ETV Bharat / entertainment

బాలయ్యను కలిసిన టాలీవుడ్‌ టాప్ డైరెక్టర్స్​ - ఇంతకీ మ్యాటర్ ఏంటంటే? - Tollywood Directors with Balakrishna - TOLLYWOOD DIRECTORS WITH BALAKRISHNA

Tollywood Directors Met Balakrishna : నందమూరి బాలకృష్ణను టాలీవుడ్‌ డైరెక్టర్స్​ అంతా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పూర్తి వివరాలు స్టోరీలో.

Source ETV Bharat
Balakrishna (Source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 7, 2024, 4:42 PM IST

Tollywood Directors Met Balakrishna : నందమూరి బాలకృష్ణను టాలీవుడ్‌ డైరెక్టర్స్​ అంతా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రీసెంట్​గా జరిగిన ఎలక్షన్స్​లో హిందూపురం నుంచి బాలయ్య భారీ మెజారిటీతో మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధించిన నేపథ్యంలో సినీ ప్రముఖులంతా ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగు దర్శకులు ఆయన్ను కలిసి కంగ్రాట్స్ తెలిపారు. బొకేలు కూడా అందించారు. వీరిలో అనిల్‌ రావిపూడి, బాబీ, గోపీచంద్‌ మలినేని ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియా ఎక్స్‌లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. బాలయ్య అభిమానులు వాటిని తెగ షేర్‌ చేస్తున్నారు.

కాగా, బాలయ్య ప్రస్తుతం వరుస విజయాలతో పుల్​ జోష్​లో ఉన్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో బాక్సాఫీస్​ ముందు భారీ హిట్లను అందుకున్నారు. వీటిలో వీరసింహారెడ్డిని గోపిచంద్​ మలినేని తెరకెక్కించగా, భగవంత్ కేసరిని అనిల్ రావిపూడి తెరకెక్కించారు.

ఇకపోతే ప్రస్తుతం బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో నటిస్తున్నారు. #NBK109 పేరుతో దీనిని తెరకెక్కిస్తున్నారు. బాలయ్య కొద్ది రోజులుగా ఎన్నికల ప్రచరాల్లో బిజీగా ఉండటం వల్ల ప్రస్తుతం షూటింగ్​కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. త్వరలోనే ప్రారంభం కానుంది. సినిమాలో బాలీవుడ్‌ స్టార్ యాక్టర్, యానిమల్ ఫేమ్ బాబీ దేవోల్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. మలయాళం అగ్ర హీరో కూడా ఒకరు నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

మూవీలో బాలయ్య రెండు కోణాలున్న పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. చాలా ఏళ్ల తర్వాత ఆయన క్లాసీ లుక్‌లో కనిపించనున్నారని తెలుస్తోంది. పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్​లో సినిమా రూపొందిస్తున్నారని తెలిసింది. రీసెంట్​గా రిలీజ్ చేసిన ప్రచార చిత్రానికి కూడా మంచి ప్రేక్షకాదరణ దక్కింది. ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ సంస్థతో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్​పై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు.

ఇకపోతే తర్వాత రజనీకాంత్ హీరోగా నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ తెరకెక్కించనున్న జైలర్‌ 2లోను బాలయ్య గెస్ట్ రోల్​లో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలానే బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 కూడా చేయబోతున్నారని తెలిసింది. చూడాలి మరి బాలయ్య నెక్ట్స్ సినిమా ఏంటో.

'కన్నప్ప' నుంచి స్పెషల్ సర్​ప్రైజ్​ - ఆ రోజే టీజర్‌ రిలీజ్

షాకింగ్ ధరకు అమ్ముడుపోయిన 'ఓజీ' ఓటీటీ రైట్స్ - ఏకంగా ఎన్ని కోట్లంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.