ETV Bharat / entertainment

'టిల్లు స్క్వేర్' టాక్: రాధిక మళ్లీ వచ్చిందిరోయ్- ట్విస్ట్​లతో ఎంటర్​టైన్​మెంట్ పక్కా! - Tillu Square Twitter Review - TILLU SQUARE TWITTER REVIEW

Tillu Square Twitter Review: టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ- మల్లిక్ రామ్ కాంబోలో తెరకెక్కింది టిల్లు స్క్వేర్. పలుమార్లు వాయిదా పడుతూ ఈ సినిమా చివరికి మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ టాక్ ఏంటంటే?

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 29, 2024, 7:23 AM IST

Updated : Mar 29, 2024, 9:25 AM IST

Tillu Square Twitter Review: స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ- అనుపమ పరమేశ్వరన్ కాంబోలో తెరకెక్కిన టిల్లు స్క్వేర్ సినిమా శుక్రవారం (మార్చి 29)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2022లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డీజే టిల్లు మూవీసి సీక్వెల్​గా ఈ సినిమాను దర్శకుడు మల్లిక్ రామ్ తెరకెక్కించారు. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా ఎలా ఉందంటే?

డీజే టిల్లులో లాగే టిల్లు స్క్వేర్​లోనూ సిద్దు బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్​తో ఆకట్టుకున్నాడట. టైటిల్ కార్డ్స్​ నుంచే డైరెక్టర్ నవ్వించడం స్టార్ట్ చేశారని నెటిజన్లు అంటున్నారు. సినిమాలో సిద్దు ఎనర్జీ అదిరిపోయిందట. ఫస్ట్​ హాఫ్​లో కామెడీతో ఆడియెన్స్​ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారని అంటున్నారు. అనుపమ- సిద్దు మధ్య కెమిస్ట్రీ అదిరిపోయిందట. ప్రీ ఇంటర్వెల్​లో ట్విస్ట్​ నెక్ట్స్​ లెవెల్​లో ఉందట.

అయితే సెకండ్ హాఫ్​ కాస్త యావరేజ్​గా ఉందని టాక్ వినిపిస్తోంది. కామెడీతో ఆడియెన్స్​ను నవ్వించడం వరకు ఓకే, కానీ డైరెక్టర్ పర్ఫెక్షన్ మిస్ అయ్యారని అంటున్నారు. స్క్రీన్ ప్లే, స్టోరీ కాస్త గజిబిజీగా ఉందని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. అయితే సినిమాలో ట్విస్ట్​లు మాత్రం అదిరిపోయాయట. హీరో సిద్దు, అనుపమ గ్లామర్ షో, టిల్లు తొలి పార్ట్​ హీరోయిన్ నేహా శెట్టి గెస్ట్ రోల్ సినిమాకు ప్లస్ పాయింట్​గా నిలిచాయని చెబుతున్నారు. మొత్తానికి ఫుల్ ఆఫ్ కామెడీ ట్రీట్ పక్కా అని సినిమా చూసిన ప్రేక్షకులు అంటున్నారు.

అటు ఓవర్సీస్​లోనూ టిల్లు స్క్వేర్ ప్రీమియర్స్​లో జోరు ప్రదర్శిస్తుంది. ఇప్పటికే 4లక్షల డాలర్లు ప్రీమియర్ షోస్​ ద్వారా కలెక్షన్లు సాధించింది. ఇక అక్కడ కూడా ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ వస్తోంది. ఇక ఈ సినిమా ఓటీటీ రైట్స్​ను నెట్​ఫ్లిక్స్ దక్కించుకుంది. భారీ ధరకే నెట్​ఫ్లిక్స్ డిజిటల్ హక్కుల్ని కొనుగోలు చేసిందట. ఈ సినిమాలో మరో హీరోయిన్ మడోనా సెబాస్టియన్ కూడా నటించింది. మురళీధర్, రాజ్ తిరందాస్, శ్రీరామ్ రెడ్డి తదితరులు ఆయా పాత్రల్లో కనిపించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సిద్ధు జొన్నలగడ్డ సీరియస్ - హర్ట్ అయిన అనుపమ! - Tillu Square Anupama Parameshwaran

అనుపమ గ్లామర్ అంటే ఆ మాత్రం రేట్ ఉంటది - డీజే టిల్లు కోసం అన్ని కోట్లా!

Last Updated : Mar 29, 2024, 9:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.