ETV Bharat / entertainment

సెలైంట్​గా వరలక్ష్మీ శరత్​కుమార్ ఎంగేజ్​మెంట్​​ - కాబోయే మొగుడు ఎవరంటే? - Varalakshmi Sarathkumar Engazement

Varalakshmi Sarathkumar Engazement : టాలీవుడ్ పవర్​ఫుల్ లేడీ విలన్​ వరలక్ష్మీ శరత్​కుమార్ సెలైంట్​గా ఎంగేజ్​మెంట్​ చేసుకుంది. ఇంతకీ ఆమెకు కాబోయే భర్త ఎవరంటే?

సెలైంట్​గా వరలక్ష్మీ శరత్​కుమార్ ఎంగేజ్​మెంట్​​ - కాబోయే మొగడు ఎవరంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 2, 2024, 6:48 PM IST

Updated : Mar 2, 2024, 7:06 PM IST

Varalakshmi Sarathkumar Engazement : తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన పేరు వరలక్ష్మీ శరత్​కుమార్​. సీనియర్​ హీరో, నటుడు శరత్ కుమార్ వారసురాలిగా చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. మొదట హీరోయిన్​గా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయినప్పటికీ ఆ తర్వాత క్యారెక్టర్​ ఆర్టిస్ట్​గా పవర్​ఫుల్​ విలన్​గా సూపర్ సక్సెస్ అందుకుంది. ప్రతినాయికగా, సహాయ నటిగా వైవిధ్యభరితమైన పాత్రలను పోషించి ప్రేక్షకుల్ని మెప్పించింది. ఈ సంక్రాంతికి హనుమాన్​తో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్​ హిట్ అందుకుంది. మూవీలో హీరో అక్క అంజ‌మ్మ‌గా తన నటనతో అదరగొట్టేసింది.

అయితే ఈ మధ్య తెలుగు చిత్రాల్లో మంచి మంచి పాత్రలు చేస్తూ సక్సెస్​ అందుకున్నప్పటికీ పర్సనల్​ లైఫ్​లోనూ ఇంకా పెళ్లి పీటలెక్కలేదు. వయసు 40 ఏళ్లకు దగ్గరపడుతున్నా ఇంతవరకు గుడ్​ న్యూస్ చెప్పలేదు. కానీ ఈమె లవ్​ అఫైర్స్​ గురించి అప్పుడప్పుడు రూమర్స్​ వస్తూ ఉండేవి. వాటిని ఆమె ఎప్పటికప్పుడు కొట్టి పారేసింది. అయితే ఎట్టకేలకు ఇప్పుడు తన పెళ్లి గురించి శుభవార్త తెలిపింది.

ముంబయికి చెందిన ఒక వ్యాపారవేత్త నిక్లాయ్ సచ్‌దేవ్​తో నిశ్చితార్థం చేసుకుంది. వీరి నిశ్చితార్థం మార్చి 1నే సైలెంట్​గా జరిగిపోయింది. ఈ విషయాన్ని ఒకరోజు ఆలస్యంగా తెలిపారు. సోషల్​ మీడియాలో ఫొటోలను పోస్ట్ చేశారు. అత్యంత దగ్గరి సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఈ వేడుక సింపుల్​గా జరిగింది.

కాగా, వరలక్ష్మి కాబోయే భర్త నిక్లాయ్ సచ్‌దేవ్ ఆర్ట్ గ్యాలరీని నడుపుతున్నారు. వీరిద్దరికి గత 14 ఏళ్లుగా పరిచయం ఉందట. ఇప్పుడు తల్లిదండ్రుల అంగీకారంతో ఉంగరాలు మార్చుకుని నిశ్చితార్థం చేసుకున్నారని తెలుస్తోంది. అయితే వీరి వివాహం ఎప్పుడు జరగబోతుంది అనేది క్లారిటీ లేదు. వీలైనంత త్వరగానే వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి తేదీ గురించి స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

ఇకపోతే వరలక్ష్మి శరత్ కుమార్ గతంలోనే హీరో విశాల్​తో ప్రేమలో ఉన్నట్లు తమిళ మీడియాలో గట్టిగానే ప్రచారం సాగింది. ఇక హీరో శింబునూ ఆమె పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆ మధ్య బాగా వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు తాజాగా జరిగిన సీక్రెట్​ ఎంగేజ్​మెంట్​తో అవన్నీ అసత్య ప్రచారాలనే తేలిపోయింది.

ఓ ఊపు ఊపేసిన జాన్వీ - అనంత్‌ అంబానీ ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో డ్యాన్స్ హంగామా!

కళ్లు చెదిరిపోయే రేంజ్​లో శ్రీలీల క్లాసికల్‌ డ్యాన్స్‌ - మీరు చూశారా?

Last Updated : Mar 2, 2024, 7:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.