Top Ten Malayalam Movies In OTT : లాక్డౌన్ ఓటీటీలకు పెరిగిన ఆదరణ చాలామందిని థియేటర్లకు దూరం చేసింది. అయితే మలయాళ సినిమాలకు ఈ ఆదరణ మిగిలిన బాషా చిత్రాల కంటే ఎక్కువగా లభించింది. కథల పరంగా కానీ ఎంచుకునే కథా వస్తువు, సహజమైన చిత్రీకరణ ఇవన్ని కలిపి మలయాళ చిత్రాలను ఇతర బాషా చిత్రాల కంటే ఒక మెట్టు పైన నిలబెట్టాయి. ఇటీవలి కాలంలో వచ్చిన ప్రేమలు, మంజుమల్ బాయ్స్ అందుకు ఉదాహరణలు. దీంతో ఇప్పుడు సినీ లవర్స్ దృష్టి మొత్తం మలయాళ సినిమాలపై పడింది. ఈ నేపథ్యంలో ఓటీటీల్లో తప్పక చూడాల్సిన మలయాళ సినిమాల గురించి తెలుసుకుందాం.
1. హృదయం (2022):
మలయాళ నటుడు, కమ్ డైరెక్టర్ వినీత్ శ్రీనివాసన్ రూపొందించిన ఈ చిత్రంలో ప్రణవ్ మోహన్ లాల్, కళ్యాణి ప్రియదర్శన్, దర్శన రాజేంద్రన్ నటించారు. ఇప్పటికే కాలేజ్ బ్యాక్ డ్రాప్ మీద ఎన్నో సినిమాలు వచ్చినా సరికొత్తగా అనిపించే ఈ చిత్రం డిస్ని హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది. ఈ సినిమాకు సంగీతం పెద్ద హైలైట్‌గా నిలిచింది.
2. కుంబలంగి నైట్స్(2019) :
మధు నారాయణ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్, సౌబిన్ షాహిర్ నటించారు. అన్నదమ్ముల మధ్య జరిగే సంఘర్షణ అంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
3. కూడే (2018) :
అంజలి మేనన్ రూపొందించిన ఈ చిత్రంలో నజ్రియా, పృథ్వీ రాజ్, పార్వతి తిరువోతు నటించారు. అన్నా చెల్లెలి మధ్య ఉండే ఉన్న బంధాన్ని సున్నితంగా చూపించిన చిత్రం. ఇది డిస్ని హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది.
4. న్యాన్ ప్రకాషన్ (2018) :
ఫహాద్ ఫాజిల్, శ్రీనివాసన్ నటించిన ఈ చిత్రానికి సత్యన్ రూపొందించారు. ఇది ప్రైమ్ వీడియోతో పాటు నెట్ ఫ్లిక్స్‌లో కూడా అందుబాటులో ఉంది.
5. జాకోబింటే స్వర్గరాజ్యం (2016) :
వినీత్ శ్రీనివాసన్ నటించి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నివిన్ పాలి కూడా నటించారు. ఇది యు ట్యూబ్ లో అందుబాటులో ఉంది.
6. చార్లీ (2015) : మార్టిన్ తెరకెక్కించిన వహించిన ఈ థ్రిల్లర్ చిత్రంలో దుల్కర్ సల్మాన్, పార్వతి నటించారు. ఇది సన్ నెక్స్ట్ లో అందుబాటులో ఉంది.
7. ప్రేమమ్ (2015) : నివిన్ పాలి, సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్, అనుపమ పరమేశ్వరన్ నటించిన ఈ సినిమాకు ఆల్ఫోన్స్ డైరెక్టర్. ఇది డిస్ని హాట్ స్టార్‌లో అందుబాటులో ఉంది.
8. బెంగళూర్ డేస్ (2014) : నజ్రియా, ఫహాద్ ఫాజిల్, దుల్కర్, నివిన్ నటించిన ఈ సూపర్ హిట్ సినిమాకు అంజలి మీనన్ దర్శకత్వం వహించారు. ఇది డిస్ని హాట్ స్టార్‌లో అందుబాటులో ఉంది.
9. తట్టాతిన్ మారయత్తు (2012) : నివిన్ పాలి, ఇషా తల్వార్ నటించిన ఈ చిత్రం సన్ నెక్స్ట్ లో అందుబాటులో ఉంది. రెండు భిన్న మతాలకు చెందిన ప్రేమికులు తమ ప్రేమను ఎలా గెలుచుకున్నారు అనేది ఈ సినిమా కథ.
10. ఉస్తాద్ హోటల్ (2012) : దుల్కర్. నిత్య మేనన్ నటించిన ఈ చిత్రానికి అంజలి మేనన్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. చెఫ్ కావాలనుకున్న ఓ అబ్బాయి లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడు అనేది ఈ సినిమా కథ. ఇది డిస్ని హాట్‌స్టార్‌తో పాటు యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది.
అమెజాన్ ప్రైమ్ - భారీ రేంజ్లో రైట్స్ సొంతం - ఓటీటీలో ఏయే సినిమాలు స్ట్రీమ్ కానున్నాయంటే ?
OTT టాప్ ట్రెండింగ్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్స్ ఇవే - ట్విస్ట్లే ట్విస్ట్‌లు!