ETV Bharat / entertainment

ఓటీటీలోకి 'కంగువా' మూవీ - రిలీజైన నెల రోజులకే! - SURIYA KANGUVA MOVIE

ఓటీటీలోకి రానున్న 'కంగువా' మూవీ! - ఎక్కడ స్ట్రీమ్​ కానుందంటే?

Kanguva OTT
Suriya Kanguva Movie (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 6, 2024, 2:20 PM IST

Suriya Kanguva Movie : కోలీవుడ్ స్టార్ హీరో తాజాగా 'కంగువా' సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. నవంబర్ 14న విడుదలైన ఈ చిత్రం నెల తిరగకుండానే ఓటీటీలో ఆడియెన్స్​ను అలరించేందుకు సిద్ధం కానుంది. డిసెంబర్‌ 13 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ఇది అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఈ మేరకు ఓ పోస్టర్‌ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఇక అందులో తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో ఇది అందుబాటులో ఉండనున్నట్లు రాసుంది. అయితే ఈ విషయంపై మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

భారీ అంచనాల నడుమ వచ్చిన 'కంగువా' బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్​తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సూర్య, బాబీ దేఓల్ యాక్షన్ అండ్ ఫైట్​ సీన్స్ కొంతమేర అలరించినప్పటికీ, సినిమాలోని పలు ఎలిమెంట్స్​కు అంతగా కనెక్ట్ కాలేకపోయామంటూ అభిమానులు నెట్టింట నిరాశ వ్యక్తం చేశారు. దీంతో కోలీవుడ్​తో పాటు టాలీవుడ్​లోనూ ఈ చిత్రం అంతంతమాత్రంగానే ఆడింది.

స్టోరీ ఏంటంటే :
ఫ్రాన్సిస్ (సూర్య‌) గోవాలో ఓ బౌంటీ హంట‌ర్‌. పోలీసులు కూడా చేయ‌లేని ప‌నులను చేసి దానికి వాళ్ల నుంచి డ‌బ్బు తీసుకుంటుంటాడు. ఏంజెలా (దిశా ప‌టానీ)దీ కూడా ఇదే ప‌ని. ఒక‌ప్పుడు ఈ ఇద్దరూ లవర్సే. కానీ ఆ త‌ర్వాత విడిపోయి ఎవ‌రి దారులు వాళ్లు చూసుకుంటారు. అయితే ఫ్రాన్సిస్, త‌న ఫ్రెండ్​ (యోగిబాబు)తో క‌లిసి ఓ బౌంటీ హంటింగ్ ప‌నిపై ఉన్న‌ సమయంలోనే జీటా అనే ఓ చిన్నారిని క‌లుసుకుంటారు. తనను క‌లుసుకోగానే ఇద్ద‌రికీ ఏదో తెలియ‌ని సంబంధం ఉన్న భావ‌న క‌లుగుతుందని ఫ్రాన్సిస్‌కు. అయితే ఒక సమయంలో ఆ బాలుడి ప్రాణాల‌కి ప్ర‌మాదం ఉంద‌ని తెలుసుకున్న ఫ్రాన్సిస్ ఆ చిన్నారిని కాపాడేందుకు ఎటువంటి సాహ‌సాలు చేశాడు? అస‌లు ఈ జీటాని వెంటాడుతున్నది ఎవ‌రు? జీటా, ఫ్రాన్సిస్‌, 1070 సంవ‌త్స‌రాల నాటి ప్ర‌ణవకోన యువ‌రాజు కంగువా (సూర్య‌)కి మ‌ధ్య సంబంధం ఏంటి? ఇలాంటి విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

'కంగువా'పై జ్యోతిక రివ్యూ- 'అవును అది బాలేదు, కానీ!'

'కంగువా 2'లో దీపికా పదుకొణె? - నిర్మాత సమాధానమిదే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.