ETV Bharat / entertainment

'NBK 109' రిలీజ్ డేట్ ఫిక్స్- 'దేవర'కు బాలయ్య గట్టి పోటీ! - NBK 109 Release Date - NBK 109 RELEASE DATE

NBK 109 Release Date: టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ- బాబి కొల్లి కాంబోలో తెరకెక్కుతున్న 'NBK 109' రిలీజ్ డేట్​పై ఓ అప్డేట్ వచ్చింది.

NBK 109 release Date
NBK 109 release Date (Sourec: EVT Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 19, 2024, 10:04 AM IST

NBK 109 Release Date: నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడంటూ ఎదురుచూస్తున్న 'NBK 109' మూవీ రిలీజ్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సక్సెస్​ఫుల్ డైరెక్టర్ బాబి కొల్లి తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగం పూర్తైయ్యిందట. ఇక మిగిలిన పనులు త్వరత్వరగా పూర్తి చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మేకర్స్ సినిమా రిలీజ్ డేట్​పై ఆలోచిస్తున్నారట. 2024 దసరా కానుకగా అక్టోబర్ 10న థియేటర్లలో రిలీజ్ చేయాలని ప్లాస్తున్నారని ఇన్​సైడ్ టాక్ వినిపిస్తోంది.

అయితే అక్టోబర్ 10వ తేదీని 'దేవర పార్ట్- 1' ఇప్పటికే లాక్ చేసుకుంది. కొరటాల శివ దర్శకత్వ వహిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 10న రానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించేశారు. దీంతో రెండు సినిమాలు ఒకే రోజు రానున్నాయా అని సినీప్రియులు గందరగోళంలో పడ్డారు. రెండు సినిమాలు కూడా స్టార్ హీరోలవి కావడం వల్ల థియేటర్ల అడ్జెస్ట్​మెంట్ కాకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు.

ఒకవేళ NBK 109 కూడా అదే డేట్​ ఫిక్స్ చేసుకుంటే ఎవరు తగ్గుతారు? లేదా రెండు సినిమాలు ఒకే రోజు వస్తాయా? అని ఫ్యాన్స్​ సందేహంలో ఉన్నారు. కానీ, NBK 109 టీమ్ నుంచి రిలీజ్ డేట్​పై ఎలాంటి క్లారిటీ రాలేదు. చూడాలి మరి బాలయ్య ఏ డేట్ ఎంపిక చేసుకుంటారో. ఇక డైరెక్టర్ బాబి ఈ సినిమాను పొలిటికల్ డ్రామా, యాక్షన్​ మోడ్​లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటీనటులు ఊర్వశీ రౌతెలా, బాబీ దేఓల్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

NBK 109 షూటింగ్ పూర్తైన తర్వాత బాలకృష్ణ 'అఖండ సీక్వెల్‌' షూటింగ్‌లో పాల్గొంటారు. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు రూ.150 కోట్లపైన బడ్జెట్‌నే కేటాయించారట. ఇప్పటికే బోయపాటి దర్శకత్వంలో 'సింహా', 'లెజెండ్', 'అఖండ' హ్యాట్రిక్ కొట్టిన బాలయ్య 'అఖండ- 2'తో కూడా భారీ విజయం సాధిస్తారని ధీమాగా ఉన్నారు.

అయితే చాలా రోజుల క్రితమే ఈ ప్రాజెక్ట్​కు బాలయ్య ఓకే చెప్పినప్పటికీ, పలు కారణాల వల్ల షూటింగ్​ ప్రారంభం కాలేదు. ఈ ఏడాది సెప్టెంబర్​ నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇక ఈ సినిమాను పాన్ఇండియా రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారు. బాలకృష్ణ షూటింగ్‌కు రావడమే లేట్ అని, తాను స్క్రిప్ట్ పనులు మొత్తం పూర్తి చేసుకుని, ఆయన కోసమే వెయిట్ చేస్తున్నానంటూ బోయపాటి శ్రీను ఓ మీడియా సమావేశంలో పేర్కొన్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'దేవర ముంగిట నువ్వెంత?, పక్కా హుకుమ్​ పాటను మర్చిపోతారు'- NTR నెక్ట్స్ లెవల్ మాస్! - Devara first single

బాలయ్య కొత్త సినిమా షూటింగ్ ఎంత వరకు వచ్చిందంటే? - NBK 109 Movie

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.