ETV Bharat / entertainment

దళపతి విజయ్ మరో సినిమాను ఓకే చేశారా? - THALAPATHY VIJAY DIRECTOR ATLEE

దళపతి విజయ్​ ఆ దర్శకుడితో మరో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని ప్రచారం!

Thalapathy Vijay
Thalapathy Vijay (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 22, 2024, 10:24 PM IST

Thalapathy Vijay Atlee Movie : కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ప్రస్తుతం దర్శకుడు హెచ్ వినోద్​తో తన కెరీర్ చివరి సినిమా(69వది) చేస్తున్న సంగతి తెలిసిందే. చిత్రంలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్​గా నటిస్తుండగా, యంగ్ హీరోయిన్ మమిత బైజు ఓ కీలక పాత్రలో కనిపించనుంది. టాలీవుడ్ సాలిడ్ హిట్ భగవంత్ కేసరికి రీమేక్​గా ఇది రానున్నట్లు బలంగా ప్రచారం సాగుతోంది.

ఈ సినిమా తర్వాత విజయ్ నిజంగానే సినిమాలు ఆపేసినట్టేనా? మరి గతంలో ప్రకటించిన సీక్వెల్స్ పరిస్థితి ఏంటి? అని పలు ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు మరో కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. 69వది చివరి చిత్రం కాదని, అలానే ఈ సీక్వెల్స్ కూడా కాకుండా, మరో చిత్రం చేసేందుకు విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని పలు రూమర్స్ కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని విజయ్​కు పలు భారీ హిట్స్ అందించిన దర్శకుడు అట్లీతో చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

Thalapathy Vijay Atlee combo Movies : కాగా, విజయ్​తో కలిసి దర్శకుడు అట్లీ వరుసగా మూడు చిత్రాలు చేశారు. యాక్షన్‌ థ్రిల్లర్‌ తెరి 2016లో విడుదలై మంచి సక్సెస్ అందుకుంది. తెలుగులో పోలీసోడు పేరుతో డబ్ అయి ఇక్కడ కూడా అలరించింది. రూ. 75 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద రూ. 150 కోట్లు కలెక్ట్‌ చేసింది.

విజయ్‌- అట్లీ కాంబినేషన్‌లో వచ్చిన మరో యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం మెర్సల్‌ (2017, తెలుగులో అదిరింది) కూడా మంచి విజయాన్ని అందుకుంది. రూ. 120 కోట్ల బడ్జెట్​తో తెరకెక్కి రూ. 200 కోట్లకుపైగానే వసూళ్లను సాధించింది.

అనంతరం విజయ్​తో స్పోర్ట్స్‌ యాక్షన్‌ డ్రామా బిగిల్​(2019) తెరకెక్కించి మరో విజయం సాధించారు అట్లీ. తెలుగులో విజిల్​గా వచ్చి అలరించింది. రూ. 180 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా రూ. 280 కోట్లకుపైగా వసూళ్లను చేసింది.

'రావణుడిగా నటిస్తున్నా - సాయి పల్లవిని ఆయనే సెలక్ట్ చేశారు'

రామ్‌ చరణ్‌ అరుదైన ఘనత - అమితాబ్‌, షారుక్​ సరసన చోటు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.