ETV Bharat / entertainment

'ఉపానస, క్లీంకారలో కామన్ పాయింట్ ఏంటి ?' - చిరు ఆన్సర్ ఇదే - Padma Vibhushan Chiranjeevi

Chiranjeevi Padma Vibhushan Award Ceremony : పద్మ విభూషణ్ అవార్డును అందుకునేందుకు దిల్లీకి పయనమయ్యారు చిరంజీవి ఫ్యామిలీ. అయితే అక్కడ ఆయన కోడలు ఉపాసన ఆయన్ను ఓ ప్రశ్న అడిగి కన్​ఫ్యూజ్ చేశారు. ఆ విశేషాలు మీ కోసం.

Padma Vibhushan Award Ceremony
Chiranjeevi Upasana (Source : ETV Bharat Archives)
author img

By ETV Bharat Telugu Team

Published : May 10, 2024, 12:28 PM IST

Chiranjeevi Padma Vibhushan Award Ceremony : టాలీవుడ్ స్టార్ హీరో, మెగాస్టార్ చిరంజీవి ఇటీవలె పద్మవిభూషణ్ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. దిల్లీలోని రాష్ట్రపతి భవన్​లో జరిగిన ఈ ప్రతిష్టాత్మక వేడుకకు ఆయన సతీమణి సురేఖతో పాటు కుమారుడు రామ్​చరణ్​, కోడలు ఉపాసన కూడా వచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే వీటితో పాటు ఇప్పుడు ఓ క్యూట్ వీడియో కూడా సోషల్ మీడియాలో హల్​చల్ చేస్తోంది. అందులో ఉపాసన, చిరుల సంభాషణ అభిమానుల దృష్టిని ఆకర్షించింది.

అవార్డు వేడుకకు ముందు ఓ చిన్నపాటి ఫొటో సెషన్ జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఆ సమయంలో ఉపాసన అక్కడ జరగుతున్నదంతా వీడియో తీస్తున్నారు. అదే సమయంలో అక్కడే ఉన్న చిరును ఉప్సీ ఓ ప్రశ్న అడగ్గా, దానికి ఆయన అమాయకంగా సమాధానం చెప్పారు.

"మామయ్యా నాకు, క్లీంకారాకు మధ్య ఉన్న కామన్ పాయింట్​ ఏంటి" అని ఉపాసన అడగ్గా, దానికి చిరంజీవి కాసేపు ఆలోచించి 'ఆమె నీ ప్రతిరూపం' అంటూ సమాధానమిచ్చారు. అయితే దానికి "కాదు, మామయ్యా, అదేంటంటే మా ఇద్దరి తాతయ్యలకు పద్మవిభూషణ్ వచ్చింది" అంటూ ఉపాసన అసలు ఆన్సర్ చెప్పారు. ఇక ఆ మాట విన్న చిరు అవును అది నిజమే కదా అంటూ నవ్వారు. ఆ వీడియలో చెర్రీ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ క్యూట్​ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది.

ఇక అవార్డు అందుకున్న తర్వాత చిరంజీవి కూడా సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. అందరికీ థ్యాంక్స్ చెప్పారు. "కళామతల్లికి, కళా రంగంలో నన్ను వెన్ను తట్టి నడిపించిన ప్రతి ఒక్కరికి, నన్ను ప్రేమించి అభిమానించిన అందరికి, పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందించిన కేంద్ర ప్రభుత్వానికి, ఈ సందర్బంగా అభినందించిన వారికీ, నా నమస్సుమాంజలి" అంటూ పేర్కొన్నారు. చెర్రీ కూడా చిరుతో తీసుకున్న ఫొటోలను షేర్ చేశారు. కంగ్రాజ్యులేషన్స్ డాడ్. "మిమల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది" అంటూ క్యాప్షన్​ జోడించారు.

పద్మవిభూషణ్ 'చిరంజీవి'- అన్నింట్లో మెగా 'స్టారే'! - Chiranjeevi Padma Vibhushan

జీ20 మీటింగ్​కు నా బదులు చరణ్- పవన్ సినిమాల్లో నా ఫేవరెట్ అదే: చిరు - CHIRANJEEVI KISHAN REDDY INTERVIEW

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.