ETV Bharat / entertainment

ఛాతి నొప్పితో ఆస్పత్రిలో చేరిన 'పోకిరి' నటుడు ​సాయాజీ షిండే - పరిస్థితి ఎలా ఉందంటే? - Sayaji Shinde Hospitalized - SAYAJI SHINDE HOSPITALIZED

Tollywood Villan Sayaji Shinde Hospitalized: నటుడు సాయాజీ షిండే హాస్పిటల్​లో జాయిన్ అయినట్లు తెలిసింది. ఏం జరిగిందంటే?

ఆస్పత్రిలో చేరిన పోకిరి పోలీస్​ 'సాయజీ షిండే' - ఆయన పరిస్థితి ఎలా ఉందంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 12, 2024, 12:35 PM IST

Updated : Apr 12, 2024, 3:12 PM IST

Tollywood Villan Sayaji Shinde Hospitalized: నటుడు సాయాజీ షిండే గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో సూపర్ హిట్​ చిత్రాల్లో విలన్​గా, తండ్రిగా, సహాయక పాత్రలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. మహారాష్ట్రకు చెందిన ఈయన 2001లో సూరి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమ్యారు. ఆ తర్వాత ఠాగూర్, వీడే , ఆంధ్రావాలా, గుడుంబా శంకర్, పోకరి వంటి ఎన్నో చిత్రాల్లో ఆద్భుతంగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే ఈయన తాజాగా అనారోగ్య సమస్యలతో హాస్పిటల్​లో జాయిన్ అయినట్లు తెలిసింది. హార్ట్​లో చిన్న బ్లాక్ ఉన్నట్లు వైద్యులు గుర్తించి చికిత్స అందించారని సమాచారం అందింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది. ఇక ఈ విషయం తెలుసుకుంటున్న సినీ ప్రేమికులు, అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

షిండేకు చికిత్సను అందిస్తున్న డాక్టర్ మాట్లాడుతూ - "సాయాజీ షిండే కొన్ని రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యారు. అందుకే మేము కొన్ని మామూలు టెస్ట్​లు చేశాము. అప్పుడే ECGలో కొన్ని చిన్న మార్పులు కనిపించాయి. యాంజియోగ్రఫీ చేయించుకోమని సలహా ఇచ్చాం. అది చేశాక గుండెలో వాల్స్ బాగానే ఉన్నాయని తెలిసింది. అయితే కుడి వైపు రక్తనాళంలో మాత్రం కాస్త బ్లాక్ అయింది. షిండేకు చికిత్స ఇచ్చినప్పుడు మాకు పూర్తిగా సహకరించారు. ఇప్పుడు ఆయన పరిస్థితి నిలకడగా ఉంది. త్వరలో డిశ్చార్జ్ చేస్తాము" అని అన్నారు.

సాయిజీ షిండే గురించి మరో డాక్టర్ మాట్లాడుతూ - "షూటింగ్‌తో పాటు సామాజిక కార్యక్రమాల కోసం మహారాష్ట్ర అంతా ఆయన తిరుగుతుంటారు. ప్రతిదానిపైనా ఉత్సాహం చూపిస్తారు. కానీ తన శరీరాన్ని ఎక్కువగా కష్టపెట్టినప్పుడు శరీరంలోని మార్పులను గుర్తించి సరైన సమయంలో సరైన చికిత్స తీసుకుంటారు. అందుకే మళ్లీ మంచిగా పని చేయగలరు" అని చెప్పారు. కాగా, సాయాజీ షిండే మరాఠీ, హిందీతో పాటు కన్నడ, తమిళం, మలయాళం, తెలుగు సినిమాల్లో నటించారు. పోకిరితో ఆయనకు తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది. అలానే నటనతో పాటు పలు సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. ఇకపోతే సాయాజీ షిండే మంచి నటుడు మాత్రమే కాదు చెట్ల ప్రేమికుడు కూడా.

పెళ్లికి ముందే గర్భవతి అయితే - సుహాస్ కొత్త సినిమా రివ్యూ - Sriranga Neethulu Review

ఫ్రైడే స్పెషల్ - OTTలోకి ఒక్కరోజే 11 ఆసక్తికర​ సినిమాలు! - This Week OTT Releases

Last Updated : Apr 12, 2024, 3:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.