Telugu Heroes Without Background : ప్రస్తుతం బాక్సాఫీస్ ముందు సిద్ధు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. వసూళ్లు కూడా అదిరిపోయే రేంజ్లో వస్తున్నాయి. నాలుగు రోజుల్లో రూ.100 కోట్ల దిశగా దూసుకెళ్తోంది. ఈ సూపర్ సక్సెస్‌తో స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడద్డ ఇమేజ్ మరింత పెరిగినట్టైంది. బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి టాలెంట్‌తో ముందుకు వెళ్లాలనుకునేవారికి మరో ఉదాహరణగా నిలిచాడు. అయితే సిద్ధుతో పాటు తెలుగు చిత్రపరిశ్రమలో మరి కొంతమంది కూడా టాలెంట్‌తో హీరోలుగా రాణిస్తున్నారు. వారిలో నాని, విజయ్ దేవరకొండ, అడివి శేష్, విశ్వక్ సేన్, నవీన్ పొలిశెట్టి ఇలా పలువురు ఉన్నారు.
నాని - 2008లో అష్టా చెమ్మాతో హీరోగా మారిన నాని అంతకుముందు అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పని చేశారు. అలా మొదలైంది సినిమా అయన్ని నేచురల్ స్టార్ చేసింది. రాజమౌళి ఈగ నాని కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. నాని చేసిన ప్రతి సినిమా హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా ఆయన్ని స్టార్ హీరోగా టాలీవుడ్లో నిలబెట్టింది.
విజయ్ దేవరకొండ - 2011లో నిన్నిలా అనే సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించిన విజయ్ ఆ తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేశారు. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో సపోర్టింగ్ రోల్‌తో గుర్తింపు తెచ్చుకున్న విజయ్ పెళ్లి చూపులుతో హీరోగా నిలబడ్డారు. అర్జున్ రెడ్డితో రౌడి హీరోగా టాలీవుడ్లో స్టార్ స్టేటస్ అందుకున్నారు. మరో రెండు రోజుల్లో ఫ్యామిలీ స్టార్‌గా ఆడియెన్స్‌ను అలరించనున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
అడివి శేష్ - సొంతం సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించారు. ఆ తర్వాత హీరోగా కర్మ అనే సినిమా చేశారు. పవన్ కళ్యాణ్ పంజాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రతో గుర్తింపు తెచ్చుకున్నాక అలాంటి సపోర్టింగ్ రోల్స్ ఉన్న బలుపు, బాహుబలి లాంటి సినిమాల్లో నటించారు. క్షణం ఆయన్ను హీరోగా నిలబెడితే గూఢచారి డిఫరెంట్ కథలను ఎంచుకునే హీరోగా గుర్తింపును ఇచ్చింది.
విశ్వక్ సేన్ - ఈ నగరానికి ఏమైంది ద్వారా టాలీవుడ్‌ను తనవైపునకు తిప్పుకున్న విశ్వక్ సేన్ ఫలక్ నామ దాస్ సినిమాతో మాస్ ప్రేక్షకులకు నచ్చారు. హిట్ సినిమా మరింత మందికి చేరువయ్యాడు. అనంతరం పలు సినిమాల్లో నటిస్తూ ముందుకెళ్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
నవీన్ పొలిశెట్టి - లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో నెగటివ్ రోల్‌తో ఆకట్టుకున్న నవీన్ ఆ తర్వాత హిందీలో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ ద్వారా తనలోని మంచి నటుడు ఉన్నాడని నిరూపించారు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, హిందీలో సుశాంత్‌తో చేసిన చిచ్చోరే సినిమాలతో నటుడిగా మరో స్థాయికి వెళ్లారు. జాతిరత్నాలు సూపర్ సక్సెస్ అందుకున్న ఆయన రీసెంట్గా మిస్టర్ పోలిశెట్టి మిస్ పోలిశెట్టితో అలరించారు.
సిద్దు జొన్నలగడ్డ - ఆరెంజ్ సినిమాలో జెనీలియాను ప్రేమించిన ముగ్గురిలో ఒకడిలా కనిపించిన సిద్ధు ఆ తర్వాత కొన్ని సపోర్టింగ్ రోల్స్‌లో కనిపించారు. కృష్ణ అండ్ హిజ్ లీలా సినిమాతో గుర్తింపు తెచ్చుకుని టిల్లుతో స్టార్ హీరోగా మారారు. ఇప్పుడు టిల్లు స్క్వేర్తో దూసుకెళ్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
అమెరికాలో ఆగని టిల్లన్న జోరు - ఐదు రోజుల్లో ఎన్ని కోట్లంటే? - DJ Tillu Square Collections
రామాయణం మొదలు - యశ్, రణ్‌బీర్ సెట్లోకి జాయిన్ అయ్యేది అప్పుడే! - Ramayana Movie