ETV Bharat / entertainment

తమన్నా కొత్త సిరీస్​! - దేశమంతా ఉలిక్కిపడేలా చేసిన కేసు! - Tamannah Bhatia New Webseries - TAMANNAH BHATIA NEW WEBSERIES

TAMANNAH BHATIA NEW WEB SERIES : మిల్కీ బ్యూటీ తమన్నా మరో కొత్త ప్రాజెక్ట్​కు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చినట్లు తెలిసింది. దేశమంతా ఉలిక్కిపడేలా చేసిన ఓ కేసు ఆధారంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. పూర్తి వివరాలు స్టోరీలో

source ANI
TAMANNAH BHATIA NEW WEB SERIES (source ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 7, 2024, 7:35 AM IST

TAMANNAH BHATIA NEW WEB SERIES : మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 15 ఏళ్ల వయసులోనే హీరోయిన్​గా ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రమే పరాజయం అయినప్పటికీ ముందుకు సాగింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించి స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది.

ఇండస్ట్రీలో యువ హీరోయిన్ల జోరు ఉన్నప్పటికీ వారికి గట్టి పోటీనిస్తూ వరుస ప్రాజెక్ట్​లను చేస్తోంది. ఆ మధ్య ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చి విజయాల్ని అందుకుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ మరో ప్రాజెక్ట్​కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ప్రీతీ సిమోస్‌ నిర్మించనున్న ఓ కొత్త ఓటీటీ సిరీస్‌లో మిల్కీ బ్యూటీ కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రానున్న ఈ సిరీస్‌లో తమన్నా న్యాయవాదిగా కనిపించబోతున్నట్లు టాక్​.

గతేడాది తమన్నా - ప్రీతి సిమోస్​ కాంబోలో ఆఖరి సచ్‌ అనే ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ వచ్చి మంచి హిట్ అందుకుంది. ఇప్పుడీ కొత్త ప్రాజెక్టును కరణ్‌ జోహార్‌తో కలిసి నిర్మించనున్నట్లు ప్రీతి తెలిపింది. దేశమంతా ఉలిక్కిపడేలా చేసిన ఓ కేసుతో ఈ ప్రాజెక్ట్​ను తెరకెక్కించనున్నట్లు తెలిపింది. కాగా, త్వరలోనే ఈ ప్రాజెక్టు చిత్రీకరణ మొదలుకానున్నట్లు సిరీస్‌ సన్నిహిత వర్గాలు చెప్పాయి. ఇకపోతే ప్రస్తుతం తమన్నా తెలుగు చిత్రం ఓదెల 2 షూటింగ్​తో బిజీగా ఉంది.

ఆ ప్రాపర్టీని అద్దెకు తీసుకున్న తమన్నా! - వామ్మో, నెలకు రూ.19 లక్షలా? - Tamannaah Bhatia Rent 19 Lakhs

ఆ ఒక్క రోజు తమన్నా అస్సలు స్నానం చేయదట - ఎందుకంటే? - Tamannah Bath

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.