THIS WEEK THEATRE OTT RELEASES : గత కొన్ని వారాలుగా బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాల హవానే కొనసాగుతోంది. అలాగే ఈ వారం కూడా పలు చిన్న వైవిధ్య చిత్రాలే ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యాయి.
జబర్దస్త్‌తో కమెడియన్‌గా పాపులారిటీ సంపాదించుకున్న గెటప్ శ్రీను హీరోగా పరిచయమవుతున్న చిత్రం రాజు యాదవ్. అంకిత కారాట్ హీరోయిన్గా నటించింది. కృష్ణమాచారి.కె దర్శకత్వం వహించారు. మే 17న విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడి ఇప్పుడు మే 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మ్యాడ్ మ్యాక్స్ ఫ్రాంఛైజీలో వస్తున్న మరో యాక్షన్ విజువల్ వండర్ మూవీ ఫ్యూరియోసా: ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా(FURIOSA A MAD MAX SAGA) మే 23న ఇంగ్లిష్‌తో పాటు, తెలుగు, హిందీ భాషల్లో రానుంది. అన్య టేలర్, క్రిస్ హేమ్స్‌వర్త్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం దాదాపు రూ.1400కోట్లతో తెరకెక్కింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
శాంతి చంద్ర, దీపిక సింగ్, సిమ్రితి నాయకానాయికలుగా ఆడారి మూర్తి సాయి తెరకెక్కించిన చిత్రం డర్టీ ఫెలో ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘
ఆశిశ్, వైష్ణవి చైతన్య జంటగా నటించిన లేటెస్ట్ హారర్ మూవీ లవ్ మీ. ఇఫ్ యూ డేర్ అన్నది ఉపశీర్షిక. అరుణ్ భీమవరపు దర్శకుడు. దిల్‌రాజు నిర్మించారు. మే 25న ఈ చిత్రం విడుదల కానుంది. దెయ్యంతో హీరో ప్రేమ కథ అనే కొత్త కాన్సెప్ట్‌తో చిత్రాన్ని తెరకెక్కించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/సిరీస్‌లు ఇవే!
డిస్నీ+హాట్‌స్టార్
ది కర్దాషియన్స్ 5 (వెబ్‌సిరీస్) మే 23
ద బీచ్ బాయ్స్ (డాక్యుమెంటరీ మూవీ) మే 24
నెట్‌ఫ్లిక్స్
టఫెస్ట్ ఫోర్సెస్ ఆన్ ది ఎర్త్ (డాక్యుమెంటరీ సిరీస్)మే 22
క్య్రూ (హిందీ) మే 24
అట్లాస్ (హాలీవుడ్) మే 24
జీ 5
వీర్ సావర్కర్ (హిందీ) మే 24
అమెజాన్ ప్రైమ్
ద టెస్ట్ 3 (వెబ్‌సిరీస్) మే 23
జియో సినిమా
డ్యూన్2 (హాలీవుడ్) మే 21
ఆక్వామెన్-2 (తెలుగు) మే 21
- " class="align-text-top noRightClick twitterSection" data="">
యాపిల్ టీవీ ప్లస్
ట్రైయింగ్ 4 (వెబ్‌సిరీస్) (మే 22
లయన్స్ గేట్ ప్లే
వాంటెడ్ మాన్ (హాలీవుడ్) మే 24
తారక్‌కు బాగా కోపమొచ్చిన సందర్భం- సీనియర్ ఎన్టీఆరే అలా మార్చేశారట! - Jr NTR Birthday