This week Theatre Relases : ఈ శుక్రవారం బడా సినిమాలు లేకపోయినా తక్కువ బడ్జెట్‌తో రూపొందిన పలు ఆసక్తికరమైన చిత్రాలు థియేటర్లలో విడుదలకు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా ఒక రోజు ముందుగానే గురువారం(సెప్టెంబర్ 12) మలయాళం 'ఏఆర్ఎం' రిలీజ్ అయింది. టొవినో థామస్ ఐశ్వర్య రాజేశ్, కృతి శెట్టిలు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం మంచి టాక్‌ను దక్కించుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూటర్స్‌గా ఉండటంతో థియేటర్లు కూడా బాగానే దక్కాయి.
బడ్జెట్‌లో, తారాగణంలో చిన్న సినిమానే అయినా రాజమౌళి, ప్రభాస్ లాంటి వాళ్ల సహకారంతో సక్సెస్ ఫుల్‌గా ప్రమోషన్ చేసుకుంది 'మత్తు వదలరా 2' మూవీ యూనిట్. ఏకంగా ప్రభాస్ దగ్గరకు వెళ్లి ఫన్నీగా ట్రైలర్ లాంఛ్ చేయించుకున్నారు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, హీరో శ్రీసింహ, తదితరులు. హీరో ప్రభాస్‌ను టీజ్ చేస్తూ ఆయన చేతుల మీదుగా లాంఛ్ చేయించిన ట్రైలర్‌లో ఫుల్ ప్యాక్‌డ్ కామెడీ చూపించారు. ఇందులో చూపించినట్లుగానే సినిమాలోనూ అంతే ఫన్ ఉంటుంది. జనం థియేటర్లకు వచ్చి మా సినిమా చూస్తారంటూ ఫుల్ కాన్ఫిడెన్స్‌లో ఉన్నారు మూవీ యూనిట్. సెప్టెంబర్ 13న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది.
రీసెంట్‌గా తిరగబడరా సామీ, పురుషోత్తముడు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు రాజ్ తరుణ్. ప్రస్తుతం ఆయన నటించిన 'భలే ఉన్నాడే' కూడా ఫ్రై డే రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.
ఇక దిలీప్ ప్రకాశ్, రెజీనా కసెండ్రా, బ్రహ్మానందం లాంటి నటీనటులతో సిద్ధమైన 'ఉత్సవం' కూడా ఈ ఫ్రైడే బరిలోనే ఉంది. ఇవే కాక ఓ మోస్తారు బడ్జెట్‌తో తెరకెక్కిన 'కళింగ' కూడా పోటీలోనే ఉంది. బడా స్టార్లు లేకపోవడంతో ఈ వారం భారీ ఓపెనింగ్స్ ఉండకపోయినా, కంటెంట్ ఉంటే మాత్రం ఆ తర్వాత బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాలు మంచి వసూళ్లను సాధించొచ్చు.
ఇకపోతే గత వారంలో శుక్రవారం వచ్చిన సినిమాల్లో 35 చిన్న కథ కాదు మాత్రమే పరవాలేదని అనిపించింది. రిలీజ్‌కు ముందే మంచి బిజినెస్ చేసుకున్న దళపతి విజయ్ నటించిన 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం' పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కాబట్టి ఈ చిత్రం రెండో వారం ఆడటం అంటే కష్టమే! ఇకపోతే పెద్ద సినిమా చూడాలనే ఆకలి నెలాఖరులో వచ్చే 'దేవర'తో గానీ తీరదు. కొరటాల శివ డైరక్షన్‌లో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా సెప్టెంబర్ 27న రాబోతున్నారు తారక్.
టొవినో థామస్ 'ఎ.ఆర్.ఎమ్' - కృతి శెట్టి ఫస్ట్ మలయాళం మూవీ ఎలా ఉందంటే? - ARM Movie Review