పేరుకు ఉన్న క్రేజ్​ అంతా ఇంతా కాదు. వెండితెర, బుల్లితెర, సోషల్‌ మీడియా.. ఇలా భిన్న రంగాలకు చెందిన పలువురు సెలబ్రిటీలు ఇక్కడ ఉంటారు. అయితే ఇప్పటివరకు నటీనటులు, కొరియోగ్రాఫర్లు, దర్శకులు, సింగర్లు.. ఇలా అందరినీ పట్టుకొచ్చారు. తాజాగా ఓ జ్యోతిష్యుడిని హౌస్‌లోకి తీసుకొస్తున్నారట! అతనేవరో కాదు.. వేణు స్వామి అని ప్రచారం!

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 6, 2024, 5:36 PM IST

Venu Swamy in Bigg Boss 8
Venu Swamy in Bigg Boss 8 (ETV Bharat)

Venu Swamy in Bigg Boss 8: బిగ్​బాస్​.. ఈ పేరుకు ఎంతో మంది ఫ్యాన్స్​ ఉన్నారు. ఇప్పటి వరకు 7 సీజన్లు విజయవంతంగా పూర్తి కాగా.. తెలుగు రాష్ట్రాల్లోని బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు త్వరలోనే బిగ్ బాస్ 8వ సీజన్ ప్రారంభం కాబోతోంది. ఈ షోకి సంబంధించి ఎప్పటి నుంచో లీకులు వస్తున్నాయి. ముఖ్యంగా కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ చాలా మంది పేర్లు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆ లిస్టులోకి ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి చేరినట్లు సమాచారం! బిగ్​బాస్ 8వ సీజన్లో వేణుస్వామి హౌస్​లోకి వస్తున్నాడంటూ ఇప్పటి నుంచే వార్తలు వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి.. రెండు తెలుగు రాష్ట్రాలు సహా.. సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటారు. టీవీలో, యూట్యూబ్‌ ఛానల్‌లో జ్యోతిష్యం చెప్తూ బానే పేరు తెచ్చుకున్నారు. ఫేమస్​ సెలబ్రిటీలకు జాతకం చెప్పడం, వారితో ప్రత్యేక పూజలు కూడా చేయిస్తారు. అయితే ఈ సారి సీజన్​లో.. వేణుస్వామిని హౌస్‌లోకి తీసుకువచ్చేందుకు బిగ్‌బాస్‌ టీమ్‌ ప్రయత్నాలు చేస్తోందట. కారణం.. ఆయన ఏది అనుకుంటున్నాడో అది మాత్రం నిక్కచ్చిగా చెప్పేడమే! ఇలాంటి వ్యక్తి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే.. ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా మాట్లాడేస్తాడు. అలాంటప్పుడు కచ్చితంగా కంటెంట్ వస్తుంది. బిగ్​బాస్ నిర్వాహకులకు కావాల్సింది కూడా అదే. అందుకే వేణుస్వామి కచ్చితంగా హౌస్​లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని టాక్​. అంతేనా ఆయనకు ఈ సీజన్​లోనే హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ కూడా దక్కే ఛాన్స్ ఉందని వైరల్​ అవుతోంది. అయితే బిగ్​బాస్​ హోజ్​లోకి వేణుస్వామి వెళ్లడంపై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు.

బిగ్​బాస్​లోకి వీళ్లు కూడా.. వేణుస్వామితో పాటు బిగ్‌బాస్‌ ఎనిమిదో సీజన్‌లోకి బర్రెలక్క, కిర్రాక్‌ ఆర్పీ, కుమారి ఆంటీ, కుషిత కళ్లపు, సోనియా సింగ్‌, రీతూ చౌద‌రి, యూట్యూబ‌ర్ నిఖిల్ విజ‌యేంద్ర‌సింహా వస్తున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు పాత కంటెస్టెంట్స్ అయినా నైనీ పావ‌ని, యాంక‌ర్ శివ, స్ర‌వంతి చొక్కార‌పు హౌజ్‌లోకి రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉన్న‌ట్లు చెబుతోన్నారు.

అప్పుడే మొదలు: కాగా బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 7 స‌క్సెస్ నేప‌థ్యంలో బిగ్‌బాస్ 8ను ఆగ‌స్టు లేదా సెప్టెంబ‌ర్ నెల‌లో ప్రారంభించేందుకు యాజమాన్యం స‌న్నాహాలు చేస్తోన్న‌ట్లు స‌మాచారం.

నాగార్జున‌నే హోస్ట్‌: బిగ్‌బాస్ సీజ‌న్ 8కు నాగార్జున‌నే హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. నాగార్జున స్థానంలో హోస్ట్‌గా కొందరి స్టార్ హీరోల పేర్లు వినిపించాయి. సీజ‌న్ 7 స‌క్సెస్ కావ‌డంతో హోస్ట్‌ను మార్చాల‌నే నిర్ణ‌యంపై బిగ్‌బాస్ యాజ‌మాన్యం వెన‌క్కి త‌గ్గిన‌ట్లు సమాచారం.

బిగ్​బాస్ బ్యూటీ "శోభా శెట్టి" లవర్ ఇతనా! "కార్తీక దీపం" సీరియల్‌ నుంచే ప్రేమాయణం!!

Bigg Boss Show : 3 రోజులు రూ.2 కోట్లు.. హైయెస్ట్​​ రెమ్యునరేషన్​ తీసుకున్న కంటెస్టెంట్​ తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.