This Week OTT Theatre Releases : కొత్త వారం మొదలవ్వడంతో పలు చిత్రాలు, సిరీస్‌లు అటు థియేటర్లలో, ఇటు ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చేశాయి. మరి ఈ సెప్టెంబర్ రెండో వారంలో ప్రేక్షకుల్ని అలరించేందుకు విడుదల కానున్న ఈ కొత్త ప్రాజెక్ట్‌లు ఏంటో తెలుసుకుందాం.
ARM Movie Release Date : 'మిన్నల్ మురళి', '2018' చిత్రాలతో తెలుగు ఆడియెన్స్‌లో గుర్తింపు పొందిన హీరో టొవినో థామస్ ప్రస్తుతం ఎ.ఆర్.ఎం(ARM Movie) చిత్రంతో అలరించేందుకు వస్తున్నారు. జితిన్ లాల్ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రం ఈ నెల 12న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. కృతిశెట్టి, ఐశ్వర్య రాజేశ్, బసిల్ జెసెఫ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Mathu Vadalara 2 : శ్రీసింహా కోడూరి, సత్య ప్రధాన పాత్రల్లో నటించిన మత్తు వదలరా 2ను రితేశ్ రానా తెరకెక్కించారు. చిరంజీవి, హేమలత సంయుక్తంగా నిర్మించారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్. సునీల్, వెన్నెల కిశోర్, అజయ్, రోహిణి ముఖ్య పాత్రలు పోషించారు. సెప్టెంబరు 13న ఇది రిలీజ్ కానుంది.
Bhale Unnade Movie Release Date : రాజ్ తరుణ్ నటిస్తున్న వరుస సినిమాలు ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. దర్శకుడు మారుతి సమర్పణలో తెరకెక్కింది చిత్రం. జె.శివసాయి వర్ధన్ దర్శకుడు. మనీషా కంద్కూర్ హీరోయిన్. ఈ నెల 13న సినిమా రిలీజ్ కానుంది.
ఈ వారం ఓటీటీ సినిమాలు/సిరీస్‌లు ఇవే
నెట్‌ఫ్లిక్స్‌లో
ఛాంపియన్స్ (ఇంగ్లీష్) సెప్టెంబరు 10
ఎమిలి ఇన్ పారిస్ (వెబ్‌సిరీస్) సెప్టెంబరు 12
ఆయ్ (తెలుగు) సెప్టెంబరు 12
ఇన్‌టు ది ఫైర్ (ఇంగ్లీష్) సెప్టెంబరు 12
సెక్టార్36 (హిందీ) సెప్టెంబరు 12
మిస్టర్ బచ్చన్ (తెలుగు) సెప్టెంబరు 12
ఆడిషన్ ప్రాజెక్ట్ (డాక్యుమెంటరీ) సెప్టెంబరు 13
ఆఫీసర్ బ్లాక్ బెల్ట్ (ఇంగ్లీష్) సెప్టెంబరు 13
అగ్లీస్ (ఇంగ్లీష్) సెప్టెంబరు 13
గిఫ్టెడ్ (ఇంగ్లీష్) సెప్టెంబరు 15
డిస్నీ+హాట్‌స్టార్‌లో
ది ఛావెజ్ (స్పానిష్) సెప్టెంబరు 11
గోలీసోడా (తమిళ్) సెప్టెంబరు 13
రీబిల్ట్ ది గ్యాలక్సీ (ఇంగ్లీష్) సెప్టెంబరు 13
సియోల్ బస్టర్స్ (కొరియన్) సెప్టెంబరు 13
సోనీలివ్‌లో
తలవన్ సెప్టెంబరు 10
జీ5లో
నునాకుజి (తెలుగు) సెప్టెంబరు 13
రఘు తాత (తెలుగు) సెప్టెంబరు 13
బెర్లిస్ (హిందీ) సెప్టెంబరు 13
జియో సినిమా
కల్‌బలి రికార్డ్స్(హిందీ సినిమా)- సెప్టెంబర్ 12
లయన్స్ గేట్ ప్లే
లేట్ నైట్ విత్ ది డెవిల్(ఇంగ్లిష్ సినిమా)- సెప్టెంబర్ 13
ట్రెండింగ్‌లో 'దేవర' - ఒకేసారి 4 లేటెస్ట్ అప్డేట్స్! - NTR Devara Movie
డైరెక్టర్‌గా విజయ్ దళపతి కొడుకు - టాలీవుడ్ హీరోతో ఫస్ట్ మూవీ! - Vijay Thalapathy Son Movie