ETV Bharat / entertainment

రేణూదేశాయ్‌కు హెల్ప్ చేసిన ఉపాసన- పోస్టు షేర్ చేసిన నటి

రేణూ దేశాయ్​కు ఉపాసన సాయం- సోషల్ మీడియాలో షేర్ చేసిన నటి

Renu Desai Upasana
Renu Desai Upasana (Source: ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

Upasana Helps Renu Desai : నటి రేణూ దేశాయ్‌ మూగ జీవాల సంరక్షణ కోసం రీసెంట్​గా ఎన్జీవో ప్రారంభించారు. 'శ్రీ ఆద్య యానిమల్‌ షెల్టర్‌' పేరుతో ఈ సంస్థ అనే పేరును పెట్టారు. దీంతో ఎన్నో ఏళ్ల తన కల నెరవేరిందని పేర్కొంటూ శనివారం సోషల్ మీడియాలోనూ ఆమె పోస్ట్ షేర్ చేశారు. ఇక ఈ సంస్థకు ఎవరైనా విరాళాలు ఇవ్వొచ్చని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు క్యూఆర్ కోడ్, శ్రీ ఆధ్య యానిమల్ షెల్టర్ పేరిట బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. విరాళంగా వచ్చిన ప్రతీ పైసా సరైన కారణాల కోసమే ఉపయోగిస్తామని ఆమె రాసుకొచ్చారు.

ఈ నేపథ్యంలో రీసెంట్​గా తను ఓ అంబులెన్స్‌ కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. అయితే ఈ అంబులెన్స్​ కొనుగోలు చేయడంలో హీరో రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన తన వంతు సాయం చేశారు. చరణ్‌ పెంపుడు శునకం 'రైమీ' పేరుతో విరాళం అందించారు. ఈ విషయాన్ని రేణూ దేశాయ్‌ తాజాగా ఇన్‌స్టాగ్రామ్​లో షేర్ చేశారు. 'అంబులెన్స్‌ కొనుగోలుకు విరాళం అందించిన రైమీకి ధన్యవాదాలు' అని రాసుకొచ్చారు. దీనికి ఉపాసన కొణిదెల అకౌంట్​ను ట్యాగ్‌ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. ఉపాసన 'గోల్డెన్ హార్ట్​' అంటూ నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

రేణూ దేశాయ్‌కు మూగ జీవాలంటే ఇష్టం. వాటి సంరక్షణ కోసం ప్రతీ ఒక్కరూ పాటుపడాలని సోషల్ మీడియా వేదికగా ఆమె తరచూ విజ్ఞప్తులు చేస్తుంటారు. ఈ క్రమంలోనే తన కుమార్తె ఆద్య పేరిట ఎన్జీవోను ప్రారంభించారు. 'ఎన్నో ఏళ్ల నుంచి ఈ రోజు కోసం ఎదురుచూస్తున్నా. చిన్నతనం నుంచి మూగ జీవాలను సంరక్షించడం నాకు ఇష్టం. చాలాసార్లు నా వంతు ప్రయత్నించా. మూగ జీవాల కోసం నా గళాన్ని వినిపించాలని, వాటి రక్షణ కోసం ఇంకా ఏదైనా చేయాలని కొవిడ్‌ సమయంలో నిర్ణయించుకున్నా. నా సొంత ఎన్జీవోను రిజిస్టర్‌ చేయించా' అని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

'వాళ్ల నాన్న కోసం నా పిల్లలు ఇలా రెడీ అయ్యారు' - రేణూ దేశాయ్ ఎమోషనల్ - Renu Desai Instagram Post

నాన్నకు ప్రేమతో - పవన్ కల్యాణ్ జర్నీపై అకీరా వీడియో - AKIRA NANDAN SPECIAL VIDEO FOR PAWAN KALYAN

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.