ETV Bharat / entertainment

షాకింగ్​గా ఊర్వశి రౌతేలా బర్త్​ డే వేడుకలు​ - ఏకంగా 24 క్యారెట్​ గోల్డెన్​​ కేక్ కట్​ చేసి! - 24 క్యారెట్​ గోల్డెన్​​ కేక్ ఊర్వశి

Urvashi Rautela Godlen Cake Birthday Celebrations : బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా అభిమానులకు షాక్ అండ్ సర్​ప్రైజ్ ఇచ్చింది. తన పుట్టినరోజు సందర్భంగా ఏకంగా 24 క్యారెట్​ గోల్డెన్​​ కేక్ కట్​ చేసి ఫొటోలను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ విషయం సినీ ప్రయుల్లో హాట్ టాపిక్​గా మారింది.

ఊర్వశి రౌతేలా బర్త్​ డే సెలబ్రేషన్స్​ - ఏకంగా 24 క్యారెట్​ గోల్డెన్​​ కేక్ కట్​ చేసి!
20835986
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 25, 2024, 11:19 AM IST

Updated : Feb 25, 2024, 11:46 AM IST

Urvashi Rautela Godlen Cake Birthday Celebrations : బాలీవుడ్ భామ ఊర్వశి రౌటేలా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈమె బాగా పరిచయమే. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' సినిమాలో ' బాసూ - వేర్ ఈజ్ ద పార్టీ' అంటూ చిందులేసి అభిమానులను కట్టిపడేసింది. అలానే అఖిల్ అక్కినేని 'ఏజెంట్', రామ్ పోతినేని 'స్కంద', పవన్ కళ్యాణ్ - సాయి ధరమ్ తేజ్ 'బ్రో', సినిమాల్లోనూ స్పెషల్ సాంగ్స్​లో తన అందాలతో, డ్యాన్స్​ స్టెప్పులతో ఆకట్టుకుంది.

అయితే నేడు(ఫిబ్రవరి 25న) ఈ ముద్దుగుమ్మ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె గోల్డెన్ కేక్ కట్ చేసి అభిమానులను షాక్ అండ్ సర్​ప్రైజ్ చేసింది. అయినా ఈ భామకు ప్రతి ఏడాది తన బర్త్​ డేను గ్రాండ్​గా సెలబ్రేట్ చేసుకోవడం అలవాటే. అలానే ఈ ఏడాది కూడా సెలబ్రేషన్స్ చేసుకుంది. ఏకంగా 24 క్యారెట్ బంగారు పూత పూసిన కేక్ కట్ చేసింది. దానికి సంబంధించిన ఫొటోస్​ను సోషల్ మీడియాలో షేర్ చేయగా అది ఇప్పుడు హాట్​ డిస్కషన్ పాయింట్​గా మారింది. ఇది చూసిన నెటిజన్లు 'నీ దగ్గర ఉంది డబ్బులా? మంచి నీళ్లా? గోల్డెన్ కేక్ కట్ చేయడం ఏంటి మేడమ్​?' అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

"లవ్​ డోస్ 2 సెట్​లో 24 క్యారెట్ బంగారు పూత పూసిన కేక్ కట్​ చేశాను. సెట్​లో నా పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేసినందుకు ధన్యవాదాలు. నా పట్ల మీరు చూపించిన నిజమైన శ్రద్ధ నా కెరీర్​ను అద్భుతంగా తీర్చిదిద్దింది" అంటూ బాలీవుడ్ ఫేమస్​ సింగర్, ర్యాపర్ హనీ సింగ్​ను ఉద్దేశించి పోస్ట్ రాసుకొచ్చింది ఊర్వశి. ఆయనతో కలిసి దిగిన ఫోటోలను పోస్ట్ చేసింది. కాగా, హనీ సింగ్ రూపొందించిన కొన్ని మ్యూజిక్ వీడియోల్లో ఊర్వశి రౌటేలా సందడి చేసిన సంగతి తెలిసిందే.

ఇకపోతే గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు బాబీ (కెఎస్ రవీంద్ర) తెరకెక్కిస్తున్న ఎన్​బీకే 109లో ఊర్వశి రౌతేలా నటిస్తోందని ప్రచారం సాగింది. అయితే రీసెంట్​గా ఈ సినిమా సెట్స్​లోనూ ఊర్వశి రౌతేలా బర్త్​ డే సెలబ్రేషన్స్​ను గ్రాండ్​గా నిర్వహించింది మూవీటీమ్​. దీంతో ఆమె ఈ చిత్రంలో నటిస్తోందని కన్ఫామ్​ అయింది.

సండే స్పెషల్ - OTTలోకి వచ్చేసిన బిగ్గెస్ట్ హారర్ మూవీస్ - ధైర్యంగా చూడగలరా?

రణ్​బీర్ - రష్మికను ఫాలో అవుతున్న రకుల్ - జాకీ - గాల్లో హనీమూన్ ప్లాన్!

Last Updated : Feb 25, 2024, 11:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.