ETV Bharat / entertainment

బాక్సాఫీస్​కు రానున్న పాన్ఇండియా ఫిల్మ్- OTTలో మరికొన్ని- లిస్ట్ ఇదే! - This Week OTT And Movies - THIS WEEK OTT AND MOVIES

This Week OTT And Movie Releases: ప్రతి వారంలాగే ఈ వారం కూడా పలు చిత్రాలు, వెబ్​ సిరీస్​లు థియేటర్లు, ఓటీటీ వేదికలుగా అలరించడానికి సిద్ధమవుతున్నాయి. మరి ఈ వారం రానున్న సినిమాలు, వెబ్​సిరీస్​లు ఎంటో తెలుసా?

THIS WEEK OTT AND MOVIES
THIS WEEK OTT AND MOVIES (Source: Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 8, 2024, 11:39 AM IST

This Week OTT And Movie Releases: 'కల్కి 2898 AD' సినిమాతో ప్రభాస్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నారు. జూన్ 27న రిలీజైన్ ఈ సినిమా సూపర్ హిట్ టాక్​తో థియేటర్లలో దూసుకుపోతోంది. ఈ క్రమంలో సినిమా ప్రేమికులను అలరించడానికి మరో భారీ బడ్జెట్ పాన్ఇండియా మూవీ సిద్ధమైంది. మరి థియేటర్​తోపాటు, ఓటీటీలో ఈ వారం ప్రేక్షకులను అలరించనున్న సినిమాలు, వెబ్​సిరీస్​లు ఏంటో తెలుసా?

'భారతీయుడు- 2'
లోకనాయకుడు కమల్ హాసన్- శంకర్ కాంబోలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం 'భారతీయుడు- 2'. 1996లో రిలీజైన బ్లాక్​బస్టర్​ 'భారతీయుడు'కు సీక్వెల్​గా పాన్ఇండియా రేంజ్​లో ఈ సినిమా రూపొందింది. అవినీతి, లంచగొండితనంపై ప్రతి ఒక్కరినీ 25ఏళ్ల కిందట ఆలోచింపజేసిన ఈ సినిమా మరోసారి సీక్వెల్​తో రెడీ అయ్యింది. రెండు పార్ట్​లుగా ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో జులై 12న తొలి పార్ట్ వరల్డ్​వైడ్ గ్రాండ్​గా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో కమల్​హాసన్​తోపాటు సిద్ధార్థ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, ఎస్‌.జె.సూర్య, బాబీ సింహా, బ్రహ్మానందం, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు.

'సారంగదరియా'
సీనియర్ నటుడు రాజా రవీంద్ర కీలక పాత్రలో నటించిన సినిమా 'సారంగదరియా'. దర్శకుడు పద్మారావు అబ్బిశెట్టి ఈ సినిమా తెరకెక్కించారు. మధ్య తరగతి కుటుంబంలో జరిగిన సంఘర్షణల నేపథ్యంలో సాగే చిత్రమిదని, ఇంటిల్లిపాదికీ నచ్చేలా ఉండనుందని మూవీ యూనిట్ పేర్కొంది. జులై 12న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.

ఓటీటీలో రానున్న సినిమాలు/సిరీస్‌లివే!

ధూమం: మ‌ల‌యాళ నటుడు ఫ‌హాద్ ఫాజిల్‌ కీలక పాత్రలో నటించిన సినిమా 'ధూమం'. గతేడాది రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. దీంతో ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్ ఆహాలో జూలై 11న రానుంది.

జియో సినిమా

  • పిల్‌ (హిందీ సినిమా) జులై 12
  • మనోరమా మ్యాక్స్‌
  • మందాకిని (మలయాళం) జులై 12

నెట్‌ఫ్లిక్స్‌

  • రిసీవర్‌ (వెబ్‌సిరీస్) జులై 10
  • వైల్డ్‌ వైల్డ్ పంజాబ్‌ (హిందీ ) జులై 10
  • వైకింగ్స్‌ : వాల్‌ హల్లా 3 (వెబ్‌సిరీస్‌) జులై 11

డిస్నీ+హాట్‌స్టార్‌

  • కమాండర్‌ కరణ్‌ సక్సేనా (హిందీ సిరీస్‌) జులై 08
  • మాస్టర్‌ మైండ్‌ (వెబ్‌సిరీస్‌) జులై 10
  • అగ్నిసాక్షి (తెలుగు సిరీస్‌) జులై 12

సోనీలివ్‌

  • 36 డేస్‌ (హిందీ సిరీస్‌) జులై 12

వీకెండ్ స్పెషల్​ - 'మీర్జాపూర్ 3'తో పాటు OTTలో ఉన్న సెన్సేషనల్ థ్రిల్లర్స్ ఇవే​! - This Week OTT Releases

OTTలో ఈ థ్రిల్లింగ్​ ఎక్స్​పెరిమెంట్​ మూవీస్​ చూశారా? - వెరీ ఇంట్రెస్టింగ్​! - OTT Experimental Telugu Movies

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.