ETV Bharat / entertainment

ప్రముఖ నటుడు మిస్సింగ్​ - ఆందోళనలో ఫ్యాన్స్! - Gurucharan Singh Missing - GURUCHARAN SINGH MISSING

TV Actor Gurucharan Singh Missing : ఇండస్ట్రీలో ప్రముఖ నటుడు గురు చరణ్‌ సింగ్‌ అదృశ్యమవ్వడం కలకలం రేపుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

.
ప్రముఖ నటుడు మిస్సింగ్​ - ఆందోళనలో ఫ్యాన్స్!
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 27, 2024, 2:59 PM IST

TV Actor Gurucharan Singh Missing : బాలీవుడ్‌లో మిస్సింగ్ కేస్​ నమోదైంది. ప్రముఖ టీవీ షో తారక్‌ మెహతా కా ఉల్టా చష్మా యాక్టర్​ గురు చరణ్‌ సింగ్‌ అదృశ్యమవ్వడం కలకలం రేపుతోంది. ఐదు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆయన కనిపించకుండా పోయారని తెలుస్తోంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషయం తెలుసుకుని ఆయన అభిమానులు ఆందోళనకు గురౌతున్నారు.

అసలేం జరిగిందంటే ? - గురుచరణ్‌ సింగ్ వయసు 50 ఏళ్లు. ఆయన ఏప్రిల్‌ 22న ముంబయికి వెళ్తున్నానని చెప్పి దిల్లీలోని తన నివాసం నుంచి ఎయిర్‌పోర్టుకు బయలు దేరారు. ఆ తర్వాత నుంచి ఆయన జాడ లేదు. ఫోన్‌ కూడా పనిచేయలేదు. దీంతో ఆందోళనకు గురైన నటుడి తండ్రి పోలీసు అధికారులను ఆశ్రయించారు. ఆయన మానసిక పరిస్థితి బాగానే ఉందని, కానీ ఆచూకీ తెలియట్లేదని తెలిపారు. దీంతో కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

ఏప్రిల్‌ 22న ఉదయం 8.30 గంటలకు గురు చరణ్ సింగ్​ ఇందిరా గాంధీ ఎయిర్‌పోర్టు నుంచి ముంబయికి బయలు దేరాల్సి ఉంది. కానీ ఆయన విమానం ఎక్కలేదని ఇన్​వెస్టిగేషన్​లో తేలింది. ఈ మార్గంలో సీసీటీవీ ఫూటేజీని అధికారులు పరిశీలించారు. అప్పుడు రాత్రి 9 గంటల సమయంలో పాలెంలోని ఓ ట్రాఫిక్‌ మధ్యలో గురు చరణ్‌ రోడ్డు దాటుతున్నట్లు కెమెరాలో రికార్డు అయింది. అయితే ఆయనను ఎవరైనా కిడ్నాప్‌ చేసి ఉండొచ్చని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో పోలీసు అధికారులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.

Taarak Mehta Ka Ooltah Chashmah : కాగా, బాగా క్రేజ్ సంపాదించుకున్న తారక్‌ మెహతా కా ఉల్టా చష్మా టీవీ షోలో గురుచరణ్‌ రోషన్‌ సింగ్‌ సోధీ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ షోతో ఆయన అభిమానుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తన తండ్రి అనారోగ్యం కారణం వల్ల 2020లో ఈ సిరీస్‌ నుంచి ఆయన వైదొలిగారు. ఇప్పుడు ఆయన ఆచూకీ తెలీకుండా పోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.