ETV Bharat / entertainment

ఈ వారం థియేటర్లలో రీ రిలీజ్​ సందడి- OTTలో రానున్న మూవీ/ వెబ్​సిరీస్​లు ఇవే! - This Week Movies And OTT Release

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 16, 2024, 11:48 AM IST

This Week Movies And OTT Release: ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రీ రిలీజ్ సినిమాలదే హవా ఉండనుంది. మరి ఏయే సినిమాలు థియేటర్లలోకి రానున్నాయంటే?

This Week Movies
This Week Movies (Source: Getty Images)

This Week Movies And OTT Release : సెప్టెంబర్ చివరి వారంలో దేవర సినిమా థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. అయితే ఈ వారం మాత్రం టాలీవుడ్​ నుంచి ఒకట్రెండు సినిమాలే రిలీజ్ కానున్నాయి. కానీ, తెలుగు మూవీ లవర్స్​ను ఎంటర్టైన్ చేయడానికి ఎవర్​గ్రీన్ బ్లాక్​బస్టర్ చిత్రాలు మాత్రం రీ రిలీజ్​కు రెడీ అవుతున్నాయి. అలా ఈ వారం థియేటర్లలో, ఓటీటీల్లో అలరించనున్న సినిమాలు, వెబ్​సిరీస్​లు ఏవో చూద్దాం.

Gorre Puranam Movie : టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ నటుడు సుహాస్ మరో వైవిధ్యమైన కథతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైపోయారు. ఈసారి 'గొర్రె పురాణం' అనే సినిమాతో థియేటర్లలోకి రానున్నాడు. ఈ సినిమాకు బాబీ దర్శకత్వ వహించారు. సెప్టెంబర్ 20న ఈ మూవీ రిలీజ్ కానుంది.

Kahan Shuru Kahan Khatam : బాలీవుడ్ రొమాంటిక్ చిత్రం 'కహా షురూ కహా ఖతం' సెప్టెంబరు 20న విడుదల కానుంది. ఈ సినిమాను శౌరబ్‌ దాస్‌గుప్త తెరకెక్కించారు. ఆయితే ఈ సినిమా కథ మాత్రం 'మిమి', 'జర హట్కే జర బచ్కే' డైరెక్టర్ లక్ష్మణ్‌ ఉటేకర్‌ అందించారు. దీంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ధ్వని భానుశాలి, ఆషిమ్‌ గులాటీ కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబరు 20న ఈ మూవీ విడుదల కానుంది.

Yudhra : సిద్ధాంత్‌ చతుర్వేది- మాళవిక మోహనన్‌ లీడ్ రోల్​లో తెరకెక్కిన సినిమా 'యుద్ర'. రవి ఉద్యావర్‌ దర్శకత్వం వహించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకున్న ఈ మూవీ సెప్టెంబరు 20న హిందీలో విడుదల కానుంది. ఈ సినిమాతోనే మాళవిక బాలీవుడ్​లో తెరంగేట్రం చేయనున్నారు.

రీ రిలీజ్​లు ఇవే

బొమ్మరిల్లు : 2006లో ఫ్యామిలీ ఎంటర్టైనర్​గా తెరకెక్కిన 'బొమ్మరిల్లు' భారీ విజయం అందుకుంది. అప్పట్లోనే ఈ సినిమా 175 రోజులు ఆడింది. సిద్ధార్థ్‌- జెనీలియ జంటగా దర్శకుడు భాస్కర్‌ ఈ సినిమా తెరకెక్కించారు. ఇక దేవి శ్రీ ప్రసాద్‌ అందించిన పాటలు ఇప్పటికీ యూత్‌ ఫేవరెట్ లిస్ట్​లో ఉంటాయి. అలాంటి సినిమా మళ్లీ థియేటర్స్‌లో అలరించడానికి సిద్ధమైంది. సెప్టెంబరు 21న తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన థియేటర్స్‌లో 'బొమ్మరిల్లు' రీ- రిలీజ్‌ కానుంది.

వెంకీ : మాస్ మహారాజ- శ్రీను వైట్ల కాంబోలో తెరకెక్కిన 'వెంకీ' 2004లో భారీ దక్కించుకుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్, కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ నటన అదరగొట్టేశారు. ముఖ్యంగా సినిమాలో రైళ్లో ఓ సీన్​కు ప్రత్యేక ఫ్యాన్​బేస్ ఉంది. ఈ సినిమా కూడా సెప్టెంబరు 21న తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన థియేటర్స్‌లో 'వెంకీ' రీ- రిలీజ్‌ కానుంది.

జర్నీ : తమిళ, తెలుగు భాషల్లో మంచి విజయాన్ని అందుకున్న చిత్రం 'జర్నీ'. జై , శర్వానంద్‌, అంజలి, అనన్య కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు సెప్టెంబరు 21న ఈ సినిమా కూడా రీ- రిలీజ్‌ అవుతోంది.

ఓటీటీ సినిమాలు/సిరీస్‌లు

డిస్నీ + హాట్​స్టార్

  • అన్‌ ప్రిజన్డ్‌ (వెబ్‌సిరీస్‌) సెప్టెంబరు 16
  • అగాథ ఆల్‌ ఎలాంగ్‌ (హాలీవుడ్‌) సెప్టెంబరు 17
  • ది మిస్టరీ ఆఫ్‌ మోక్ష ఐల్యాండ్‌ (తెలుగు) సెప్టెంబరు 20
  • ది జడ్జ్‌ ఫ్రమ్‌ హెల్‌ (వెబ్‌సిరీస్‌) సెప్టెంబరు 21

నెట్​ఫ్లిక్స్

  • గ్రేవ్‌ టార్చర్‌ (ఇంగ్లీష్‌) సెప్టెంబరు 16
  • కలినరీ క్లాస్‌ వార్స్‌ (కొరియన్‌) సెప్టెంబరు 17
  • ఫాస్ట్‌ ఎక్స్‌ (ఇంగ్లీష్‌) సెప్టెంబరు 18
  • మాన్‌స్టర్స్‌ (వెబ్‌సిరీస్‌) సెప్టెంబరు 19
  • హిజ్‌ త్రీ డాటర్స్‌ (హాలీవుడ్‌) సెప్టెంబరు 20
  • ది గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ షో2 (టాక్‌ షో) సెప్టెంబరు 21
  • ఈవిల్‌ డెడ్ రైజ్‌ (ఇంగ్లీష్‌) సెప్టెంబరు 21

అమెజాన్‌ ప్రైమ్‌

  • ఎ వెరీ రాయల్ స్కాండిల్‌ (వెబ్‌సిరీస్‌) సెప్టెంబరు 19

జియో సినిమా

  • దుర్గ (హిందీ) సెప్టెంబరు 16
  • జీ తేరా హై వో మేరా హై (హిందీ) సెప్టెంబరు 20
  • ది పెంగ్విన్‌ (వెబ్‌సిరీస్‌) (సెప్టెంబరు 29

ఈ వారం 4 బెస్ట్ మలయాళం మూవీస్​ ఇవే - తెలుగులోనూ స్ట్రీమింగ్​! - This Week Best OTT Malayalam Movies

చిన్న సినిమాలతో కొత్త శుక్రవారం - ఏఏ చిత్రాలు థియేటర్లలో వస్తున్నాయంటే? - THIS WEEK THEATRE RELASES

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.