Top 10 IPL Commentators : ఐపీఎల్ హిస్టరీలో ఇప్పటి వరకు చాలా రికార్డులు బద్దలయ్యాయి. చివరి బంతి వరకు విజయం దోబూచులాడిన మ్యాచ్‌లు కూడా చాలానే ఉన్నాయి. సూపర్ ఓవర్‌లు, ఊహించని మలుపులకైతే అస్సలు కొదవే లేదు. ఇలాంటి సందర్భాలను ఓ సారి గుర్తుచేసుకుంటే విజువల్స్‌తోపాటు వాయిస్, స్టేడియంలో అభిమానుల హోరు కూడా మనసులో మెదులుతాయి. అయితే క్రికెట్ మ్యాచ్‌ల మజాను ఓ రెండు పాయింట్లు పెంచేది మాత్రం కామెంటరీ అని చెప్పవచ్చు. అలాంటి మోస్ట్ పాపులర్ కామెంటేటర్‌లు ఐపీఎల్‌లో అప్పటి నుంచి ఇప్పటి వరకు అలరిస్తున్నారు. ఈ లిస్టులో టాప్‌లో ఉన్న టాప్ కామెంటేటర్‌లు ఎవరో చూద్దాం.
హర్షా భోగ్లే : ఐపీఎలోనే కాదు ఈయన క్రికెట్ హిస్టరిలోనూ మోస్ట్ పాపులర్ కామెంటేటర్. ఆయన్ను'వాయిస్ ఆఫ్ ఇండియన్ కామెంటరీగా' ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకుంటారు. హర్షా మైక్రోఫోన్ వెనుక ఉంటే ఇక స్టేడియంలో ఒక్క డల్ మూమెంట్ కూడా ఉండదు. 2008 నుంచి ఆయన ఐపీఎల్ మ్యాచ్‌లకు కూడా కామెంటరీ అందిస్తున్నారు.
సునీల్ గావస్కర్ : క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ కూడా తన కామెంట్రీతో స్టేడియాన్ని ఓ ఊపు ఊపేస్తారు. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా ఆయన ఈ ఫీల్డ్‌లో ఉంటూ ఎంతో మంది యంగ్ కామెంటేటర్స్‌కు ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు. ఐపీఎల్ ఫస్ట్ సీజన్ నుంచి ఆయన కామెంట్రీ ప్యానల్‌కు విశిష్ట సేవలు అందిస్తున్నారు. 72 ఏళ్ల వయస్సులోనూ కూడా క్రికెట్ అభిమానులను తన మాటలతో, విశ్లేషణలతో అబ్బురపరుస్తున్నారు.
రవిశాస్త్రి : టీమ్ఇండియా మాజీ క్రికెటర్ రవిశాస్త్రి ఓ క్రికెటర్‌గానే కాకుండా మంచి కామెంటేటర్‌గానూ టీమ్ఇండియాకు సేవలందించారు. ఈయన బూమింగ్ వాయిస్ చాలా పాపులర్. ఐపీఎల్ తొలి ఎడిషన్ నుంచి. ఈయన కామెంటరీ చేస్తున్న ఆయన టీమ్ఇండియాకు ప్రధాన కోచ్‌గా ఎంపికయ్యాక కొంత కాలం పాటు కామెంటరీకి దూరంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న సీజన్‌తో ఆయన కమ్‌బ్యాక్ ఇచ్చి ఆకట్టుకుంటున్నారు.
ఆకాశ్ చోప్రా : మాజీ స్టార్ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఓ క్రికెట్ అనలిస్ట్‌గా ఉంటూనే కామెంట్రీలోనూ రాణిస్తున్నారు. ఐపీఎల్‌లో ఒకేసారి ఇంగ్లీష్, హిందీ రెండింటిలోనూ అనర్గలంగా మాట్లాడి ఆకట్టుకుంటున్నారు. ఐపీఎల్‌లోనూ క్రికెటర్‌గా ఉన్న ఆయన, రిటైర్మెంట్ తర్వాత సొంత యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి క్రికెట్‌కు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకుంటుంటారు.
సంజయ్ మంజ్రేకర్ : ప్రసిద్ధ క్రికెట్ కామెంటేటరల్లో ఒకరైన సంజయ్ క్రికెటర్‌గా టీమ్ఇండియాకు ఎన్నో కీలక ఇన్నింగ్స్ అందించారు. ఇప్పుడు తన కామెంట్రీతోనూ అలరిస్తున్నారు. మ్యాచ్ సమయంలో జరిపే డిబేట్స్, డిస్కషన్స్ షోస్‌లో పాల్గొని తన అభిప్రాయాలు, అంచనాలు షేర్ చేసుకుంటుంటారు.
ఇయాన్ బిషప్ : 2008 నుంచి ఐపీఎల్ కామెంటరీ ప్యానెల్‌లో వెస్టిండీస్ మాజీ క్రికెటర్ ఇయాన్ కూడా కీలక బాధ్యతలు చేపట్టారు. 54 ఏళ్ల వయసులోనూ ఎంతో స్పష్టంగా కామెంటరీ చేసి క్రికెట్ అభిమానులనులకు చేరువయ్యారు. ఐపీఎల్‌లో ఈయన కామెంటరీకి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
డానీ మోరిసన్ : న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ డానీ మోరిసన్ తన కామెంటరీతో స్టేడియంలోని ప్రేక్షకుల్లో జోష్ నింపుతుంటారు. ఫీల్డ్‌లో జరిగే అంశాలను తనదైన స్టైల్లో వివరిస్తారు. క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక, తన కామెంటరీతో ఈయన పాపులరయ్యారు.
మైకెల్ స్లేటర్ : రిటైర్మెంట్ తర్వాత కామెంటరీలోకి ఎంట్రీ ఇచ్చిన మైకెల్, తన వైబ్రెంట్ కామెంటరీతో ఫీల్డ్‌లోని మూమెంట్స్‌ని కళ్లకు కట్టినట్లు చెప్తుంటారు. క్రికెట్లో తనకున్న అనుభవంతో, ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలోనూ ఆటలోని పలు అంశాలను, క్రికెటర్ల మైండ్‌సెట్‌ను వివరిస్తుంటారు. 2018 నుంచి ఈయన ఐపీఎల్ కామెంటరీ చేస్తున్నారు.
పొమ్మీ మాంగ్వా : ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు చాలా మంది పొమ్మీ మాంగ్వా కామెంటరీని ఇష్టపడుతుంటారు. పదేళ్లుగా ఈయనకు ఐపీఎల్‌తో అనుబంధం ఉంది. ఈ మాజీ జింబాబ్వే క్రికెటర్ తన క్రికెట్ నాలెడ్జ్‌ను కామెంట్రీకి జోడించి అద్భుతంగా మాట్లాడుతుంటారు.
లిసా స్తాలేకర్ : ఆటలోనే కాదు మాటలోనూ పురుషులకు ఏ మాత్రం తగ్గమంటూ ఎంతో మహిళా కామెంటేటర్లు రాణించారు. అందులో లిసా స్తాలేకర్ ఒకరు. ఆస్ట్రేలియాలో ప్రోఫెషనల్ క్రికెటర్‌గా ఉన్న ఆమె ఇప్పుడు కామెంట్రీలోనూ అదరగొడుతోంది.
IPL ఫేమస్ భామలు- ఈ క్యూట్ ముద్దుగుమ్మలు గుర్తున్నారా? - Ipl Famous Girls