ETV Bharat / entertainment

'గేమ్ ఛేంజర్'లో అంజలి పాత్ర తెలిసిపోయింది- శంకర్ ప్లాన్ అదుర్స్​! - Anjali Game Changer - ANJALI GAME CHANGER

Anjali Game Changer: 'గేమ్ ఛేంజర్' సినిమాలో టాలీవుడ్ నేచురల్ బ్యూటీ అంజలి పాత్ర తెలిసిపోయింది! మరి ఈ ముద్దుగుమ్మ ఏ పాత్రలో కనిపించనుందంటే?

Anjali Game Changer
Anjali Game Changer (Source: ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 21, 2024, 7:13 PM IST

Anjali Game Changer: టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ మూవీ 'గేమ్ ఛేంజర్'లో నేచురల్ బ్యూటీ అంజలి పాత్ర ఏంటో తెలిసిపోయింది! ఈ సినిమాలో తాను కీ రోల్​కే పరిమితం కాదని అంజలి ఇది వరకే ఓ సందర్భంలో చెప్పింది. తన పాత్రకు సంబంధించి ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌, ఓ పాట ఉంటాయని గతంలో ఆమె అన్నది. అయితే ఆమె చెప్పినట్లుగానే కీ రోల్​కే పరిమితం కాకుండా అంజలి ఈ సినిమాలో హీరోయిన్​ పాత్ర పోషించిందని తెలుస్తోంది.

ఆమె పాత్రకు బలమైన స్కోప్ ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా మూవీలో హీరో రామ్​చరణ్​కు భార్య పాత్ర పోషించిందని ఇన్​సైడ్ టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమాలో రామ్​చరణ్ డ్యుయల్ రోల్​లో కనిపించనున్నారని మొదటి నుంచి ప్రచారం సాగింది. అంటే సినిమా ప్రజెంట్ స్టోరీలో మెయిన్ లీడ్​గా బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ, ఫ్లాక్​ బ్యాక్​లో అంజలి హీరోయిన్​గా కనిపించనున్నారన్న మాట! మరి చూడాలి అసలు అంజలి ఏ పాత్రలో మెరవనుందోనని?

అయితే మరోసారి తన పాత్రపై అంజలి తాజాగా స్పందించింది. తన పాత్ర గురించి ఎక్కువగా మాట్లాడడని, కానీ థియేటర్లలో ప్రేక్షకులు మాత్రం సర్​ప్రైజ్​ ఫీల్ అవుతారని చెప్పింది. కాగా, గ్లోబల్ స్టార్ రామ్​చరణ్​తో అంజలి తొలిసారి గేమ్ ఛేంజర్​తో స్క్రీన్ షేర్ చేసుకుంది. రామ్​చరణ్​తో కలిసి నటించడం మంచి అనుభూతినిచ్చిందని ఆమె అన్నది.

కాగా, ఈ సినిమాలో అంజలి , కియారాతోపాటు , యస్​ జే సూర్య, సునీల్, శ్రీకాంత్ తదితరులు నటించారు. స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను భారీ బడ్జెట్​తో తెరకెక్కించారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్​పై దిల్​రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ్యూజిక్ సంచలనం తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల రిలీజైన 'జరగండి' పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక సినిమా చివరి దశ షూటింగ్ జరుపుకుంటోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తవగానే రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది. అయితే 2024 డిసెంబర్​లోనే మూవీ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్.

ఆ సినిమా కంటే ముందే గేమ్​ఛేంజర్ రిలీజ్ పక్కా!: సూర్య - Game Changer Release

దేవరకు పోటీగా గేమ్​ఛేంజర్​ - క్లారిటీ ఇచ్చిన దిల్​ రాజు కూతురు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.