Tollywood Young Heroes Remuneration : గెలుపు గుర్రానికి డిమాండ్ ఎప్పుడూ ఎక్కువే. అలాంటిది వరుస హిట్లు కొడుతున్న హీరోల సంగతేంటి మరి. డిమాండ్ ఉండాలి కదా. డిమాండ్ ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి కదా. టాలీవుడ్‌లో యంగ్ హీరోలు ఫాలో అవుతున్న పాలసీ ఇదే. కథ ఎంపికలో ఆచితూచి అడుగేస్తూ వరుస హిట్లు కొడుతున్నారు. హిట్ తర్వాత నెక్స్ట్ సినిమా ఓకే చేయాలంటే రెమ్యూనరేషన్ కరెక్ట్‌గా ప్లాన్ చేసి డిమాండ్ చేస్తున్నారు. రీసెంట్‌గా హిట్లు కొట్టిన సిద్దూ జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, తేజ సజ్జా తమ తమ రెమ్యూనరేషన్ కోట్లలో పెంచేశారట. ఎవరికి లెక్క ఎంతుందో చూసేద్దాం.
సిద్ధూ జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda Remuneration) - డీజే టిల్లూ రిలీజ్ అయిన తర్వాత ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన సిద్ధు జొన్నలగడ్డ పక్కాగా ప్లాన్ చేసి టిల్లూ స్క్వేర్తోనూ హిట్ కొట్టేశారు. తానే స్వయంగా కథను రాసుకున్న సిద్ధూ ఈ చిత్రంతో భారీ సక్సెస్‌ను సాధించారు. అలానే ఇప్పుడు రెమ్యూనరేషన్ బాగానే పెంచారట. ఇకపై రూ.20కోట్ల వరకూ రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారని సమాచారం. ప్రస్తుతం సిద్ధు చేతిలో రెండు సినిమాల వరకు ఉన్నాయి.
విశ్వక్ సేన్(Viswak Sen Remuneration) - అటు సినిమాల్లోనూ, ఇటు పబ్లిక్‌గానూ మాస్ పంచులు విసిరే మాస్ కా దాస్ విశ్వక్ సేన్ రీసెంట్‌గా వచ్చిన గామితో మంచి సక్సెస్‌ను అందుకున్నారు. బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే అందుకుందీ చిత్రం. అయితే ప్రస్తుతం ఈయన కూడా రెమ్యూనరేషన్ బాగానే అడుగుతున్నారట. సినీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం రూ.20కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారన బయట కథనాల్లో రాసి ఉంది.
తేజ సజ్జా(Teja Sajja Remuneration) - హనుమాన్ సినిమాతో బాగా ఫేమస్ అయిన తేజ సజ్జా మార్కెట్ కూడా పెరిగిందట. మార్కెట్ ఉన్నప్పుడే రేట్ పెంచేయాలని ఫిక్స్ అయిపోయాడేమో ప్రస్తుతం తన తర్వాతి సినిమాలకు రూ.25 కోట్లు నుంచి రూ.30 కోట్ల వరకు అడుగుతున్నాడట. ప్రస్తుతం ఆయన మిరాయ్తో పాటు మరో రెండు సినిమా చేస్తున్నారని సమాచారం.
ప్రశాంత్ వర్మ, రణ్వీర్ సింగ్ సినిమా - ఆ రూమర్స్‌లో నిజం లేదు - Ranveer Singh Prasanth Varma Movie