Tamil film producers on Shootings Ban : తమిళ సినిమా ఇండస్ట్రీలో వరుస వివాదాలు కాకరేపుతున్నాయి. తాజాగా షూటింగ్‌లపై తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలను నడిగర్ సంఘం, కొందరు హీరోలు తప్పుపట్టారు. ముఖ్యంగా నిర్మాతల నుంచి అడ్వాన్స్ తీసుకున్నా, డేట్స్ ఇవ్వడం లేదని హీరో ధనుశ్‌పై తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (TFPC) చేసిన ఆరోపణలు వివాదాస్పదంగా మారాయి.
తాజాగా ఈ విషయమై టీఎఫ్‌పీసీ కార్యదర్శి ఆర్ రాధాకృష్ణన్ మీడియాతో మాట్లాడారు. ‘ఆగస్ట్ 16 నుంచి కొత్త సినిమా షూటింగ్‌లు, నవంబర్ 1 నుంచి సినిమాకు సంబంధించి పూర్తి కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాలంటూ నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉన్నాం. మండలిలోని కీలక సభ్యులు ఆగస్టు 1న సమావేశమై దీనిపై తదుపరి నిర్ణయాన్ని తీసుకుంటాం.’ అని చెప్పారు.
ఇదే విషయమై సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (SIAA), నడిగర్ సంఘం ప్రతినిధులు కూడా స్పందించారు. ధనుశ్ గురించి, అలాగే షూటింగ్‌లపై ముందుగా తమకు చెప్పకుండా నిర్ణయం తీసుకోవడం సరికాదని పేర్కొన్నారు. SIAA వైస్ ప్రెసిడెంట్లలో ఒకరైన పూచి ఎస్.మురుగన్ దీనిపై మాట్లాడుతూ, ‘నవంబర్ 1 నుంచి షూటింగ్‌ను నిలిపివేయాలని నిర్మాతల మండలి తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని మేము ఖండిస్తున్నాం. వచ్చే జనరల్ బాడీలో మా కౌంటర్ యాక్షన్‌పై నిర్ణయం తీసుకుంటాం. సమావేశం ఆగస్టు 15 లేదా ఆగస్టు 16న జరుగుతుంది.’ అన్నారు.
నడిగర్ సంఘం కూడా దీనిపై ప్రకటన జారీ చేసింది. జూన్ 21 వరకు నిర్మాతల మండలి తీసుకొచ్చిన సమస్యల ఫిర్యాదును నడిగర్ సంఘం పరిశీలించి, పరిష్కరించిందని మురుగన్ చెప్పారు. ఇప్పుడు, ఫిర్యాదు గురించి తమకు ముందుగా తెలియజేయకుండా, నిర్మాతల మండలి అకస్మాత్తుగా ధనుశ్ పేరును ప్రచారం చేసిందని, ఇది సరికాదని అన్నారు.
చర్యలను సమర్థించుకున్న TFPC - రాధాకృష్ణన్ మాట్లాడుతూ నటీనటులు, ముఖ్యంగా ధనుశ్ నుంచి కమిట్‌మెంట్ లేకపోవడంతో, ఇంకా షూటింగ్ ప్రారంభించని మూవీలకు అడ్వాన్స్‌లు ఇచ్చిన నిర్మాతలు తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. తమ సభ్యుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా, ప్రస్తుతం ఉన్న ప్రాజెక్ట్‌లను పూర్తి చేసిన తర్వాతే నటీనటులు, టెక్నీషియన్లు కొత్త మూవీలకు సంతకం చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.
"ఆగస్టు 16 నుంచి తాత్కాలికంగా కొత్త సినిమాలకు సంతకం చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాం. కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వచ్చిన తర్వాత షూటింగ్‌లను పునఃప్రారంభించండి. ఈ మధ్య కాలంలో నటీనటులు, టెక్నీషియన్ల ఫీజులు, ఇతర ఖర్చులు భారీగా పెరిగాయి. దీన్ని నియంత్రించి, కొన్ని రకాల పరిమితులు తీసుకురావాలి. నిర్మాతలు పరిష్కారం కనుగొనే వరకు, నవంబర్ 1 నుంచి షూటింగ్‌లు, సినిమాలకు సంబంధిత ఇతర కార్యకలాపాలను ఆపాలని నిర్ణయించాం." అని రాధాకృష్ణన్ అన్నారు.
స్పందించిన హీరో కార్తీ - నవంబర్ 1 నుంచి షూటింగ్‌లపై పూర్తి నిషేధం విధించారని, ఇది చట్టవిరుద్ధమైన నిర్ణయమని కార్తీ పేర్కొన్నారు. ఇది సినిమా నిర్మాణంలో పాల్గొన్న వేలాది మందిని ప్రభావితం చేస్తుందని తెలిపారు.
కేజీయఫ్ గన్‌తో బడ్డీ యాక్షన్ మోడ్ - మోత మోగింది! - Allu Sirish Buddy Release Trailer