The 100 Telugu Movie : బుల్లితెర నటుడు ఆర్కే సాగర్ లీడ్ రోల్లో తెరకెక్కిన తాజా మూవీ 'ది 100'. అయితే ఈ చిత్రం రిలీజ్‌కు ముందే పలు రికార్డులను బ్రేక్ చేసి ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డుల్లో జ్యూరీ అవార్డు అందుకోగా, తాజాగా మరో ఘనత సాధించింది.
ముంబయి వేదికగా త్వరలో జరగనున్న 12వ ఇండియన్ సినీ ఫిల్మ్ ఫెస్టివల్ ఈవెంట్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించన్నారు. దీంతో పాటు బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ సౌండ్ డిజైన్ లిస్ట్‌లో పలు హాలీవుడ్ అవార్డులను సైతం ఈ చిత్రం అందుకున్నట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు.
ఇదిలా ఉండగా, గతంలో ఈ మూవీపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుస కూడా ప్రశంసల జల్లు కురిపించారు. "ది 100 చిత్ర ఇతివృత్తం చాలా బాగుంది. ఇందులో మంచి సందేశం కూడా ఉంది. దీన్ని ఆడియెన్స్ ఆదరిస్తారనే విశ్వాసం ఉంది" అని వెంకయ్య నాయుడు అన్నారు.
ఇక 'ది 100' సినిమా విషయానికి వస్తే, యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఓంకార్ శశిధర్ డైరెక్ట్ చేేశారు. ఇందులో ఆర్కే ఓ పవర్ఫుల్ పోలీస్‌గా కనిపించనున్నారు. కల్యాణి నటరాజన్, గిరిధర్, ఆనంద్, లక్ష్మీ గోపాల్ స్వామి, జయంత్, యాంకర్ విష్ణు ప్రియ, బాలకృష్ణ, తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ అభిమానులను తెగ ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రానికి శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టగా, 'యానిమల్' ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మూవీ టీమ్ త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రం మంచి యాక్షన్ ఎంటర్టైనర్గా రానుందంటూ డైరెక్టర్ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇక ఈ సినిమాలో ఎమోషనల్, అలాగే కమర్సియల్ ఎలిమెంట్స్ కూడా ఉండనున్నాయని, అలాగే ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు మూవీ టీమ్ తెలిపింది.
నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ - బెస్ట్ యాక్టర్ రిషబ్ శెట్టి - 70th National Film Awards