The Goat Life Shooting : ఒక సినిమా షూట్ ఎంత వరకు ఉంటుంది ఏడాది లేకుంటే రెండేళ్ల పాటు ఉండొచ్చు. కానీ ఓ చిత్రం దాదాపు 16 ఏళ్ల పాటు చిత్రీకరణ జరిగిందంటే మీరు నమ్ముతారా. కానీ ఇది నిజం. ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఆ మూవీ చిత్రీకరణ దాదాపు 16 ఏళ్ల పాటు సాగిందంటూ స్వయంగా మూవీ టీమ్ తాజాగా వెల్లడించింది. ఇది విన్న ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురయ్యారు. అస్సలు అంతలా ఈ సినిమాలో ఏముందంటూ నెట్టింట వెతక సాగారు. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్ నటించిన 'ఆడు జీవితం' (The Goat Life). ఈ నేపథ్యంలో సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు మీ కోసం.
ఈ చిత్రం మార్చి 28న ప్రేక్షకుల ముందుకొచ్చింది. బెంజమిన్ అనే రచయిత రాసిన 'ఆడుజీవితం' అనే మలయాళ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని మల్లు డైరెక్టర్ బ్లెస్సీ తెరకెక్కించారు. బుక్ చదివిన వెంటనే డైరక్టర్ బ్లెస్సీ పృథ్వీరాజ్ సుకుమారనే ఇందులో లీడ్ క్యారెక్టర్ అని ఫిక్స్ అయిపోయారట. అయితే చాలా లాంగ్ టైమ్ షెడ్యూల్ ఉన్న సినిమా కాబట్టి వెంటనే ప్రొడ్యూసర్ దొరకలేదట. ఇందుకోసం హీరో తాను ఫ్రీగా నటిస్తానని, సినిమా హిట్ అయి లాభాలు వస్తే అందులో వాటా ఇమ్మని అడగడం వల్ల 2015లో ప్రొడ్యూసర్ దొరికారు. "కాన్సెప్ట్ అనుకుని 16 ఏళ్లవుతోంది స్క్రిప్ట్ రాసి 10 ఏళ్లవుతోంది. షూటింగ్ స్టార్ట్ అయి 6 ఏళ్లవుతోంది ఇక ఈ వెయిటింగ్ ఎండింగ్‌కి చేరింది" అంటూ పోస్టర్‌పై రాశారు.
దీని ప్రకారం ఈ సినిమా షూటింగ్ 2018లో మొదలైంది. అయితే కొవిడ్-19 వల్ల పూర్తిగా వాయిదా పడింది. 2020వరకూ షూటింగే జరగలేదు. ఆ తర్వాత 2022 నాటికి కంప్లీట్ చేయాలనుకుని ప్రయత్నిస్తే అది కాస్తా 2024 మార్చి 28కి థియేటర్లలో రిలీజ్ అయింది.
ఎడారిలో చిక్కుకున్న సినిమా యూనిట్
2020లో జోర్డాన్స్ వాడీ రమ్ ఎడారిలో సినిమా షూటింగ్ జరుగుతుంది. అప్పుడే కొవిడ్-19 మహమ్మారి వ్యాపించడం, లాక్ డౌన్ విధించడం జరిగాయి. ఇంటికి వెళ్లడం కూడా కుదరలేదు. అలా కొన్ని వారాల వరకూ ఎడారిలోనే మకాం వేయాల్సి వచ్చింది. ఆ తర్వాత వందేభారత్ మిషన్‌లో భాగంగా ఇండియన్ గవర్నమెంట్ చొరవతో వారంతా ఇళ్లకు చేరుకున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఈ సినిమా కోసం సౌదీ అరేబియా నుంచి మేకలను కొనుగోలు చేశారట. ఒక మలయాళీ వలస కార్మికుడు బానిసగా మారి కొన్నేళ్లపాటు మేకలతోనే కలిసి గడపాల్సి వస్తుంది. ఈ సీన్లు చిత్రీకరించేందుకు జోర్డాన్, అల్జీరియా ఎడారులకు సౌదీ నుంచి 20 ఒంటెలు, 250 గొర్రెలను తీసుకుని వచ్చారు. ఈ సినిమాలో అమలాపాల్, శోభా మోహన్, జిమ్మీ జీన్ లూయీస్ కూడా నటించారు.
'బాలయ్యతో సినిమా చేయాలని ఉంది - ఆయన్ను అలా చూడాలని నా కోరిక' - Balakrishna Prithvi Raj Movie
'సలార్'లో దేవ - వరదా సందడి -బిహైండ్ ద సీన్స్‌లో పిక్చర్ పర్ఫెక్ట్ ఫొటోలు