ETV Bharat / entertainment

స్టార్ హీరో కళ్లలో ఆనందం - తనయుడిని అలా చూస్తూ ఉండిపోయిన సూర్య - Suriya Son Karate - SURIYA SON KARATE

Suriya Son Karate : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం 'కంగువా' షూటింగ్​లో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా ఆయన తన కుమారుడికి సంబంధించిన ఓ స్పెషల్ ఈవెంట్​లో పాల్గొని సందడి చేశారు. ఆ వీడియో మీరూ చూసేయండి.

Suriya Son Karate
Suriya Son Karate
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 21, 2024, 10:10 PM IST

Updated : Apr 22, 2024, 11:40 AM IST

Suriya Son Karate : సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా కూడా , ఫ్యామిలీ కోసం తన విలువైన టైమ్​ స్పెండ్ చేయడంలో ముందుంటారు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. తన స్పెషల్ మూమెంట్స్​లో తన కోసం ఫ్యామిలీ ఎలాగైతే వస్తుందో, ఆయన కూడా వారికి సంబంధించిన ముఖ్యమైన ఈవెంట్స్​లో పాల్గొని సందడి చేస్తుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా తన కుమారుడు దేవ్​కు సంబంధించిన ఓ స్పెషల్ ఈవెంట్​లో మెరిశారు సూర్య. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది.

కరాటేలో శిక్షణ పొందిన దేవ్ తాజాగా అందులో బ్లాక్ బెల్ట్ సాధించాడు. అయితే, ఈ అవార్డు ప్రధానోత్సవ ఈవెంట్​కు అతిథిగా సూర్య హాజరయ్యారు. తన కొడుకుతో పాటు బ్లాక్ బెల్ట్ సాధించిన అందరిని అభినందించారు. ఆ తర్వాత పిల్లలతో కలిసి ఫొటో తీసుకున్నారు. అయితే పిల్లలందరూ స్టేజ్ నుంచి వెళ్తున్న సమయంలో, తన కొడుకును అలా చూస్తూనే ఉండిపోయారు సూర్య. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. తనయుడిని చూసి గర్వపడుతున్న తండ్రి అంటూ సూర్య అని, క్యూట్ మూమెంట్​, ఫీలింగ్ ఎమోషనల్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇక సూర్య ప్రస్తుతం 'కంగువా' సినిమా షూటింగ్​లో బిజీగా ఉన్నారు. పీరియాడికల్ బ్యాక్​డ్రాప్​తో తెరకెక్కుతుత్న ఈ మూవీ నుంచి శివ్ అండ్ హిస్ టీమ్ అంటూ ఓ ఆసక్తికరమైన గ్లింప్స్ విడుదలై నెటిజన్లను ఆకట్టుకుంది. ఇందులో సూర్యతో పాటు దిశాపటానీ లీడ్ రోల్​లో మెరవనున్నారు. పవర్​ఫుల్ విలన్ రోల్​లో బాలీవుడ్ స్టార్ బాబీ దేవోల్‌ కనిపించనున్నారు. వీరితో పాటు టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు, యోగిబాబు, కోవై సరళ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మరోవైపు దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. స్టూడియో గ్రీస్​ సంస్థ బ్యానర్​పై ఈ సినిమాను జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్నారు. ఇందులో హీరో సూర్య ఆరు భిన్నమైన అవతారాల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. దాదాపు 38 బాషల్లో ఈ సినిమా విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

మరోసారి మంచి మనసు చాటుకున్న సూర్య - ఫ్యాన్స్​కు స్పెషల్​ ట్రీట్​ - ఎందుకంటే ?

'కంగువా', 'తంగలాన్‌' రిలీజ్‌ డేట్స్​ - థియేటర్లలోకి అప్పుడే

Last Updated : Apr 22, 2024, 11:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.