Vikram Thangalaan : చియాన్ విక్రమ్ హీరోగా మాళవికా మోహనన్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ హిస్టరికల్ ఫాంటసీ డ్రామా "తంగలాన్". ప్రముఖ దర్శకుడు పా. రంజిత్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్‌లో చిత్రీకరించారు. ఆగస్ట్ 15న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడులలో చక్కర్లు కొడుతోంది సినిమా యూనిట్. ఇందులో భాగంగానే మధురైలో జరిగిన ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు తంగలాన్ హీరో విక్రమ్, హీరోయిన్ మాళవికా మోహనన్.
Suriya Vikram : ఈ సందర్భంగా ఓ రిపోర్టర్ విక్రమ్‌తో మాట్లాడుతూ "మీకు అజిత్, సూర్యలాగా సెలబ్రిటీ స్టేటస్ లేదు కదా. మరి మీకు ఆ రేంజ్‌లో అభిమానులు ఉంటారా? అంటూ ప్రశ్నించారు. దీనికి విక్రమ్ ఫైర్ అవకుండా తన రెగ్యులర్ స్టైల్లోనే ఈ రిపోర్టర్‌కు అదిరిపోయే సమాధానం ఇచ్చారు. "బహుషా నా ఫ్యాన్స్ గురించి మీకు తెలియకపోవచ్చు. మీరొకసారి తంగలాన్ రిలీజ్ రోజు థియేటర్ దగ్గరకు వచ్చి చూడండి" అని కూల్ కౌంటర్ ఇస్తూనే ఓ నవ్వు నవ్వేశారు.
అలానే కోలీవుడ్‌లోని టాప్ త్రీ లీడింగ్ హీరోస్‌లో ఉండే పాపులారిటీ మీకు లేదు కదా అని వ్యంగ్యంగా అడిగిన ప్రశ్నకు విక్రమ్‌కు మళ్లీ అదే రేంజ్ కౌంటర్ ఇచ్చారు. "టాప్ హీరోనా కాదా అనేది కాదు మ్యాటర్. ప్రేక్షకులకు మనమెంత కనెక్ట్ అయ్యామనేదే అసలు సంగతి. ధూల్, సామీ లాంటి సినిమాలు ఎలా తీయాలో నాకు అర్థమైంది. తంగలాన్ సినిమాలో నా పూర్తి కష్టాన్ని పెట్టి నా అభిమానులకు నచ్చేలా నటించాను. నన్ను అడిగితే ప్రతి ఒక్కరికీ వాళ్ల అభిమానులు వాళ్లకు ఉంటారు. ఇలా విక్రమ్ సమాధానాలు చెబుతుంటే మరొక రిపోర్టర్ రెస్పాండ్ అయి మిగిలిన హీరోలకు ఫ్యాన్స్‌తో పాటు ద్వేషించే వాళ్లు ఉంటారు, విక్రమ్‌ను ద్వేషించే వాళ్లు ఉండరని అన్నారు.
విజయవాడ ప్రెస్‌మీట్‌లో - ప్రమోషన్స్‌లో భాగంగా విజయవాడకు వచ్చిన విక్రమ్ మరో ప్రెస్‌మీట్‌లో పాల్గొని మాట్లాడారు. "విజయవాడ క్లైమేట్ నాకు బాగా నచ్చింది. బాబాయ్ హోటల్‌లో ఫుడ్ కూడా సూపర్. ఇక్కడ నా సినిమాలకు మంచి ఆదరణ లభించింది. రెగ్యులర్ కమర్షియల్ ఫైట్లు, పాటలు లేకపోయినా భావోద్వేగాలతో కూడిన ఈ సినిమా మీకు బాగా నచ్చుతుందని ఆశిస్తున్నా" అని వెల్లడించారు.
సినిమాల్లోకి షారుక్ ఖాన్ చిన్న కొడుకు - ట్రైలర్ అదిరింది - Mufasa The lion king