Thalapathy 69 Announcement : తమిళ స్టార్ హీరో విజయ్ అప్‌కమింగ్ మూవీ 'దళపతి 69' గురించి మేకర్స్ తాజాగా ఓ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఓ స్పెషల్ వీడియో ద్వారా చిత్రాన్ని KVN ప్రొడక్షన్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేయగా, ఫ్యాన్స్ ఆ వీడియోను చూసి ఎమోషనల్ అవుతున్నారు.
"మా మొదటి తమిళ సినిమా #Thalapathy69 అని అనౌన్స్ చేస్తున్నందుకు మాకు ఎంతో గర్వంగా అలాగే, సంతోషంగా ఉంది. ఈ చిత్రం కోసం విజయ్‌తో కలిసి పని చేస్తున్నందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. ది టార్చ్ బేరర్ ఆఫ్ డెమోక్రసీ వచ్చే ఏడాది అక్టోబర్‌లో మీ ముందుకు రానున్నారు" అంటూ ఆ ట్వీట్లో మేకర్స్ పేర్కొన్నారు. అయితే ఈ వీడియో చూసిన తర్వాత విజయ్ అభిమానులు భిన్నాభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు. చూస్తుంటే ఈ చిత్రం పొలిటికల్ నేపధ్యంలో సాగేలా అనిపిస్తోందని, ఇదే ఆయన లాస్ట్ సినిమా అయ్యుండచ్చని అంటున్నారు.
ఇకపై సినిమాలు చేయరా?
వాస్తవానికి విజయ్ కూడా గత కొంతకాలంగా రాజకీయాల్లో బిజీగా ఉంటున్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో 'తమిళగ వెట్రి కళగం' అనే పార్టీని ఈ ఏడాది ఫిబ్రవరిలో స్థాపించారు. దీనికి సంబంధించిన పనుల్లో ఆయన యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన సినిమాలకు దూరంగా ఉంటానంటూ ఇటీవలె ప్రకటించారు.
'గోట్' ఎలా ఉందంటే?
దళపతి విజయ్ డబుల్ యాక్షన్‌లో మెరిసిన 'గోట్' చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొంది ప్రపంచవ్యాప్తంగా 6500 స్క్రీన్లలో రిలీజ్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో 250కు పైగా సెంటర్లలో విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఫలితంగా ఫస్ట్ డే తమిళంలో రూ.40 కోట్లు, తెలుగులో రూ. 3 కోట్లు, హిందీలో రూ.2 కోట్లు, కన్నడలో రూ.3 కోట్లు, కేరళలో రూ. కోటి, ఇతర రాష్ట్రాల్లోనూ రూ.కోటి రూపాయల నికర వసూళ్లను సాధించింది.
ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, వైభవ్, లైలా, ప్రశాంత్, స్నేహ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను ఉపయోగించి దివంగత కోలీవుడ్ నటుడు విజయకాంత్‌ను తీసుకొచ్చి ఆయన్ను గుర్తుచేసుకున్నారు. అంతేకాకుండా 'డీ-ఏజింగ్' టెక్నాలజీ ఉపయోగించి విజయ్‌ని 25 ఏళ్ల కుర్రాడిగానూ ఈ సినిమాలో చూపించారు. అయితే విజయ్ను ఇలా చూపించడం పట్ల కూడా నెట్టింట కొన్ని ట్రోల్స్ కూడా వచ్చాయి.
ది గోట్ 2.59 గంటల సినిమా కాదు! - అసలు రన్ టైమ్ ఎంతంటే? - Vijay The Goat Movie