ETV Bharat / entertainment

దీపావళి ట్రీట్​ - రామ్​చరణ్​ 'RC 16', నాని 'హిట్ 3' నుంచి సూపర్ అప్డేట్స్​ - DEEPAVALI 2024 MOVIE POSTERS

దీపావళి పండగ పర్వదినాన్ని పురస్కరించుకొని తమ కొత్త సినిమాల పోస్టర్లు రిలీజ్​ చేసిన నిర్మాణ సంస్థలు.

Tollywood Deepavali 2024 Movie Posters
Tollywood Deepavali 2024 Movie Posters (source ETV Bharat and Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 31, 2024, 1:08 PM IST

Tollywood Deepavali 2024 Movie Posters : టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో దీపావళి కళ కనిపిస్తోంది. పండగ పర్వదినాన్ని పురస్కరించుకొని నేడు బాక్సాఫీస్​ ముందుకు వచ్చిన చిత్రాలన్నీ (లక్కీ భాస్కర్​, క, అమరన్, భఘీర) పాజిటివ్ టాక్​తో దూసుకెళ్తోన్నాయి. అలానే టాలీవుడ్ మెగాస్టార్​ చిరంజీవీతో పాటు ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌, హరీశ్‌ శంకర్‌ సహా పలువురు సినీ ప్రముఖులు దీవాళీ శుభాకాంక్షలు చెప్పారు. మరోవైపు పలు నిర్మాణ సంస్థలు కూడా సోషల్‌ మీడియా వేదికగా తమ కొత్త సినిమా కబుర్లను సినీ ప్రియులతో షేర్ చేసుకున్నాయి. సినిమా పోస్టర్లను షేర్‌ చేసి, ఆసక్తికర అప్డేట్స్​ను ఇచ్చాయి. ప్రస్తుతం అవి మూవీ లవర్స్​ దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

త్వరలోనే ఆర్‌సీ 16 - మెగా పవర్ స్టార్​ రామ్‌ చరణ్‌ హీరోగా ఉప్పెన్ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. RC 16 వర్కింగ్ టైటిల్​తో ఇది తెరకెక్కనుంది. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్‌ హీరోయిన్​గా నటించనుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్​పై సినిమాను నిర్మించనున్నారు. భిన్నమైన కాన్సెప్ట్‌తో దీనిని తీర్చిదిద్దనున్నారట. కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్‌ కీలక పాత్ర పోషించనున్నారు. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్‌ షూట్‌ త్వరలోనే ప్రారంభం కానుందని చిత్రబృందం తాజాగా అనౌన్స్ చేసింది.

పవర్‌ఫుల్‌గా హిట్‌ 3 - హిట్‌ ఫ్రాంచైజీలో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సారి నేచురల్ స్టార్ నాని హీరోగా శైలేశ్‌ కొలను దీనిని తెరకెక్కిస్తున్నారు. హిట్‌ ది థర్డ్‌ కేస్‌ అనేది టైటిల్‌. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి దీపావళి స్పెషల్‌ పోస్టర్‌ రిలీజ్ అయింది. ఇందులో నాని సీరియస్‌ పవర్​ఫుల్ యాక్షన్ రోల్​లో కనిపించారు. వచ్చే ఏడాది మే 1న సినిమా రిలీజ్ కానుంది. ఇంకా వెంకటేశ్ - అనిల్ రావిపూడి, నితిన్ రాబిన్​హుడ్​​, మంచువిష్ణు కన్నప్ప, తమన్నా ఓదెల 2 చిత్రాలకు సంబంధించిన పోస్టర్లు కూడా విడుదల అయ్యాయి.

'అమరన్‌ అద్భుతం - శివకార్తికేయన్‌, సాయిపల్లవి నటన సూపర్' : సీఎం స్టాలిన్

దీపావళి స్పెషల్​ - కొత్త సినిమా/సిరీస్​లతో ముస్తాబైన ఓటీటీలు - ఆ మూవీ వెరీ స్పెషల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.