ETV Bharat / entertainment

పోరాట యోధునిగా తేజ - ఆసక్తికరంగా 'మిరాయ్​' గ్లింప్స్​ - Teja Sajja New Movie - TEJA SAJJA NEW MOVIE

Teja Sajja New Movie : యంగ్ హీరో తేజ సజ్జా ప్రస్తుతం వరుస సినిమాల షూటింగుల్లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన మరో కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్​ను మేకర్స్ విడుదల చేశారు. దాన్ని మీరూ ఓ లుక్కేయండి.

Teja Sajja new Movie
Teja Sajja new Movie
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 18, 2024, 12:19 PM IST

Updated : Apr 18, 2024, 1:54 PM IST

Teja Sajja New Movie : 'హనుమాన్' సినిమాతో మాసివ్ సక్సెస్​ అందుకున్న స్టార్ హీరో తేజ సజ్జా ఇప్పుడు మరో థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. పీపుల్స్​ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్​పై తెరకెక్కుతున్న ఓ సినిమాలో ఆయన లీడ్​ రోల్​లో కనిపించనున్నారు. తాజాగా మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ రివీల్ వీడియోను విడుదల చేశారు. ఈ సినిమాకు 'మిరాయ్​' అనే టైటిల్​ను ఫిక్స్​ చేసినట్లు తెలిపారు. ఆద్యంతం చాలా ఆసక్తికరంగా ఉన్న ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.

కళింగ యుద్ధం తర్వాత యోగిగా మరిపోయిన అశోకుడు గురించి ఈ సినిమా తీయనున్నట్లు గ్లింప్స్ ద్వారా తెలుస్తోంది. అశోకుడిని యోగిగా మార్చిన ఓ గ్రంథం కోసం జరిగే పోరాటమే ఈ సినిమా స్టోరీ. దాన్ని దక్కించుకోవడం కోసం కొందరు దుండగులు ప్రయత్నిస్తుంటారు. అయితే దాన్ని కాపాడటం కోసం ఒక యోధుడు ఉంటాడు. ఆ పాత్రనే హీరో తేజ సజ్జ చేయనున్నారు. ఆ గ్రంథాలను కాపాడేందుకు వచ్చిన హీరో, తనకు ఎదురయ్యే ప్రమాదాలను అధిగమిస్తూ తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడనేదే అసలు స్టోరీ.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈగల్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన కార్తిక్ ఘట్టమనేని ఈ సినిమాకు డైరెక్టర్​గా వ్యవహరిస్తున్నారు. ఇందులో తేజ సజ్జతో పాటు యంగ్ హీరోయిన్ రితికా నాయక్ నటించనున్నారు. మంచు మనోజ్ ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్​ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 18న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లే మేకర్స్ అప్పుడే రిలీజ్​ డేట్​ను కూడా అనౌన్స్ చేశారు. గౌరహరి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

విజువల్స్, బ్యాక్​గ్రౌండ్ స్కోర్​తో పాటు అశోకుడి నేపథ్యంలో సాగే కథ్ ఇలా పలు ఎలిమెంట్స్ కూడా సిినిమాపై అంచలనాలు మరింత పెంచాయి. సాంకేతిక విలువలు కూడా ఉన్నతంగా ఉన్నట్లు గ్లింప్స్ ద్వారా తెలుస్తోంది. ఇదిలాఉండగా, పలు భారతీయ భాషలతో పాటు కొన్ని ఫారిన్​ ఇండియన్ లాంగ్వేజ్స్​లోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

నా దృష్టిలో అదే పెద్ద రిస్క్: 'అద్భుతం' హీరో తేజ

'ఆ సీన్​​ కోసం 5 రోజులు గాల్లోనే- రిలీజ్ తర్వాత చిరు సర్​ రిప్లై ఏంటంటే'

Last Updated : Apr 18, 2024, 1:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.