ETV Bharat / entertainment

పెళ్లిపై 'యానిమల్' బ్యూటీ క్లారిటీ - 'అతడిలో ఆ ఒక్క క్వాలిటీ కచ్చితంగా ఉండాలి'! - తృప్తి దిమ్రి హస్బెండ్​ క్వాలిటీస్​

Tripti Dimri Marriage : తన పెళ్లి గురంచి వస్తున్న రూమర్స్​పై 'యానిమల్' బ్యూటీ తృప్తి దిమ్రి క్లారిటీ ఇచ్చింది ఈ నేపథ్యంలో తన భర్తలో ఉండాల్సిన క్వాలిటీస్​ గురించి చెప్పుకొచ్చింది. ఇంతకీ అవేంటంటే ?

Tripti Dimri Marriage
Tripti Dimri Marriage
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 31, 2024, 5:12 PM IST

Updated : Jan 31, 2024, 5:19 PM IST

Tripti Dimri Marriage : బాలీవుడ్​ స్టార్ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ లీడ్​ రోల్​లో తెరకెక్కిన 'యానిమల్​' మూవీ బాక్సాఫీస్​ వద్ద ఎంతటి సక్సెస్​ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అటు టాక్ పరంగానే కాకుండా ఇటు కలెక్షన్ల పరంగానూ సెన్సేషన్ క్రియేట్​ చేసిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోనూ మంచి రేటింగ్స్​తో దూసుకెళ్తోంది. అయితే ఈ సినిమాలోని కొందరు తారలు తమ నటనతో ఓవర్​నైట్​ స్టార్స్​ అయిపోయారు. అందులో బీటౌన్​ బ్యూటీ తృప్తి దిమ్రి ఒకరు. ఉత్తరాఖండ్​కు చెందిన ఈ బ్యూటీ 'యానిమల్​' సినిమాలో జోయా అనే పాత్రలో మెరిసింది. తన నటనతో ఆడియెన్స్​ను ఆకర్షించింది. దీంతో ఈ అమ్మడిని ఇప్పుడు వరుస ఆఫర్లు వరిస్తోంది.

ఇదిలా ఉండగా, తాజాగా ఈ అమ్మడు పెళ్లి పీటలెక్కనుందన్న వార్తలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో ఆమెను ఇటీవలే ఓ యాంకర్​ ప్రశ్న అడిగారు. దీంతో ఆమె తన మనసులోని మాట బయటపెట్టింది. పెళ్లి విషయంలో క్లారిటీ ఇచ్చింది.

"మీరెప్పుడు పెండ్లి చేసుకుంటారు" అంటూ యాంకర్‌ తృప్తిని ప్రశ్నించగా, ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలేమి లేదని, ఇప్పటికైతే తన కెరీర్‌ పైనే ఫోకస్​ పెట్టానంటూ తృప్తి క్లారిటీ ఇచ్చింది. అయితే తనకు కాబోయే భర్తలో ఏయే క్వాలిటీస్​ ఉండాలో చెప్పుకొచ్చింది. "డబ్బు, పాపులారిటీ సంగతి పక్కన పెడితే అతడు మంచి మనస్సున్న వ్యక్తి అయి ఉండాలి" అంటూ తన అభిప్రాయాన్ని తెలియజేసింది.

Tripti Dimri Movies : 2017లో విడుదలైన 'మామ్' అనే సినిమాతో వెండితెరకు పరిచమైంది తృప్తి. శ్రీ దేవి లీడ్​ రోల్​లో తెరకెక్కిన ఆ మూవీలో ఓ ముఖ్య పాత్రలో మెరిసింది. ఆ తర్వాత 'పోస్టర్ బాయ్స్' అనే సినిమాతో హీరోయిన్​గా తెరంగేట్రం చేసింది. తన నటనతో ప్రేక్షకులను ఆక్టటుకుని బాలీవుడ్​లో వరుస ఆఫర్లను అందిపుచ్చుకుంది. లైలా మజ్ను', 'బుల్ బుల్' , 'క్వాలా' చిత్రాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 'బుల్​ బుల్​' సినిమాకు గానూ ఉత్తమ నటిగా ఓటీటీ ఫిల్మ్​ ఫేర్​ అవార్డు అందుకుంది. ప్రస్తుతం ఆనంద్​ తివారీ డైరెక్షన్​లో తెరకెక్కుతున్న ఓ సినిమా విక్కీ కౌశల్​కు జోడీగా నటిస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'ప్రయాణం ఎప్పుడూ ఒకేలా ఉండదు- అది అదృష్టంగా భావిస్తా'

ఇన్​స్టాలో 39 లక్షల మంది ఫ్యాన్స్​! యానిమల్​లో 'తృప్తి' అందుకే యాక్ట్ చేసిందట!!

Last Updated : Jan 31, 2024, 5:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.