ETV Bharat / entertainment

రౌడీ హీరో,డీజే టిల్లు- ఈ ఇద్దరికీ ఇదే మంచి ఛాన్స్​ - బాక్సాఫీస్​ మోత మోగిస్తారా? - Family star Dj Tillu Square - FAMILY STAR DJ TILLU SQUARE

Tollywood 2024 Summer Movies : టాలీవుడ్​లో ఇద్దరు యంగ్ హీరోలు తమ అప్​కమింగ్ మూవీస్​తో ఆడియెన్స్​ను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఒకరు 'ఫ్యామిలీ స్టార్'గా రానుండగా, మరొకరు తనకు కలిసి వచ్చిన టిల్లు క్యారెక్టర్​తో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. అయితే ఈ బాక్సాఫీస్ పోటీలో ఎవరు గెలవనున్నారంటే ?

Tollywood 2024 Summer Movies
Tollywood 2024 Summer Movies
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 28, 2024, 7:38 PM IST

Updated : Mar 28, 2024, 7:45 PM IST

Tollywood 2024 Summer Movies : రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ ఇద్దరూ టాలీవుడ్ లో మంచి పేరున్న హీరోలు. ఈ ఇద్దరూ పెద్ద సినిమా బ్యాక్​గ్రౌండ్​ లేని కుటుంబాల నుంచి వచ్చినవారే. చిన్న పాత్రలతో తమ కెరీర్​ను మొదలెట్టి ఇప్పుడు స్టార్ హీరోల స్థాయికి ఎదిగారు ఈ కుర్రాళ్లు. వరుస ఆఫర్లతో టాలీవుడ్​లో సందడి చేస్తున్న ఈ స్టార్స్ ఇప్పుడు బాక్సాఫీస్​ వద్ద తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. మార్చి 29న సిద్ధు జోన్నలగడ్డ 'టిల్లు స్క్వేర్', ఏప్రిల్ 5న 'ఫ్యామిలీ స్టార్'​తో విజయ్ థియేటర్లలోకి రానున్నారు.

'డీజే టిల్లు' సిద్ధూకి స్టార్​డమ్​ తెచ్చిపెట్టింది. ఆ చిత్రంలో ఆయన తెలంగాణ యాసలో ఎంతో చక్కగా డైలాగ్స్ చెప్పి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దీంతో మేకర్స్ ఈ సీక్వెల్​ను ప్లాన్ చేశారు. ఇటీవలే విడుదలైన రెండు ట్రైలర్లలోనూ ఫుల్​ ఆన్ ఎంటర్​టైన్​మెంట్ కంటెంట్​ కనిపించింది. టిల్లు డైలాగ్స్​తో పాటు అనుపమ గ్లామర్ యాంగిల్ ఈ సినిమాకు హైలైట్​ కానున్నట్లు తెలుస్తోంది. దీంతో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వేసవి సెలవులు కాబట్టి సినిమా కొంచెం ఎంటర్టైనింగ్​గా ఉన్నా చాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇక 'గీత గోవిందం'తో మంచి గుర్తింపు పొందిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇప్పుడు 'ఫ్యామిలీ స్టార్​'గా స్క్రీన్​పై సందడి చేయనున్నాడు. విజయ్ - పరశురామ్ కాంబోలో వచ్చిన 'గీత గోవిందం' పెద్ద హిట్ కావడం వల్ల ఇప్పుడు అదే కలయికలో రానున్న ఈ సినిమాపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఇటీవలే టాలీవుడ్​లో మంచి హిట్స్ అందుకుని దూసుకెళ్తున్న మృణాల్ ఠాకూర్​ కూడా ఈ సినిమాలో లీడ్ రోల్​ చేయడం 'ఫ్యామిలీ స్టార్​'కు ప్లస్ అయింది. 'లైగర్', 'ఖుషి' సినిమా ఫలితాల తర్వాత విజయ్​ ఖాతాలో ఇప్పుడు ఒక హిట్ చాలా అవసరం. తాజాగా విడుదలైన ట్రైలర్​ కూడా విజయ్ ముందు సినిమాల కన్నా భిన్నంగా ఉన్నట్టు అనిపిస్తుండటం వల్ల ఈ సినిమా మీద ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.

సిద్ధు జొన్నలగడ్డ సీరియస్ - హర్ట్ అయిన అనుపమ! - Tillu Square Anupama Parameshwaran

ఛార్మితో పాటు నిర్మాతలుగా మారిన ఈ 11 మంది తెలుగు హీరోయిన్స్​ తెలుసా? - Tollywood Heroines as Producers

Last Updated : Mar 28, 2024, 7:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.