Tollwood New Movie 100 Crore Budget : తెలుగు చిత్ర పరిశ్రమ మార్కెట్ విస్తరించింది. దీంతో సినిమాలు కూడా భారీ బడ్జెట్‌తోనే తెరకెక్కుతున్నాయి. అయితే టాలీవుడ్లో ఇప్పుడు మరో భారీ సినిమా వచ్చేందుకు రెడీ అయింది. భారీ గ్రాఫిక్స్‌తో దీన్ని తెరకెక్కిస్తున్నారు.దాదాపు రూ.వంద కోట్ల బడ్జెట్‌తో ఓ మూవీ తెరకెక్కుతోంది. ఐదేళ్ల పాటు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఇప్పుడు మార్చిలో రిలీజ్ కానుంది.
వివరాళ్లోకి వెళితే. 'బిచ్చగాడు' సినిమాను తెలుగులో రిలీజ్ చేసిన సీనియర్ ప్రొడ్యూసర్ చదలవాడ శ్రీనివాసరావు. ఆయన కుమారుడు లక్ష్ చదలవాడ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'ధీర'. 'వలయం', 'గ్యాంగ్ స్టర్ గంగరాజు' చిత్రాల తర్వాత ఆయన నటించిన చిత్రమిది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జరుపుకుంది. ఈ ఈవెంట్లో చదలవాడ శ్రీనివాసరావు తాను నిర్మిస్తున్న సినిమాల గురించి మాట్లాడారు. తన బ్యానర్ నుంచి తెలుగులో దాదాపు రూ.వంద కోట్ల బడ్జెట్‌తో ఓ మూవీ తెరకెక్కుతోందని చెప్పారు. అయితే ఈ సినిమాలో హీరోహీరోయిన్లు ఎవరన్నది మాత్రం రివీల్ చేయలేదు. మొత్తం తమ బ్యానర్లో 16 సినిమాలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు.
"ఎంతోమంది దర్శకుల్ని ఇంట్రడ్యూస్ చేశాను. ఈ చిత్రంతో విక్రాంత్ అనే మరో టాలెంట్ డైరెక్టర్ పరిచయం అవుతున్నారు. తండ్రిగా లక్ష్‌ను చూసి గర్వపడుతున్నాను. ధీరతో తను మరో మంచి విజయాన్ని అందుకుంటాడు. మార్చిలో మేం రూ.100 కోట్లతో నిర్మించిన 'రికార్డ్ బ్రేక్' అనే గ్రాఫిక్స్ చిత్రం రాబోతోంది. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో ఓ హిందీ సినిమా చేస్తున్నాను. కె.ఎస్.నాగేశ్వరరావు దర్శకత్వంలోనూ, అలాగే ఇతర దర్శకులతోనూ కలిసి మొత్తం 16 చిత్రాలు రూపొందిస్తున్నాం" అని అన్నారు. కాగా, 'ధీర'(Dheera Movie Telugu) చిత్రానికి విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర పతాకంపై పద్మావతి చదలవాడ నిర్మించారు. ఈ చిత్రాన్ని నైజాం, విశాఖలో దిల్‌రాజు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. దిల్‌రాజు మాట్లాడుతూ "చదలవాడ బ్రదర్స్ ఎన్నో అద్భుతమైన చిత్రాలు నిర్మించారు. చదలవాడ శ్రీనివాసరావు ఎంతోమంది చిన్న నిర్మాతలకి సాయం చేశారు. ఆయన తనయుడు లక్ష్ నటించిన 'ధీర' ట్రైలర్ చాలా బాగుంది" అని అన్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఏంటి జ్యోతి రాయ్ వయసు 38 కాదా? రియల్ ఏజ్ చెప్పి షాకిచ్చిన నటి!