Tripti Dimri Animal Movie: రణ్‌బీర్ కపూర్ యాక్షన్ ఎంటర్టైనర్ యానిమల్ సినిమాతో పాపులరైంది బాలీవుడ్ బ్యూటీ తృప్తి దిమ్రి. ఈ సినిమాతో తృప్తి కుర్రాళ్ల క్రష్ లిస్ట్‌లో చేరిపోయింది. అయితే రీసెంట్గా దిల్లీలో జరిగిన ఓ ఈవెంట్లో పాల్గొన్న తృప్తి తన కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంది.
'సినిమా ఇండస్ట్రీ జర్నీ ఎప్పుడూ సాఫీగా సాగిపోదు. ఎత్తుపల్లాలు ఉంటాయి. అన్నింట్లో నుంచి పాఠాలు నేర్చుకోవాలి. యానిమల్ సినిమాతో మంచి ఆదరణ లభించింది. మూవీ బ్లాక్‌బస్టర్ అవుతుందని ముందే తెలుసు. కానీ, నా క్యారెక్టర్ ఇంత ఫేమస్ అవుతుందని ఊహించలేదు. ఆడియెన్స్ నన్న ఎంతో ఆదరించారు. వాళ్లందరికీ నేను కృతజ్ఞురాలిని. రోజూ పడుకునే ముందు యానిమల్ మూవీటీమ్ను గుర్తుచేసుకొని థాంక్స్ చెబుతున్నా. జోయ పాత్రలో నటించడం అదృష్టంగా భావిస్తున్నా 'అని తృప్తి చెప్పింది. అయితే ఈ సినిమా తర్వాత ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరిగింది. రాత్రి రాత్రే సోషల్ మీడియాలో లక్షల ఫాలోవర్లను దక్కించుకుందీ బ్యూటీ. మరోవైపు ఈ అమ్మడుకు తెలుగులో కూడా ఆఫర్లు క్యూలో ఉన్నాయట. రౌడీబాయ్ విజయ్ దేవరకొండ- గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్‌లో ఈ బ్యూటీ లీడ్ రోల్లో కనిపించనుందని తెలుస్తోంది.
-
My interview @ last night..pic.twitter.com/ltdKCTuadL
— Triptii Dimri (@tripti_dimri) January 25, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">My interview @ last night..pic.twitter.com/ltdKCTuadL
— Triptii Dimri (@tripti_dimri) January 25, 2024My interview @ last night..pic.twitter.com/ltdKCTuadL
— Triptii Dimri (@tripti_dimri) January 25, 2024
Animal Movie OTT: సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగ తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో డిసెంబర్ 1న గ్రాండ్‌గా రిలీజైంది. పాన్ఇండియా రేంజ్లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని దక్కించుకుంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటించగా, అనిల్ కపూర్ కీలక పాత్ర పోషించారు. ఇక వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమా దాదాపు. 800+ కోట్లు వసూల్ చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకుంది. ఈ సినిమా రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26 అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">