ETV Bharat / entertainment

'తండేల్' రిలీజ్​పై డైరెక్టర్ క్లూ- ఆ స్టార్లతో బాక్సాఫీస్ పోటీకి సై! - తండేల్ మూవీ రిలీజ్ డేట్

Thandel Movie Release: టాలీవుడ్ స్టార్ హీరో నాగచైతన్య- సాయి పల్లవి లీడ్ రోల్స్​లో తెరకెక్కుతున్న మూవీ 'తండేల్'. ఈ సినిమాకు చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, రీసెంట్​గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చందూ ఈ సినిమా రిలీజ్ గురించి ఓ క్లూ వదిలారు.

Thandel Release Date
Thandel Release Date
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 17, 2024, 9:56 PM IST

Updated : Feb 18, 2024, 6:24 AM IST

Thandel Movie Release: 2024లో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పలు సినిమాలు సందడి చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో యంగ్ టైగర్ ఎన్​టీఆర్ 'దేవర పార్ట్- 1', విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్', నాని 'సరిపోదా శనివారం', అల్లు అర్జున్ 'పుష్ప ది రూల్', రెబల్ స్టార్ ప్రభాస్ 'కల్కి' సినిమాల మేకర్స్​ ఇప్పటికే రిలీజ్ డేట్స్​ అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఈ లిస్ట్​లో నాగచైతన్య- చందూ మొండేటి 'తండేల్' చేరనుంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుపుకుంటుంది. అయితే రీసెంట్​గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ చందూ మొండేటి రిలీజ్ గురించి ఓ క్లూ ఇచ్చారు. ఈ మూవీని 2024 దసరా బరిలో దింపాలని ప్లాన్ చేస్తున్నట్లు చందూ చెప్పారు. దీని నుంచి అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ దసరా బరిలో తండేల్ కూడా చేరితే బాక్సాఫీస్ వద్ద ఫైట్​ మరింత రసవత్తంరంగా మారుతుంది. జూనియర్ ఎన్​టీఆర్ దేవర అక్టోబర్ 10న రిలీజ్ కానున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. అలాగే నందమూరి బాలకృష్ణ NBK 109 కూడా దసరాకే రానున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి మేకర్స్ ఏ నిర్ణయం తీసుకుంటారో?

ఇక ఈ సినిమాను చందూ మొండేటి కోస్టల్ బ్యాక్​డ్రాప్​లో తెరకెక్కిస్తున్నారు. రీసెంట్​గా రిలీజ్ చేసిన వీడియో గ్లింప్స్​కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. మూవీలో నాగచైతన్య సరసన సాయి పల్లవి నటిస్తోంది. ఇదివరకు వీరి కాంబోలో వచ్చిన లవ్​స్టోరీ మంచి విజయం సాధించడం వల్ల ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక గీతా ఆర్ట్స్ బ్యానర్​పై అల్లు అరవింద్, బన్నీ వాస్ సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. రాక్​స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

వాలెంటైన్ డే స్పెషల్ రీల్: రీసెంట్​గా వాలెంటైన్ డే సందర్భంగా ఈ సినిమాలోని ఓ డైలాగ్​తో హీరో నాగచైతన్య రీల్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'తండేల్ గ్లింప్స్​కు వస్తున్న రెస్పాన్స్​ పట్ల థ్రిల్లింగ్​గా ఉంది. దానిపై మీరందరూ (నెటిజన్లు) రీల్స్​ చేయడం సంతోషాన్నిస్తుంది. మీలాగే మేము (నేను & సాయి పల్లవి) కూడా రీల్ చేయాలనుకున్నాం. మీ అందరికీ తండేల్ మూవీ టీమ్ నుంచి హ్యాపీ వాలెంటైన్ డే' అని చైతు పోస్ట్ చేశారు. రీల్ చూసిన ఫ్యాన్స్ చైతూ- సాయి పల్లవి జోడీ బాగుందంటూ కామెంట్స్ పెడుతున్నారు. కాగా, ఇదివరకే వీరి కాంబోలో తెరకెక్కిన 'లవ్​స్టోరి' సినిమా మంచి విజయం సొంతం చేసుకుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సాయి పల్లవికి చైతూ లవ్​ ప్రపోజ్- వీడియో పోస్ట్ చేసి సర్ప్రైజ్!

గురి తప్పేదేలేదెస్ అంటున్న చైతూ - ఏలియన్​తో శివ కార్తికేయన్ ఫ్రెండ్​షిప్​

Last Updated : Feb 18, 2024, 6:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.