ETV Bharat / entertainment

ఎవరీ హనీసింగ్‌? - ఆసక్తిగా నితిన్‌ 'రాబిన్‌హుడ్‌' టీజర్‌ - NITHIN ROBINHOOD MOVIE TEASER

హీరో నితిన్ నటిస్తున్న​ 'రాబిన్‌హుడ్‌' టీజర్ విడుదల!

Nithin Robinhood Movie
Nithin Robinhood Movie (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 14, 2024, 4:43 PM IST

Nithin Robinhood Movie : బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ సినీ ప్రేక్షకులను అలరిస్తున్నారు టాలీవుడ్ హీరో నితిన్. ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నారు. వాటిలో వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ఒకటి. ఈ చిత్రంతో 'రాబిన్‌హుడ్‌'గా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు నితిన్‌. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తాజాగా టీజర్​ను విడుదల చేసింది చిత్ర బృందం.

'ఆగని హైఫై ఇళ్లలో చోరీ, ఇంతమంది దాచుకున్న హనీని దోచుకెళ్తోన్న ఆ హనీ సింగ్​ ఎవరు?' అంటూ అందరీ డబ్బు, బంగారాన్ని దోచే దొంగగా నితిన్​ను చూపించడంతో ప్రచార చిత్రాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 'రాబిన్ హుడ్​ వాటికి పర్టిక్యులర్ జెండా, అజెండా ఏమీ ఉండవు. డబ్బు కోసం ఎవరికైనా ఎదురువెళ్తాడు.' అంటూ నితిన్ గురించి ఎలివేషన్ ఇచ్చారు.

అనంతరం 'భారతీయులంతా నా సోదర సోదరీమణులు. నా కంట్రీకి వచ్చి నా ఫ్యామిలీ మెంబర్స్​నే ఇబ్బండి పెడతారురా, యూ బ్లడీ ఫారెనర్స్​ అంటూ' నితిన్ చెప్పే డైలాగ్స్​, ఫైట్స్​ ఆకట్టుకున్నాయి. 'నువ్వేమో ఆ అమ్మాయిని చూసి ఎక్సైట్ అవుతున్నావ్​, నేనేమో ఆ వెనక వచ్చే వాడిని చూసి టెన్షన్​ అవుతున్నాను' అంటూ నితిన్​తో కలిసి రాజేంద్ర‌ప్ర‌సాద్‌ చేసే కామెడీ బాగుంది.

కాగా, ఈ రాబిన్ హుడ్​ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. నవీన్‌ యేర్నేని, రవి శంకర్ నిర్మాతలకుగా వ్యవహరిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. వినోదం, సందేశంతో కూడిన యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సాయి శ్రీరామ్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. భీష్మ తర్వాత గ్యాప్ ఇచ్చిన ఆయన ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్​గా నటిస్తోంది. నితిన్ - శ్రీలీల ఆ మధ్య ఎక్స్ ట్రా చిత్రంలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అశించిన స్థాయిలో ఆడలేదు. చూడాలి మరి ఈ రాబిన్ హుడ్​ అయినా నితిన్​కు హిట్ తెచ్చిపెడుతుందో లేదో.

ఓటీటీ వీకెండ్ వాచ్ - మొత్తం 19 సినిమా/సిరీస్​లు

వరుణ్‌ తేజ్‌ - గ్యాంగ్​స్టర్ డ్రామా​ 'మట్కా' ఎలా ఉందంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.